భక్తిప్రవత్తులతో కూడారై ఉత్సవం


భద్రాచలం: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో కూడారై ఉత్సవాన్ని ఆదివారం భక్తిప్రవత్తులతో నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా 27వ రోజు విశేషంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. తొలుత స్వామికి సుప్రభాత సేవ, ఆరాధన, నివేదన, తిరుప్పావై సేవాకాలం, ఆండాళ్‌ తిరవీధి సేవ జరిగింది. శ్రీసీతారామచంద్రస్వామికి 108 గంగాళాలతో పాయసం నివేదన చేశారు. సామూహిక పూజలు జరిగాయి. ఈ ఉత్సవం అన్నా చెల్లెళ్ల ఉత్సవంగా కూడా పరిగణిస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా ఆండాళమ్మకు ప్రత్యేక పూజలు చేసి భక్తులు పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించారు. ఈ ఉత్సవంలో దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌ పాల్గొన్నారు. ప్రధానార్చకులు పొడిచేటి రామచంద్రాచార్యులు, స్థానాచార్యులు స్థలసాయి, రామస్వరూపాచార్యులు తదితరులు ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి నిత్యకళ్యాణం కూడా ఈ ప్రాంగణంలోనే నిర్వహించారు. విశేషంగా అలంకరణతో భక్తులు తన్మయత్వంలో మునిగి పోయారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: