వరద నష్టంపై అంచనాలు: ఆదిలాబాద్ కలెక్టర్


ఆదిలాబాద్: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంట నష్టం, గృహాల నష్టం, రోడ్లు, చెరువుల నష్టాల అంచన వేయడానికి జిల్లా కలెక్టర్‌ పి. వెంకటేశ్వర్లు జిల్లా యంత్రాంగంతో తన చాంబర్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్బంగా మాట్లాడుతూ శుక్రవారం కురిసి భారి వర్షాల వలన జిల్లాలోని 12 మండలాలలో 12965 ఎకరాల పంట నష్టం జరిగిందని, దాదాపు 503.60 లక్షల రూపాయల పంట నష్టపరిహారం చెల్లించవల్సి ఉంటుందని అన్నారు. ఉట్నూర్‌, దంతన్‌పల్లి మద్యలో వంతెన కూలిపోవడంవలన, నిర్మల్‌ జన్నారం మధ్యలో దోస్త్‌నగర్‌ వద్ద వంతెన తెగిపోయినందున వీటిని మరమ్మతులు చేయుటకు కావల్సిన నిధులకు ప్రాణాళిక రూపోందించి సమర్పించాలని ఆర్‌.అండ్‌.బి అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అదే విధంగా చెన్నూర్‌, భీమారం, ఇందారం, టెకుమట్లవద్ద త్రాగునీరు పైప్‌లు వరధ ప్రభావం వలన పగలి పోయాయని, దీని మరమ్మత్తులకు దాదాపు 17.69 లక్షలు ఖర్చు అవుతాయని అన్నారు. ఇందులో భాగంగానే వివిధ మండలాలలో 70 ఇండ్లు వర్షాల వలన దెబ్బతిన్నాయని అన్నారు. జిల్లా యంత్రంగంలో అప్రమత్తంగా ఉండి రాబోయే రోజులలో భారి వర్షాలు పడే అవకాశాలు ఉండవచ్చని అందుకు ఇప్పటినుండే జాగ్రత్తవహిస్తూ మండలాల వారిగా పరిశీలించుకోవాలన్నారు. కడెం వద్ద దోస్త్‌నగర్‌ వంతెన పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుకుండా వంతెన ప్రక్కనుండి తాత్కాలిక వంతెన నిర్మించాలని, దీనికి సంబంధించిన అటవీ అధికారులను సంప్రదించి అనుమతి పొందాలన్నారు. అలాగే అప్రమత్తంగ ఉండి వరధల వలన వచ్చే డయేరియా, అతిసార వ్యాధులు ప్రభలకుండా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజలను అవగాహన కల్పించాలని జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. ఏది ఏమైనప్పటికి జిల్లా ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌, డి.ఆర్‌.ఓ చంద్రశేఖర్‌, సి.పి.ఓ రాజేశ్వర్‌, జెడ్‌.పి. సి.ఇ.ఓ ఆర్‌. వేంకటయ్య, నిర్మల్‌ ఆర్‌.డి.ఓ వెంకటేశ్వర్లు, పి.డి. డ్వామ శ్రీధర్‌, ఆర్‌.అండ్‌.బి ఇ.ఇ. అశోక్‌ కుమార్‌, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు యం. మురళిధర్‌ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాణిక్‌రావు వివిధ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: