దీపావళి హాస్యకథల పోటీకి రచనలు ఆహ్వానం


ఆదిలాబాద్: ఆంధ్రప్రదేశ్‌ మాసపత్రిక నిర్వహిస్తున్న దీపావళి హాస్యకధల పోటీకి ఉత్సాహవంతులైన రచయితలు తమ కధలను పంపించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, కమీషనర్‌ సి.పార్ధసారధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలో ఉత్తమమైనవిగా ఎంపికైన మూడు కధలకు నగదు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని, మొదటి బహుమతి 15,000 రూపాయలు, ద్వితియ బహుమతి 12,000/- రూపాయలు తృతీయ బహుమతి 8,000/- రూపాయలు అందజేయడం జరుగుతందని, సాధరణ బహుమతులకు ఎంపికైన కధలకు 1000/- రూపాయల వంతున పారితోషికం ఉంటుందని, కధ నిడివి ముద్రణలో రెండు పేజీలకు మించకుండా, పేజికి ఒకవైపు మాత్రమే రాయాలని, రచయిత పేరు కధకి జతపరిచే హామి పత్రంతో ఉండాలని, రచయితల చిరునామా స్పష్టంగా ఉండాలని, అశ్లీలత, కులమతాలను రెచ్చగొట్టే విధంగా ఉండకుండా, రాజకీయ, వ్యక్తిగత దూషణలు, వెకిలితనం లేకుండా తెలుగు సంస్కృతికిక దగ్గరగా ఉండాలని, ఒక రచయిత ఒక కధనే పంపాలని, ఎంపిక కాని కధలను త్రిప్పి పంపాలని కోరేవారు అందుకు అవసరమైన స్టాంపులు అంటించిన కవర్సను జతచేయాలని, న్యాయనిర్ణేతల కమిటి బహుమతి పొందే కధలను ఎంపిక చేస్తుందని, కధలను సెప్టెంబర్‌,15 లోగా ప్రధాన సంపాదకులు, ఆంధ్రప్రదేశ్‌ మాసపత్రిక, సమాచార భవన్‌, ఎ.సి.గార్డ్స్‌, మాసాబ్‌ ట్యాంక్‌, హైదరాబాదు పేరుమీద పంపించాలని కమీషనర్‌ ఆ ప్రకటనలో తెలిపారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: