మావోయిస్టుల ఏరివేతలో గ్రేహౌండ్స్‌ దళాలు


కర్నూలు: అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేయడం సర్వసాధారణం. రోశయ్య ప్రభుత్వం వచ్చాక కూడా మావోయిస్టులపై పోలీసుల గురి తప్పడం లేదు. పోలీసుల పై పగ తీర్చుకునేందుకు మావోయిస్టులు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉంది. గ్రీన్‌హంట్‌లో భాగంగా మావోయిస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు మావోయిస్టులు పగ తీర్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో దేశాన్ని పరిరక్షణలో ఉండే నిరంతరం పోరాడే జవాన్లను కూడా మావోయిస్టులు మట్టుపెట్టారు. దీంతో కేంద్రం కూడా తీవ్రంగా పరిగణించిన విషయం పాఠకులకు విధితమే. ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్దాయిలో ఎదురుదెబ్బలు తిన్న మావోయిస్టులు ప్రతికార చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. బుధవారం నుండి ఆగష్టు మొదటి వారం వరకు మావోయిస్టులు నివసించే ప్రాంతాల్లో అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నారు.ఈ సమావేశాలకు హజరయ్యే ప్రతినిధులకు అవసరమైన కూరగాయాలు, బియ్యం వంటి నిత్యావసర సరుకులను ఇప్పటికే చేరువేసుకున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే నల్లమల్లలో గ్రేహౌండ్స్‌ దళాలు కూడా మావోయిస్టుల కోసం వెతుకులాట ప్రారంభించడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొని ఉంది. పోలీసు శాఖ సమాచారం మేరకు నల్లమల్లలో మావోయిస్టులు లేరని వాదిన , మరో వైపు గ్రౌహౌండ్స్‌ దళాలు మోహరిస్తున్నాయి. ఈ సారి దాడులకు మైదాన ప్రాంతాలపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల పోలీసుస్టేషన్‌లలోనూ, అక్కడ దుర్భేద్యంగా ఉన్న స్థావరాలపై కూడా దాడులు చేసే అవకాశాలున్నాయని సమాచారం. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాలకు గ్రేహౌండ్స్‌ దళానికి చెందిన రెండు కంపెనీల భద్రతా బలగాలు తరలివెళ్ళాయి. ఛత్తీస్‌ఘడ్‌- ఒడిషా సరిహద్దుల్లో నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించి దాడులు, విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. శాఖమూరి అప్పారావు, ఆజాద్‌ వంటి అగ్రనేతల నకిలీ ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఆంధ్ర రాష్ట్ర పోలీసులపై ఈ వారోత్సవాల సందర్భంలోనే దాడులకు పాల్పడతామని ఒడిషా రాష్ట్ర మావోయిస్టు కార్యదర్శి సునీల్‌, ఏవోబి కార్యదర్శి భాస్కర్‌ పర్లాకిమిడిలో ఒకపత్రికా ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది. సాధారణంగా గిరిజనులకు ఇంతభారీ ఎత్తున సరుకులు కొనాల్సిన అవసరం ఉండదు. వారాంతపు సంతలలో ఏ వారానికి ఆ వారం గిరిజనులు సరుకులు కొనుగోలు చేయడం పరిపాటి. అయితే మావోయిస్టుల ఆదేశాల మేరకే వారోత్సవాలకు సహకరించేందుకు ఇంతపెద్దఎత్తున సరుకులు కొంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్‌ సమాచారంతో సమన్వయ పర్చుకుంటూ మావోయిస్టుల దాడులను ఎదుర్కొనేందుకు సమర్థమైన వ్యూహాలను రచిస్తున్నట్లు సమాచారం.. ఇటివల అగ్రనేతలను కోల్పోయిన మావోయిస్టులు వారోత్సవాల సందర్భంగా భారీ దాడులకు పాల్పడే అవకాశం లేకపోలేదని సమాచారం. అయితే కర్నూలు జిల్లాలోని నల్లమల్లలో దాడులకు పాల్పడే అవకాశాలు తక్కువుగా ఉన్నా, పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో కూడా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. వారు కూడా మావోయిస్టుల నుండి ఇబ్బందులు పడుతున్నా, మరో వైపు పోలీసులు కూడా వారిని వేదిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నక్సలిజం అడ్డంకిగా మారుతోందని ముఖ్యమంత్రి రోశయ్య ఇటీవ ల ప్రకటన చేయడంతో మావోలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. . మైదాన ప్రాంతాలతోపాటు గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ మావోయిస్టుల ప్రభావంతో ఆ ప్రాంతాలలో ఆశించిన మేరకు అభివృద్ధి జరగడం లేదని ముఖ్యమంత్రి వాదన ఎంతవరకు సబబో ప్రభుత్వమే ఆలోచించుకోవాలన్న రీతిలో మావోయిస్టులు వాదించే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా మావోయిస్టులపై ప్రభుత్వం విమర్శిస్తే దానిని మావోయిస్టుల అగ్రనేతలు ఖండిస్తారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై నిశితమైన దృష్టిని సారించామని కానీ నక్సల్‌ కార్యకలాపాలు ఆటంకంగా మారాయని ముఖ్యమంత్రి వాదన కొంత మేరక వాస్తవమైనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాలలో మావోయిస్టుల కార్యకలాపాలు రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ సమర్థంగా వారి వ్యూహాలను తిప్పికొడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రభుత్వం చూస్తుందని చెప్పక తప్పదు. నక్సల్స్‌ వ్యవహరం సామాజిక,ఆర్థిక సమస్య నుంచి శాంతి భద్రతల సమస్యగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద మావోయిస్టులు తలపెట్టిన అమరవీరుల వారోత్సవాలు సరిహద్దు ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లోని పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక వైపు మావోయిస్టులు అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్న తరుణంలో సీమ ఐజి సంతోష్‌మెహ్రా పర్యాటన మరింత ఉత్కంఠకరంగా మారింది. ఏదిఏమైనా నల్లమల్లలో మావోయిస్టులు లేరని పోలీసులు వాదిస్తున్న తీరు ఎలా ఉన్నా రానున్న రోజుల్లో పోలీసులు వాదన వాస్తవమైతే ఇంతకంటే ఏమి కావాలి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: