హైదరాబాద్: మావోయిస్టు మాజీ నేత సాంబశివుడు ఈరోజు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. ఈనెల 25న తాను నల్గొండ జిల్లా భువనగిరిలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ సాధన యాత్ర, బహిరంగసభకు అనుమతి ఇవ్వాలని ఆయన మంత్రిని కోరారు. సభ అనంతరం మహబూబ్‌నగర్ వరకు యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. తన యాత్రకు ప్రభుత్వం అడ్డంకులు కలిగిస్తోందని అయినా తాను అనుమతికోసం మానవహక్కుల సంఘాన్ని, కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.
Filed under: వార్తలు | Tagged: నల్గొండ, భువనగిరి, మావోయిస్టు, సబితా ఇంద్రారెడ్డి, సాంబశివుడు, హైదరాబాద్, హోంమంత్రి | Leave a Comment »




