మక్కామసీదులో పేలుళ్లకు మూడేళ్ళు!

హైదరాబాద్: రాష్ట్రాని‌కే తలమానికంగా, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మక్కా మసీద్‌లో పేలుళ్లు జరిగి మూడేళ్లు. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పేట్రేగిన ముష్కరులు… మొత్తం 14 మందిని బలిగొన్నారు. ఘటన జరిగి మూడేళ్లు కావస్తున్నా ఇంత వరకూ నిందితుల ఆచూకి కనిపెట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. నగర చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటన అనేక మందిని కలచివేసినా నగర వాసుల మనోధైర్యాన్ని మాత్రం దెబ్బతీయ లేకపోయింది. మక్కా మసీద్… నిత్యం ప్రార్థనలతో… సందర్శకుల రద్దీతో… అడుగడుగునా [...]

అటవీభూముల పరిరక్షణకు ప్రత్యేక పోలీసు బృందాలు

పీఏసీ సూచన అటవీశాఖ పనితీరుపై సమీక్ష హైదరాబాద్‌: రాష్ట్రంలో అటవీ ప్రాంతం క్రమంగా తగ్గిపోతోందని, అడవుల పెంపకాన్ని ప్రోత్సహించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) రాష్ట్ర అటవీశాఖ ముఖ్యకార్యదర్శికి సూచించింది. నాగం జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారమిక్కడ శాసనసభా కమిటీ హాలులో ప్రజాపద్దుల సంఘం సమావేశమై అటవీశాఖ పనితీరును సమీక్షించింది. 1997 నుంచి ఆడిట్‌ శాఖ అభ్యంతరాలు, వాటికి ఇచ్చిన సమాధానాలు, వివిధ ఆరోపణలపై చేసిన దర్యాప్తులు, తీసుకున్న చర్యలను ప్రధానంగా సమీక్షించారు. మిగిలిన శాఖలతో [...]

తుపానుపై సిఎం సమీక్ష

హైదరాబాద్: తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రోశయ్య కోరారు. తుపానుపై మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని…. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. మచిలీపట్నానికి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుపాను ప్రభావంతో టవర్లు, కట్టడాలు కూలే అవకాశం ఉందన్నారు. అన్ని ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా [...]

యుద్ధప్రాతిపదికన చర్యల్లో దిగిన సర్కారు

హైదరాబాద్: రాజకీయం, తీవ్రవాదం, వేర్పాటువాదం అన్నీ మరుగునపడిపోయాయి.. అటు జనంలోను, ఇటు సర్కారులోనూ ఇప్పుడంతా లైలా భయమే. తుపాను ముప్పు తీరాన్ని తాకడంతో.. సహాయచర్యలంటూ ప్రభుత్వం, ముందస్తుజాగ్రత్తల్లో జనం నిమగ్నమయ్యారు. సెలవు రద్దు చేసిమరీ అధికారులను పరుగుపెట్టిస్తోంది ప్రభుత్వం. వీలైనంత నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన చర్యల్లో దిగింది సర్కారు. ఉత్తర, దక్షిణకోస్తాల్లో తుపాను అలజడి షురూ అవడంతో.. ప్రభుత్వం ముందే మేలుకుంది. సెక్రటేరియట్, కలెక్టరేట్లలో కదలిక కనిపించింది. స్వయంగా రంగంలో దిగిన ముఖ్యమంత్రి ఉన్నతాధికారులు, మంత్రులతో [...]

టీటీడీ సిబ్బందిపై హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు

హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానంలో సిబ్బంది దురుసు ప్రవర్తన, సౌకర్యాల లేమిపై కొందరు భక్తులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. గంటలు తరబడి క్యూలైన్లలో నిలబడి స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులపై టీటీడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఈ నెల 22వ తేదీలోగా నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ సుభాషణ్‌రెడ్డి టీటీడీ ఈవోను ఆదేశించారు.

గోపీచంద్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ చిత్రం

హైదరాబాద్‌: వైష్ణో అకాడమీ పతాకంపై ఇడియట్‌, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిలాంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్ని, ‘పోకిరి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ని నిర్మించిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ తాజాగా గోపీచంద్‌తో ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శక, నిర్మాత పూరి జగన్నాథ్‌ వివరిస్తూ ‘గోపిచంద్‌ హీరోగా నిర్మించి ఈ చిత్రం పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. వైష్ణో అకాడమీ బ్యానర్‌పై నవంబర్‌లో ప్రారంభించి సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేస్తాం. ఇక నుంచి [...]

కరవు పల్లెలకు సిఎం పలకరింపు

హైదరాబాద్: కరవుతో బాధ పడుతున్న పెల్లెలను ఇక మీద ప్రతి నెలా ముఖ్యమంత్రి పలకరించనున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తసుకున్నారో నేరుగా ప్రజల్నే అడిగి తెలుసుకుంటారు. గ్రామాల్లోని రచ్చబండవద్దే కరవుపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ మేరకు రాష్ట్రంలో కరవుపై యాక్షన్‌ ప్లాన్‌ను సిఎం ప్రకటించారు. కరవుతో బాధ పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్లను సిఎం ఆదేశించారు. కరవు నుంచి బయటపడే వరకు ఎవరూ సెలవు పెట్టకూడదని, ప్రతి ప్రభుత్వ పథకం ప్రజలకు అందేలా [...]

కరవు పల్లెలకు సిఎం పలకరింపు

హైదరాబాద్: కరవుతో బాధ పడుతున్న పెల్లెలను ఇక మీద ప్రతి నెలా ముఖ్యమంత్రి పలకరించనున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తసుకున్నారో నేరుగా ప్రజల్నే అడిగి తెలుసుకుంటారు. గ్రామాల్లోని రచ్చబండవద్దే కరవుపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ మేరకు రాష్ట్రంలో కరవుపై యాక్షన్‌ ప్లాన్‌ను సిఎం ప్రకటించారు. కరవుతో బాధ పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్లను సిఎం ఆదేశించారు. కరవు నుంచి బయటపడే వరకు ఎవరూ సెలవు పెట్టకూడదని, ప్రతి ప్రభుత్వ పథకం ప్రజలకు అందేలా [...]

రాష్ర్టంలో గణేష్‌ ఉత్సవాల సందడి

హైదరాబాద్: రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాల సందడి ప్రారంభమైంది. భారీ ఎత్తున ప్రజలు గణేష్‌ ఉత్సవాలకోసం మండపాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. విగ్రహాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఉత్సావాలు ప్రారంభమవుతాయి. ఉత్సవ విగ్రాహాల ఏర్పాటు, మండపాల డెకరేషన్‌ కోసం భక్తులు తరలి వెళ్తుండటంతో హైదరాబాదుతో సహా రాష్రంలోని పలు నగరాల్లోని మార్కెట్లు రద్దీగా మారాయి. శనివారం సాయంత్రం నుంచే రాష్ట్రంలో పండుగ వాతావరణం మొదలయింది. .దేవునిపై ఉన్న విశ్వాసంతో విగ్రహాలు, పూజా సామాగ్రి, పండ్లు, పలహారాల [...]

కోట్ల రూపాయలు నాలాల పాలు

హైదరాబాద్: కోట్ల రూపాయలు వెచ్చించి నాలాల ఆధునీకికరణ, పూడికతీత, వర్షాపు నీటి కాల్వల ఏర్పాటు చేపడుతున్నామని అధికారులు చెపుతున్న ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. తరాలు మారుతున్న నాలా లోతట్టు ప్రాంతాల ప్రజల తలరాతలు మారక పోవడంతో దినదినగండంగా గడుపుతున్నారు. ఏ కొద్ది పాటి వర్షం కురిసిన ఉప్పొంగి ప్రవహిస్తున్న నాలాలు ప్రజల జీవితాలను మృత్యువు వైపు నెడుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో అధికార యంత్రాంగం దీర్ఘకాలిక చర్యలను చేపట్టక పోవడంతో వర్షాకాలం వచ్చిందంటే బిక్కుబిక్కుమంటూ కాలం [...]

Follow

Get every new post delivered to your Inbox.