శత్రువుల నుంచి కాపాడిన రాయులు!


కర్నూలు: దక్షిణ భారత దేశాన్ని శత్రురాజుల కన్నెత్తు చూడకుండా కాపాడిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలని, ఆయనను స్పూర్తిగా తీసుకుని రాయల ఘన కీర్తిని రాబోయే భావి తరాలకు చాటి చెప్పాల్సిన అవసరం ఉందని, జిల్లా పౌరసంబంధాలశాఖాధికారి పి. తిమ్మప్ప విద్యార్దులకు పిలిపునిచ్చారు. శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ది మహోత్సవాలను పురష్కరించుకుని కెవిఆర్‌ కళాశాల అసెంబ్లీ హాలులో చరిత్ర, తెలుగు, లైబ్రరీ, జెకెసి లెక్చరర్లు, విద్యార్దుల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో, బుక్‌, స్లైడ్స్‌, ఎగ్జిబిషన్‌ను జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషిక్తుడై 500 సంవత్సరాలు గడిచినప్పటికి రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ రాంశంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో రాయల ఉత్సవాలు అంగ రంగ వైభోగంగా భారీ ఎత్తున జరపడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని, శ్రీకృష్ణదేవరాయలు తన 20వ ఏట లోపలనే పట్టాభిషిక్తుడై విజయనగర సామ్రాజ్యాన్ని దాదాపు 25 సంవత్సరాల పాటు పరిపాలించి తరతరాలకు తరగని కీర్తిని సంపాదించాడన్నారు. ఆయన పరిపాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని, రాయలేలిన సీమలో రతనాలు పోసి అమ్మినారు ఇచట అని ఆయన రాయల ఘనకీర్తిని కొనియాడారు. ఆయన పరిపాలనలో కత్తిని , కలాన్నీ సమానంగా చూసిన ఏకైక రాజు అన్నారు. శ్రీకృష్ణదేవరాయల దర్బార్‌కు తగినంత హోదా కెవిఆర్‌ కళాశాలకు ఉందని, ఆయన మరో సారి అలనాటి కర్నూలు రాజధానికి నిలయమైన కళాశాలను విద్యార్దులకు గుర్తు చేశారు. రాయల పరిపాలనలో కళాకారులను కవులను పెంచి పోషించడమే గాక క్రమశిక్షణకు మారుపేరుగా ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకుని భావి తరాలకు ఉపయోగపడేలా చాటి చెప్పాలన్నారు. బాగా చదువుకుని సమాజంతో పాటు ఇతరులకు ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని, ఆగష్టు 2వ తేదిన జరిగే ర్యాలీలో విద్యార్దులు పాల్గోనాలి ఆయన పిలుపునిచ్చారు. ట్రైనీ డిప్యూటి కలెక్టర్‌ సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ రాయల స్వర్ణ యుగాన్ని తిరిగి మనమందరం కలిసి చాటి చెప్పాల్సిన అవసరముందని, సంపద, కోరికలు, మార్గాలను ఎంచుకొనే సమాజంలో మనమున్నామని, ఆ లక్ష్యంగా చదువుకుని బాగా ఎదగాలన్నారు. ప్రజలను కన్న బిడ్డల వలే తన పరిపాలనలో చూసినందుకే శ్రీకృష్ణదేవరాయలకు ఇంతటి ఘన కీర్తిని వచ్చిందని అన్నారు. కందనవోలు రచయిత చొక్కపు నారాయణస్వామి మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల పట్టుదల, క్రమశిక్షణ కళాపోషకుడిగా పేరు పొందిన వారిలో రాయల ఒకరని, చిత్తూరు జిల్లాలో జన్మించి చంద్రగిరి నుండి ఏడుకొండల శ్రీనివాసుని దర్శించుకోవడమేగాక నిత్యం సేవలు చేసేవాడన్నారు. ఆ శ్రీనివాసులు కృప పల్లే ఆయన పేరు ప్రతిష్టలు కలకాలం గుర్తుండేలా పరిపాలన చేశారన్నారు. కొండారెడ్డి బురుజును అచ్యుతరాయులు నిర్మిస్తే కొండారెడ్డి పేరు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన గుర్తు చేశారు. కళాశాల ప్రిన్సిపల్‌ అనిలాకుమారి మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు తమ కళాశాలలో నిర్వహించినందుకు పౌరసంబంధాల శాఖాధికారిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవర్‌ ప్రాజెక్టు ద్వారా రాయల ఘన కీర్తిని విద్యార్దులకు స్క్రీనింగ్‌ చేసి చూపించారు. ఈ సమావేశంలో కళాశాల లెక్చరర్లు, ఎస్‌ జయలక్ష్మి, డా. మాధవీలత, ఇందిరాశాంతి, బాలరాజు, రాజ, ఐజయ్య, విద్యార్దునులు పాల్గొన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: