మోహన్ గాంధీ మొదటి అనుభవం

మోహన్ గాంధీ… ఈ పేరు వినగానే తెలుగు సినీ చరిత్రలో మనకు గుర్తొచ్చేది ఒక ‘కర్తవ్యం’, ఒక ‘మౌనపోరాటం’.. లాంటి సందేశాత్మక, సామాజిక ప్రయోజనాత్మక చిత్రాలతోపాటు ‘మంచి మనసులు’, ‘వారసుడొచ్చాడు’ లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సెంటిమెంట్ సినిమాలు. మోహన్ గాంధీలోని దర్శకత్వ ప్రతిభను బాహ్య ప్రపంచానికి చాటిన ఆయా చిత్రాలు నేటికే కాదు… ఏనాటికీ చరిత్రలో మిగిలే ఉంటాయి. ఎంత ఎదిగినా ఒదిగినట్టే ఉండాలనే మోహన్ గాంధీ వ్యక్తిత్వం నేటి తరం దర్శకులకు ఎంతో [...]

సక్సెస్ కోసం ఛార్మి గ్లామర్‌ పాట్లు

కథానాయిక ప్రాధాన్యతా చిత్రాలకు కొత్త ఒరవడి తెచ్చిన నాయిక చార్మి. కథానాయిక ప్రాధాన్యతా చిత్రాలకు కొత్త ఒరవడి తెచ్చిన నాయిక చార్మి. అనుకోకుండా ఒకరోజు, మంత్ర, మనోరమ ఇత్యాది చిత్రాలకు ఆమె అందం, అభినయమే ప్రధాన బలంగా నిలిచాయి. తదనంతరం ఇదే దారిలో కొందరు నాయికలు కూడా నడిచారంటే.. చార్మి ప్రభావం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తారలందరూ గ్లామర్‌వైపు పరుగుపెడుతుంటే ఇలాంటి సినిమాలు చేయాలని, అభినయానికే పెద్ద పీట వేయాలని మీకెందుకు అనిపించింది అని చార్మిని అడిగితే.. [...]

పమేలా డాన్స్‌ మంత్రం

‘బే వాచ్‌’ యాక్ట్రెస్‌ పమేలా ఆండర్సన్‌ ఇటీవల డాన్స్‌పై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్స్‌ అందరికీ దూరంగా ఉంటున్న ఈ అందాల తార ప్రతిరోజు డాన్స్‌ చేస్తుండడంతో తాను మరింత యాక్టివ్‌గా ఉండగల్గుతున్నానని చెబుతోంది. పలు హాలీవుడ్‌ సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లో హాట్‌, హాట్‌గా కనిపించిన ఈ భామ ప్లేబాయ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై న్యూడ్‌గా కనిపించి వార్తల్లో నిలిచింది. గ్లామర్‌ తార పమేలా ఆండర్సన్‌ నేడు ‘డాన్స్‌’ మంత్రాన్ని జపిస్తోంది. ‘డాన్సింగ్‌ విత్‌ [...]

శ్రీకాంత్ ‘రంగా ది దొంగ’ ప్రోగ్రెస్

వింత వింత దొంగతనాలతో.. ఎంత వారినైనా చిత్తు చేయడం రంగ స్పెషాలిటీ. అలాంటి ఈ దొంగగారి జీవితంలో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. అదేంటో తెరపై చూస్తేనే మజా’ అంటున్నారు దర్శకుడు సుధాకర్‌ నాయుడు (జీవి). శ్రీకాంత్‌ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగ ది దొంగ’. ఈ సినిమా గురించి మాట్లాడుతూ జీవి పై విధంగా స్పందించారు. సీఆర్‌ మనోహర్‌, సుధాకర్‌ నాయుడు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విమలారామన్‌ ఇందులో కథానాయిక. నిర్మాత సీఆర్‌ [...]

ఇలాగైతే చిత్రాలను ఆపేస్తాం : నిర్మాతలు

హైదరాబాద్‌: సుమారు 80 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు సినీరంగం సంక్షోభం వైపు పరుగులిడుతోంది. నటులు తమ భారీ పారితోషికాలను తగ్గించుకునేంతవరకు చిత్రాల నిర్మాణం చేపట్టేది లేదని నిర్మాతల మండలి హెచ్చరించింది. నిర్మాణ వ్యయం దిగివచ్చేంతవరకు తాము సినీ షూటింగ్‌లను నిర్వహించేది లేదని ఏప్రిల్‌ 30 నజిరిగన మండలి సమావేశంలో సూచించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏటా సుమారు 150 చిత్రాలు నిర్మితమవుతాయి. 95 శాతం సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడటంతో పరిశ్రమ విలవిలలాడుతోంది. దాంతో [...]

జీరో సైజులో సంజన సంతోషం!

”కన్నడ రంగానికి చెందిన ఏ తారకైనా ఆ కోరిక ఉంటుంది. నాకూ ఆ కోరిక ఉంది” అంటోంది బెంగళూరు బ్యూటీ సంజన. ఇంతకీ ఆ కోరిక ఏమిటీ అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాం. కన్నడ రంగంలో డాక్టర్ రాజ్‌కుమార్‌కి నటుడిగా ఓ విశిష్టమైన స్థానం ఉంది. పాత తరం నాయికలు ఎంతోమంది రాజ్‌కుమార్‌ సరసన జతకట్టారు. నేటి తరం నాయికల్లో చాలామంది రాజ్‌కుమార్‌ తనయుల సరసన సినిమా చేయడం తమ అదృష్టంగా భావిస్తారు. అలా అనుకునే వారిలో [...]

సినీ వాణిజ్యంలో మనదే సింహభాగం!

భారతదేశంలో జరుగుతున్న మొత్తం సినీ వాణిజ్యంలో సింహభాగం దక్షిణాదిదే. ఈ నిజాన్ని అంగీకరించడానికి బాలీవుడ్ వాణిజ్య వర్గాలు అంగీకరించవేమో గానీ, వాస్తవంలో మాత్రం దీన్ని ఎవరూ కాదనలేరు. దేశంలోని మొత్తం సినీ పరిశ్రమ ఆదాయంలో నాలుగింట మూడొంతుల వాటా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలదే. 2008-09లో ఈ నాలుగు దక్షిణాది భాషా చిత్రాలు రూ.1,700కోట్ల పైగా ఆదాయం ఆర్జించాయి. సాధారణంగా దక్షిణాది చిత్రాల మొత్తం ఆదాయాల్లో తెలుగు, తమిళ సినిమాల వాటా చెరి 45శాతం, మలయాళం [...]

భవిష్యత్తుపై ఆశతో…: జెనీలియా

అల్లరి పిల్లగా అందరినీ ఆకట్టుకుని దర్శక, నిర్మాతలకు కాసులు కురిపించిన ‘బొమ్మరిల్లు’ ముద్దుగుమ్మ జెనీలియా ప్రణాళికాబద్ధమైన భవిష్యత్తును ఊహించుకుంటోంది. కెరీర్‌ ఆరంభంలో పూర్తి స్థాయి మాస్‌ మసాలా చిత్రాల్లో చేసిన ఈ అమ్మడు తర్వాత తర్వాత బొమ్మరిల్లు తరహా క్లాస్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది. అయితే ఆ చిత్రాలు తన కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడవని ఆలస్యంగా తెలుసుకున్న జెనీలియా బొమ్మరిల్లుతో తన పంథాను మార్చుకుంది. భవిష్యత్తు ఎటుపోతుందో తెలియని పరిస్థితుల్లో ‘బొమ్మరిల్లు’ [...]

ఆకట్టుకునే కథాంశంతో పనేముంది?

చాలా రోజుల విరామం తర్వాత అన్నట్లు నందమూరి బాలకృష్ణ చిత్రం విడుదలయింది. ఆయన గత చిత్రాలకు భిన్నమైన కథాంశంతో కాకపోయినా, తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నంగా చేసిన ‘సింహా’పై ఆయన అభిమానులే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ కూడా భారీ ఆశలే పెట్టుకుంది. సమరసింహారెడ్డి అంతటి భారీ విజయాన్ని లక్ష్యంగా చేసుకుని బోయపాటి ఈ చిత్రాన్ని రూపించినట్లు సినిమా ఆశాంతం చూసిన వారికి అర్ధమవుతుంది. ద్విపాత్రాభినయంలో బాలయ్య తన విశ్వరూపాన్ని ‘సింహా’ ద్వారా మరోమారు చూపించారు. [...]

సోనియా కొత్త సినిమా

హ్యాపీడేస్‌, వినాయకుడు సినిమాల్లో నటించిన సోనియా ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తున్నారు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీవిజయ గణపతి క్రియేషన్స్‌ పతాకంపై యం.రామలింగరాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు కోటి తనయుడు కృష్ణుడు, మహిమా చౌదరిలు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. షూటింగ్‌ దశలో ఉంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గ కథతో అన్ని వర్గాలు మెచ్చే అంశాలను జోడించి ఈ సినిమాని రూపొందిస్తున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు యువతకు మంచి సందేశం [...]

Follow

Get every new post delivered to your Inbox.