తెలంగాణపై ఇక కార్యాచరణ


హైదరాబాద్‌: తెలంగాణ విషయంలో చర్చల దశ దాటిపోయిందని, ఇక కార్యాచరణే తరువాయి అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. సమయం ఆసన్నమైందని.. రెండ్రోజుల్లో తాము ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి తెలంగాణ విషయమై మాట్లాడతామని చెప్పారు. ఆలోగా ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు సీనియర్‌ నేతలతో చర్చించి కార్యాచరణ రూపొందించుకుంటామని తెలిపారు. లగడపాటి , కావూరి వంటి ఆంధ్రా ఎంపీలతోనూ మాట్లాడుతున్నామన్నారు. సామరస్యంగా విడిపోదామన్న భావన సీమాంధ్రుల నుంచి వస్తోందన్నారు. కాంగ్రెస్‌లో తెలంగాణకు ఉన్న ఆటంకాలను తొలగిస్తామని చెప్పారు. ఆదివారమిక్కడ ఆయన ఎంపీ వివేకానంద, ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డిలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ తెచ్చేది-ఇచ్చేది కాంగ్రెస్‌ అని తాము ఎంత చెప్పినప్పటికీ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయామని, ప్రజలు తమను నమ్మలేదనేది నిజమని చెప్పారు. ఉప ఎన్నికల్లో పోటీ వద్దని సోనియాకు చెప్పి ఒప్పించడంలో విఫలమయ్యామన్నారు. తమను తాము సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే సోనియా కనీసం ప్రకటన చేయకపోవడం, రాష్ట్రానికి రాకపోవడంపై అడిగిన ప్రశ్నకు కేకే స్పందిస్తూ.. ”ఆత్మహత్యలపై విచారం వ్యక్తం చేశాం.. ఇంకేం చేయాలి.. సోనియాగాంధీ వస్తే సరిపోతుందా? తెలంగాణ పట్ల మేడమ్‌కి సానుభూతి ఉంది. ఆ విషయం మాకు తెలుసు, గుండెలు చీల్చి చూపలేం.. కానీ, ప్రజలకు వివరిస్తాం” అని చెప్పారు. 2006 ఉప ఎన్నికలకు నేటికీ మార్పు ఉందని, ఇప్పుడు ప్రజల్లో భావోద్వేగం ఎక్కువగా కనిపిస్తోందని వివరించారు. వైఎస్‌ లేకపోవడం పార్టీకి నష్టం కలిగించిందా అన్న ప్రశ్నకు.. ”వైఎస్‌ రెండుమార్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా పార్టీ ఓడిపోయింది” అని చెప్పారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: