ఉత్తమ ఫోటో గ్రఫీ పోటీలు


కర్నూలు: అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 19వ తేది రాష్ట్ర స్దాయి ఫోటో గ్రఫీ నిర్వహిస్తున్నట్లు సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్‌ సి. పార్దసారధి ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలలో పాల్గోనే వారు ఈ నెల 31వ తేదిలోగా 8 ఇన్‌టూ 12 , 10 ఇన్‌టూ 12 సైజు గల మూడు కలర్‌ ఫోటోలను మాత్రమే సంబంధిత సబ్జేక్టుపై పంపాలన్నారు. మొదటి విభాగం కింద ఆరోగ్యశ్రీ, గ్రామీణ ఉపాధి, రైతేరాజు, రెండవ విభాగం కింద స్త్రీ శక్తి, పల్లెవెలుగులు, ఆటవిడుపు, మూడవ విభాగం కింద ఆంధ్రప్రదేశ్‌లోని అత్యుత్తమ ఫోటో చిత్రాలను ఎంపిక చేసుకుని పంపాలన్నారు. పోటీలలో ఎంపికైన ఫోటో చిత్రాల విజేతలకు బహుమతిగా 15 వేలు, ద్వితీయ బహుమతిగా 10 వేలు, తృతీయ బహుమతిగా 6 వేల రూపాయలతో పాటు 10 మందికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున కన్సొలేషన్‌ బహుమతులు ఉంటాయని ఆయన తెలిపారు. ఆగష్టు 2009 తర్వాత తీసిన ఫోటోలను మాత్రమే ఎంపిక చేసుకుని ఫోటో వెనుక భాగమున పర్తి చిరునామా రాసి పంపాలన్నారు. ఫోటోలను డిప్యూటి డైరెక్టర్‌, (ఫోటో అండ్‌ ఎగ్జిభిషన్‌), సమాచార పౌర సంబంధాల శాఖ రెండవ అంతస్తు, సమాచార భవన్‌, ఎసి గార్డ్స్‌, హైదరాబాద్‌ 500 028 అనే చిరునామాకు పంపాలని , ఇతర వివరాల కోసం డిప్యూటి డైరెక్టర్‌ 9949351540, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ 9949351522 సంప్రదించాలని కమీషనర్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: