విశాఖపట్నం: జిల్లాలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. ఎక్కువగా మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. జ్వరపీడితులతో ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. కెజిహెచ్‌లో ప్రతిరోజూ సుమారు 800 ఒపిలు వస్తుంటాయి. వారం రోజుల నుంచి రోజుకు వెయ్యి ఒపిలు వస్తున్నాయి. ఇందులో 400 ఒపిలు వరకు జ్వరానికి సంబంధించినవే. అపారిశుద్ధ్యం, వాతావరణంలో మార్పుల వల్ల జ్వరాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. మైదాన ప్రాంతంలో మలేరియా, టైఫాయిడ్, చికెన్‌గున్యా వంటి వ్యాధులతో రోగులు బాధపడుతుంటే, [...]
Posts Tagged as ‘విశాఖపట్నం’
సెప్టెంబరు 18, 2009
వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలంటే జగన్‌ను సిఎం చేయాలి: మంత్రి బాలరాజు
విశాఖపట్నం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటే ఆయన తనయుడు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని జిల్లా మంత్రి వర్యులు పసుపులేటి బాలరాజు అధిష్టానాన్ని కోరారు. మండల కేంద్రమైన చీడికాడలో నూతనంగా నిర్మించనున్న వైఎస్ విగ్రహానికి ఆయన శంఖుస్థాపన చేశారు. అనంతరం వైఎస్ చిత్రపటానికి మంత్రి బాలరాజు పూలమాలవేసి నివాళులర్పించారు. డిసిసి కార్యదర్శి బొడ్డు మహాలక్ష్మి నాయుడు అధ్యక్షతన జరిగిన సంతాపసభలో మంత్రి బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మతాలు, కులాలు, రాజకీయాలకు అతీతంగా ప్రజల మనస్సుల్లో [...]
సెప్టెంబరు 18, 2009
పాడిపశువుల కొనుగోలుకు వడ్డీలేని రుణాలు
విశాఖపట్నం: కరువును దృష్టిలో పెట్టుకొని విశాఖ డెయిరీ పరిధిలో ఉన్న రైతులందరికీ పాడి పశువులు కొనుగోలుకు వడ్డీలేని రుణాలు అందజేయనున్నట్టు డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు తెలిపారు. చీడికాడ పాల సొసైటీ సమావేశ మందిరంలో పాడి రైతులకు 412 కుర్చీలు, 162 స్టీల్ కంచాలు ఆయన చేతల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని పాడి రైతులందరికీ ఈ రుణాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. దీని నిమిత్తం ఇప్పటికే రూ.31 కోట్లు [...]
సెప్టెంబరు 18, 2009
గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ‘కాఫీ’ తోడ్పాటు
విశాఖపట్నం: గిరిజనుల ఆర్థికాభివృద్దికి కాఫీ పంట తోడ్పాటునందిస్తుందని అరకు నియోజక వర్గం శాసన సభ్యుడు సివేరి సోమ అన్నారు. కాఫీ పంట సాగుదారులకు పాడేరు డివిజన్ ఎడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రోత్సాహక చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాఫీ పంటకు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అధిక ప్రాధాన్యత ఉందన్నారు. కాఫీ పంట మీద దృష్టి సారిస్తే అధిక లాభం పొందవచ్చన్నారు. అనంతరం మండలంలోని [...]
సెప్టెంబరు 18, 2009
అధిష్టానం నిర్ణయంకు కట్టుబడి ఉంటాం: ఎం.పి.సబ్బంహరి
విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జనగ్‌ను నియమించే విషయమై కాంగ్రెస్ పార్టీ అధిష్టానందే కీలక నిర్ణయమని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సబ్బంహరి అన్నారు. పాయకరావుపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎ.ఐ.సి.సి. అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది కనుక ఎవరూ వ్యతిరేకించక పోవచ్చునన్నారు. వై.ఎస్.జగన్‌ను సి.ఎం.గా చూడాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎం.పి.లే కాకుండా, పార్టీలకతీతంగా కోరుకుంటున్నారన్నారు. [...]