రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన

మహబూబ్‌నగర్‌: ఆధునిక వ్యవసాయ పద్దతులు ఆచరించి అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు పిలుపునిచ్చారు. వ్యవసాయం పట్ల రైతుల ఆలోచనావిధానం మారాలి, వ్యవసాయ పద్దతులు మారాలి, ఒకప్పటి వ్యవసాయం వేరు నేటి వ్యవసాయం వేరు ఎపంటవేస్తే లాభం వస్తుందో ఆపంటే వేయాలి , అని ఆయన చెప్పారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా మాచన్‌ పల్లి గ్రామంలో రైతు చైతన్య యాత్రలను ప్రారంభించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో [...]

రీఫ్‌కు ఎరువులు సిద్ధం

కాసిపేట: రానున్న ఖరీఫ్‌ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా ఎరువులను దిగుమతి చేసుకుంటున్నారు. వ్యవసాయాధికారుల ఆదేశాలతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన్‌లో 770 బ్యాగుల ఎరువులను దిగుమతి చేసుకుంటున్నారు. వ్యవసాయాధికారుల ఆదేశాలతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన్‌లో 770 బ్యాగుల ఎరువులు సిద్దం చేసినట్లు అధికారులు రాజేందర్‌ తెలిపారు. రానున్న ఖరీఫ్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరికీ సరిపడేలా ఎరువులు పంపిణీకి సిద్దంగా ఉన్నాయి. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని ఆయన [...]

సమన్వయంతో రైతు చైతన్య యాత్రలు

గుంటూరు: రైతు చైతన్య యాత్రల విజయవంతానికి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ బి. రామంజనేయులు అన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభంకానున్న రైతు చైతన్య యాత్రల కార్యక్రమాన్ని స్ధానిక కృషిభవన్‌లో కలెక్టర్‌ లాంచనంగా ప్రారంభించారు. ఈ నెల 17 నుండి జూన్‌ 2వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి మారుమూల గ్రామాలలో సైతం ఈ యాత్రలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన రైతు [...]

ఐదవ కాంటూరు వరకు కొల్లేరు అభివృద్ధికి ప్రణాళిక

ఏలూరు: పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల పరిధిలో గల కొల్లేరు మరోసారి వార్తల్లోకెక్కింది. గతంలో ఆనాటిముఖ్యమంత్రి డా వైఎస్‌ రాజశేఖరరెడ్డి సారధ్యంలో కొల్లేరు అభయారణ్య పరిధిని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు వరకు తగ్గించాలని కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అయితే ఆ ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించినట్లు విదితమవుతోంది. రాజధానిలో కొల్లేరు సరస్సుపై ముఖ్యమంత్రి రోశయ్య సమక్షంలో సమీక్షా సమావేశం జరిగింది. అనంతరం రాష్ట్ర అటవీ శాఖామంత్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కొల్లేరు [...]

సాగర్‌ నీటిని పంటలకు విడుదల చేయాలి: కోడెల

వినుకొండ (గుంటూరు): వినుకొండ ప్రాంత పరిధిలోని సుమారు 8లక్షల ఎకరాల భూమికి నాగర్జున సాగర్‌ జలాలను విడుదల చేయాలని మాజీ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం నర్సారావుపేట టిడిపి కార్యాలయంలో జరిగిన టెలికాన్పరెన్సులో ఆయన మాట్లాడుతూ, తమది రైతు ప్రభుత్వమని చెపుకుంటున్న ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, ఖరీఫ్‌ ముగుస్తున్న నీటిని విడుదల చేయలేకపోవడం శోచనీయమని అన్నారు. 2003 -04 టిడిపి ప్రభుత్వం, సాగర్‌ రిజర్వాయర్‌లో నీటి పరిమానం అశించిన విధంగా లేకపోయిన సాగునీటిని [...]

రోజురోజుకు పెరుగుతున్న ఎరువుల కొరత

మచిలీపట్నం: జిల్లాలో ఎరువుల కొరత రోజురోజుకు పెరుగుతున్నది. నేటివరకు సాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడిన రైతులు, ఎరువుల కోసం నానా ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన ఎరువులు 70 శాతం ప్రైవేట్‌ డీలర్లకు, 30 శాతం సహకార సంఘాలకు కేటాయించడం జరిగింది. అయితే సహకార సంఘాల ద్వారా రైతులకు అందించే ఎరువులు 30 శాతం మాత్రమే అవడంతో ఈ ఎరువులు సరిపోక రైతులు ప్రైవేట్‌ డీలర్ల నుండి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తున్నది. రైతుల [...]

136 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

ఏలూరు: కృష్ణా జిల్లానుండి, తూర్పుగోదావరి జిల్లాకు ఆక్రమంగా రవాణా అవుతున్న 136 క్వింటాళ్ల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం ఏలూరులో పట్టుకున్నారు. బియ్యం విలువ 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరైన ఈ బియ్యాన్ని లారీలో కృష్ణా జిల్లా విస్సన్నపేట నుంచి రవాణా చేస్తున్నారు. సమాచారం అందున్న జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధికారి కె. రంగాకుమారి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఏలూరు బైపాస్‌ రోడ్డులో లారీని [...]

కరువులో రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యం

ఆదిలాబాద్‌: రాష్ట్రంలో కరువు నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందని అఖిలభారత రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రంగయ్య ఆరోపించారు. గత నెల రోజులుగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని కరువుతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ముఖ్యమంత్రి తమకు పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారని విమర్శించారు. వేసిన పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు ఐదువేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించి ప్రత్యామ్నాయ [...]

వ్యవసాయానికి 9గంటలు ఉచిత విద్యుత్‌

గుడుపల్లె: రాష్ట్ర రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని ప్రస్తుతం వ్యవసాయానికి ఇస్తున్న 7గంటలు ఉచిత విద్యుత్‌ను ఇకపై 9 గంటల పాటు సరఫరా చేయటం జరుగుతుందని రాష్ట్ర అటవీ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను 7 గంటలు మాత్రమే ఇవ్వడం జరుగుతోందని అయితే త్వరలోనే 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధ్దమవుతున్నట్లు పేర్కొన్నారు. కుప్పం నుండి ఎన్నికై తొమ్మిదేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న [...]

ఎంతమంది చనిపోతే స్పందిస్తారు: చిరు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంతమంది రైతులు చనిపోతే ప్రభుత్వం కదలిక వస్తుంది, ఎన్ని పంటలు ఎండిపోతే స్పందిస్తారు అని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసనసభలో చిరంజీవి మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం వెంటనే రాష్ట్రాన్ని కరవు రాష్ట్రంగా ప్రకటించాలి. ఆకలితో జనం నకనకలాడుంతంటే ప్రభుత్వం ఆలోచిస్తూ కూర్చోవడం సరికాదు. సత్వర చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు. అదే వచ్చే నెలలోనే ఎన్నికలుంటే ప్రభుత్వం ఇలా వ్యవహరించేదా?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించి సత్వరమే రైతులను [...]

Follow

Get every new post delivered to your Inbox.