బీసీల అభ్యున్నతికి కృషి


తిరుపతి: రాజ్యంగబద్దంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ లజిస్టేటివ్‌ వెనక బడిన తరగతుల సంక్షేమ కమిటి రాష్ట్రంలో ఉన్న వనక బడిన తరగతుల వారి హక్కులను కాపాడటానికి, వారి అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తుందని కమిటి చైర్మన్‌ తిప్పేయస్వామి అన్నారు. వెనక బడిన తరగతుల వారికి తిరుమల తిరుపతి దేవస్దానంలో అమలవుతున్న రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పై గురువారం స్ధానిక పద్మావతి అతిథి గృహంలో టి టి డి అధికారులతో కమిటి సమావేశం జరిగింది.రిక్రూట్‌మెంట్‌, పదోన్నతులు, రజకులు, నాయిబ్రాహ్మణులు మొదలగు వారికి సంబందించిన పలు విషయాలను కమిటీ నిశితంగా చర్చించింది. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోచైర్మన్‌ మాట్లడుతు . బి.సి ఉద్యోగులకు సంబందించి షోకల్‌ పాయింట్స్‌, వారి పదోన్నతులపై, రెగ్యులరైజేషన్‌ లాంటి విషయాలను అదికారులతో చర్చించడం జరిగింద న్నారు. అర్చన మిరాశీదారులకు ఇస్తున్న సంభావన మాదిరిగానే ఇతర రజక, నాయిబ్రాహ్మణులకు కూడా గౌరవ వేతనాన్ని ఇచ్చేందుకు పరిశీలించాలన్నారు. కాంట్రాక్టు బేసిస్‌ క్రింది నియమించె  ఉద్యోగులలోరూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాలని తెలిపారు. రజకులకు సౌలభ్యంగా దోబిఘాట్‌లను ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. తమకు వచ్చిన విజప్తులను, సమస్యలను తి తి దే కు పంపిస్తామని, వాటిపైవారు ఏవిదమైన చర్యలను తీసుకున్నారన్న (ఆ-షుn ిశీ|n |ూుసష) దానిపై హైదరాబాదులో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశానికి టి టి డి కార్యనిర్వహణా ధికారి (ఇ.ఓ)తో పాటు సంబందిత అధికారు లందరు తప్పక హజరు కావాలన్నారు. రాష్ట్రం మొత్తం మీద 2040 సంక్షేమ హాస్టళ్లు ఉన్నా యన్నారు. ఇటీవల 300 బాలుర వసతి గృహలను ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిందని ఆయన తేలిపారు . వసతి గృహల్లో ఖచ్చితమైన నిభందనలను పాటించాలని లేనిచే సంబందిత అధికారులపై ఖరిన చర్యలు తీసుకుంటామన్నారు . ఈనెల 30న జిల్లాకేంద్రం చిత్తూరులో ఆర్‌& బి గెస్ట్‌ హౌస్‌ నందు ఉదయం 10గంటలకు ప్రజల నుండి విజప్తులను స్వీ కరిస్తామన్నారు . ప్రజలు ఈ అవకా శాన్ని సద్విని యోగం చేసు కోవలన్నారు. ఈ కార్య క్రమంలో కమిటీ స భ్యు లు శ్రీ వి. మిత్రసేన, శ్రీ బి.మస్తాన్‌రావు, శ్రీ చందనరమేష్‌, శ్రీ బి.కే .పార్దసారధి, శ్రీ బి.రాధాకృష్ణయ్య, శ్రీ బి .లక్ష్మినారాయణ, శ్రీ యం.బిక్షపతి యాదవ్‌, టి టి డి జె.ఇ.వొ.యువరాజు, ఆర్దిక సలహదారు శ్రీ ఎల్‌.బి.బాస్కర్‌ రెడ్డి , చీ ప్‌ఇంజనీరు శ్రీ చంద్రశేఖర రెడ్డి, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటి ఇ.వొ(సర్విసెస్‌) శ్రీ టి.ఎ.పి.నారాయణ తదితరులు పాల్గోన్నారు .సమావేశానికి ముందు ప్రజలనుండి విజప్తులను కమిటీ స్వీకరించింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: