పర్యావరణ కాలుష్య నివారణకు కార్యచరణ


విశాఖపట్నం: విశాఖ నగర పర్యావరణ కాలుష్య నివారణకు సమగ్రకార్యచరణ ముసాయిదా రూపొందించినట్లు జిల్లా కలెక్టర్‌ జె.శ్యామలరావు పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పర్యావరణ కాలుష్యనివారణకు సమగ్ర కార్యాచరణ ముసాయిదాపై జరిగిన చర్చా కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ.పి పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ అండర్‌ సెక్రటరీ, సభ్యులు, ఏ.పి పొల్యూషన్‌ బోర్డు అధికారులు, వివిథ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ పర్యావరణ కాలుష్య నివారణ పై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ నగరాన్ని కాలుష్య రహితంగా రూపొందించడానికి అన్నిసంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పలుమార్లు అవగాహనా సదస్సులు, సమావేశాలు, సమీక్షలు నిర్వహించడం ద్వారా ప్రజలలో కాలుష్యం, నివారణ, గురించి అప్రమత్తం చేసారని వెల్లడించారు. కేంద్ర- రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు కాలుష్యకారకులు, నియంత్రణ పై దృష్టిసారించాయని తద్వారా సమగ్ర పర్యావరణ కాలుష్య నివారణకు సమగ్ర కార్యాచరణ ముసాయిదా రూపొందించాయని పేర్కొన్నారు. ఇప్పటికే అత్యధిక కాలుష్యానికి కారణభూతమవుతున్న ఏడు పరిశ్రమలను గుర్తించి కాలుష్య నివారణ పద్ధతులు పాటింప చేస్తున్నట్లు వెల్లడించారు. ఆదేవిధంగా వాహనాల వలన సంభవించే కాలుష్యాన్ని తగ్గించడానికి రవాణా శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖపట్నం పోర్టుట్రస్ట్‌, ఎస్సార్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ మెస్సర్స్‌ రెయిన్‌ సి11 ఇండియా లిమిటెడ్‌, ఆంధ్రాపెట్రో కెమికల్స్‌ హిందుస్థాన్‌పెట్రోలియం కార్పోరెషన్‌, కోరమండల్‌ ఫెర్టిలైజర్స్‌ హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ తో బాటు జి.వి.యం.సి మురుగునీటిశుద్ది కేంద్రము, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ , వాహనాల వలన సంభవించే కాలుష్యాలను గుర్తించారని, నివారణ చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఏ.పి పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అండర్‌ సెక్రటరీ భాస్కర్‌, బోర్డు సభ్యులు కామేశ్వరరావులు చేపట్టిన చర్యలు, కార్యాచరణ ప్రణాళిక అంశాలను వివరించారు. జాయింట్‌ కలెక్టర్‌ పోలా భాస్కర్‌ఒ అత్యవసర కాలుష్య కారకాలైన ఏడు ప్రభుత్వరంగసంస్థలు చేపట్టిన చర్యలను సమీక్షిస్తూ, మరింత కాలుష్యం తగ్గించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కాలుష్యనివారణ బోర్డు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి మోనిటర్‌ చేయాలని కోరారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: