బడ్జెట్‌లో తెలంగాణ వాటా తేల్చాలి : కాంగ్రెస్‌ నేతలు


హైదరాబాదు: తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు తమ నియోజక వర్గాల్లో తిరగలేని పరిస్థితినుంచి బయట పడేందుకు వ్యూహాన్ని రచించారు. తాజా బడ్జెట్‌లో తెలంగాణ ప్రాంతానిి ఎన్ని నిధులు కేటాయించారో తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఏ రంగానికి ఎన్ని నిధులు కేటాయించారో పూర్తి వివరాలు తెలపాలని కోరుతూ తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి రోశయ్యకు లేఖ రాశారు. శాసన సభ, మండలి సభ్యులు విడివిడిగా ఈ లేఖలపై సంతకాలు చేశారు. ఈ లేఖల ద్వారా తామూ తెలంగాణ ఉద్యమంలో బాగస్వాములమవుతున్నామనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికి ప్రజప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: