జగన్‌ కోసం పెరుగుతున్న ఒత్తిడి

నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటూ జిల్లా కాంగ్రెస్‌లో క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. సెప్టెంబర్‌ 4వ తేదీ నుంచి ఈ ప్రక్రియ జిల్లాలో ఊపందుకోగా ఆనం సోదరులు జగన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడంతో పాటు జగన్‌కోసం పదవి త్యాగానికి సిద్ధమంటూ తొలిసారిగా జిల్లాలో గళం ఎత్తారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి జగన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేయకపోతే [...]

కాంగ్రెస్‌ దిశగా పీఆర్పీ నేతల అడుగులు

నెల్లూరు: అనుకున్నదంతా అయింది. శాసన సభ ఎన్నికల్లో తన ఉనికిని కోల్పోయిన ప్రజారాజ్యంపార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. శాసన సభ ఎన్నికల్లో జిల్లాలోని పది స్థానాలతోపాటు ఒక ఎంపి స్థానానికి కూడా పోటీ చేసిన పీఆర్పీ కేవలం ఒక్క నెల్లూరు తప్ప మిగతా అన్ని స్థానాల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అది కూడా ఆనం సోదరులు తన సొంత పార్టీ అభ్యర్థి అయిన నెల్లూరు నగరంలో అనీల్‌కుమార్‌కు వ్యతిరేకంగా పోటీ చేయడం [...]

జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి మృతి ప్రభావం

నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు జిల్లా అభివృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సెప్టెంబర్‌ 2న ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన నాటినుంచి ఈరోజు వరకు అభివృద్ధి పనులపై ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం జిల్లా యంత్రాంగం కొన్ని సమీక్షలను నిర్వహించినప్పటికీ ఏమాత్రం ఆసక్తి లేకుండా ఏదో చేయాలన్న భావనతో నిర్వహించారే తప్ప సంబంధిత పథకాల అమలు ఎలా అనే అంశం జిల్లా [...]

వై.ఎస్‌. అంత్యక్రియల పరిణామాలపై విచారణ చేపట్టిన ఏకె ఖాన్‌

కడప: దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అంత్యక్రియల సమయంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై రాష్ట్రశాంతిభద్రతల అడిషనల్‌ డిజి ఏకె ఖాన్‌ బుధవారం విచారణ చేపట్టారు. హైదరాబాదు నుండి ఆయన ఇడుపులపాయకు చేరుకున్నారు. అంత్యక్రియల సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలు చోటు చేసుకోలేదని, అదే విధంగా అంత్యక్రియల సమయంలో పోలీసులు బందోబస్తు నిర్వహించడంలోగానీ, రెవెన్యూశాఖపరంగా అవసరమైన ఏర్పాట్లను చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. ఈ అంశాలన్నింటితోపాటు అంత్యక్రియల సందర్భంలో ఎక్కడెక్కడా లోపాలు చోటు చేసుకున్నాయి. ఇతరత్రా వివరాలపై [...]

కొనసాగుతున్న ఆందోళనలు

కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు కడప ఎంపి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌, సేవాదళ్‌ విభాగాల నాయకులు చేపట్టిన ఆమరణ రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. రాయచోటి ఎమ్మార్వో కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేస్తున్న ఆందోళనను ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విరమింపజేశారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలు మూడో రోజుకు చేరాయి. ప్రొద్దుటూరు పట్టణంలో కె.బాలచంద్రారెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరింది. అలాగే రైల్వే [...]

9న సిఎం కడప జిల్లా పర్యటన

కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి, సెప్టెంబర్‌ 9న జిల్లా పర్యటనకు వస్తున్నట్లు కలెక్టర్‌ కార్యాలయానికి సమాచారం అందింది. సింహాద్రిపురం మండలం పైడిపాటెం రిజర్వాయర్‌ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఆ తరువాత ముఖ్యమంత్రి జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలను తనిఖీ చేస్తారని ఈమేరకు కలెక్టర్‌ కార్యాలయానికి సమాచారం అందింది.

గ్రూపు రాజకీయాలకు వేదిక కానున్న ముఖ్యమంత్రి పర్యటన

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో సెప్టెంబర్‌ 2న జరిగే ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పర్యటన గ్రూపు రాజకీయాలకు వేదికగా మారనుంది. చిల్లకూరుమండలం అంకులపాటూరు గ్రామంలో స్టీల్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం భోజన విరామం తరువాత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో జిల్లాలో ఆనం, జడ్పీ చైర్మన్‌ కాకాని గోవర్థన్‌రెడ్డి వర్గాల మధ్య కొనసాగుతున్న గ్రూప్‌ రాజకీయాల మీద ముఖ్యమంత్రి దృష్టి సారించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక జడ్పీ చైర్మన్‌ [...]

Follow

Get every new post delivered to your Inbox.