అర్హులైన ప్రతి విద్యార్ధికి స్కాలర్‌షిప్


హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన ప్రతి విద్యార్ధికి స్కాలర్‌ షిప్పులు అందించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కోణిజేటి రోశయ్య స్పష్టంచేశారు. గుంటూరుకు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సుమారు 7 కోట్ల రూపాయలతో నిర్మించిన ఓపెన్‌ ఆడిటోరియం, కెమిస్ట్రీ బ్లాక్‌, యోగా భవనం, మహిళా వసతి గృహాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్ధులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ స్కాలర్‌ షిప్పుల పంపిణీలో అవకతవక లు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిని నియంత్రించేందుకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించినట్లు చెప్పారు. ఈ సంఘం పర్యవేక్షణలో స్కాలర్‌ షిప్పులు సక్రమంగా పంపిణీ జరిగేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి స్కాలర్‌ షిప్పుల విషయమై ఉపసంఘం సమీక్షిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. క్షేత్రస్ధాయిలో కొంతమంది విద్యార్ధులు నాలుగు రకాలుగా స్కాలర్‌ షిప్పులు పొందుతున్నట్లుగా తమకు తెలియవచ్చిందని, దీనిని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి ఏక కాలంలో 15 విశ్వవిద్యాలయాలను నెలకొల్పడం హర్షదాయకమని ఆయన చెప్పారు. ప్రపంచ ప్రమాణాలతోకూడిన విద్యను అందరికీ అందించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సంవత్సరాల వైద్య కోర్సును అభ్యసిస్తున్న ఒక్కోక్క విద్యార్ధికి 30 లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే గ్రామీణ ప్రాంతాలలో వైద్య సౌకర్యాలను అందించేందుకు డాక్టర్లు ముందుకు రాకపోవడం విచారకరమని ఆయన అన్నారు. ఇకనైనా డాక్టర్లు గ్రామీణ ప్రాంత పేదప్రజలకు మెరుగైన వైద్యసౌకర్యాలను అందించి రాష్ట్రానికి ప్రపంచ ఖ్యాతి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. నాగార్జున విశ్వవిద్యాలయుం అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరుకు తగు చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ రోశయ్య విశ్వవిద్యాలయ యాజమాన్యానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మీ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పిల్లి సుబాస్‌చంద్రబోస్‌, మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, మోపిదేవి వెంకట రమణారావు, డొక్కా మాణిక్య వరప్రసాదరావు, గాదె వెంకట రెడ్డి, శాసన మండలి ఉపాధక్షులు మహమ్మద్‌ జానీ, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ కె.విజయ, పార్లమెంట్‌ సభ్యులు రాయపాటి సాంబశివరావు, రాజ్యసభ సభ్యులు జె.డి.శ్రీలం, శాసన మండలి సభ్యులు సింగం బసవపున్నయ్య, రాయపాటి శ్రీనివాస్‌, కె.ఎస్‌.లక్ష్మణరావు, టి.జి.వి.కృష్ణా రెడ్డి, శాసన సభ్యులు జిల్లా కలెక్టర్‌ బి.రామాంజనేయులు, ఐ.జి. కె.ఆర్‌.ఎం.కిషోర్‌ కుమార్‌, ఎస్‌.పి.దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌, వివిధ శాఖలకు చెందిన అధికారులు, అనధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: