విశాఖలో 530స్కూళ్లు మూసివేత

విశాఖపట్నం: విశాఖలో అనుమతిలేని 530 స్కూళ్లకు విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో దాదాపు 65వేల మంది విద్యార్థులు భవితవ్వం ప్రశ్నార్థకంగా మారింది. మొద్దు నిద్రపోతున్న అధికార యంత్రాంగం ఇప్పుడే మేల్కొన్నట్లు ఒక్కసారిగా నోటీసులు ఇవ్వడంపై విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుతున్నారు.

గుర్తింపు లేని 500 స్కూళ్లపై ఎఫ్‌ఐఆర్‌

విశాఖపట్నం: జిల్లావ్యాప్తంగా గుర్తింపు లేని అయిదు వందలకు పైగా పాఠశాలలపై జిల్లా విద్యా శాఖ ఆధ్వర్వంలో సంబంధిత పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా అనధికారికంగా నడపబడుతున్న ప్రైవేటు విద్యా సంస్థలపై ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ చట్టం (1982), సవరించిన ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ చట్టం(1987) ప్రకారం చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయా మండలాలలో ఎంఇవోల ఆధ్వర్వంలో సమీప పోలీసు స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. జిల్లావ్యాప్తంగా అనధికారికంగా వేయికి పైగా ప్రైవేటు విద్యా [...]

దత్తతకు సర్కారు బడులు

రంగారెడ్డి: సమస్యల పరిష్కారం పేరిట ప్రభుత్వ పాఠశాలలను దత్తతకు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఇక దశలవారీగా జిల్లాలోని పాఠశాలలను దాతలకు అప్పగించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ ఎం.దానకిశోర్‌ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. పాఠశాలలను దత్తతకు తీసుకునే కమిటీకి ఛైైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌ ఎం.దానకిశోర్‌, కన్వీనర్‌గా జిల్లా విద్యాధికారి పీవీ శ్రీహరి, సభ్యులుగా రాజ్యసభ సభ్యుడు గిరీష్‌కుమార్‌ సంఘీ, శాసనమండలి సభ్యుడు నాగేశ్వర్‌, మేడ్చెల్‌ [...]

ఎపీపీఎస్సీలో నాగులదిన్నె ఆణిముత్యం

నందవరం: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ నిర్వహించిన పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏఈ ఉద్యోగాలకు జరిగిన వ్రాత పరీక్షల్లో నాగలదిన్నె వాసి సతీష్‌కుమార్‌ తన ప్రతిభను చాటి రాష్ట్రంలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో రాయలసీమలో ప్రథమ స్థానం చోటుచేసుకుంది. నవంబర్‌ 17న నిర్వహించిన వ్రాత పరీక్షల్లో పాల్గొన్న సతీష్‌కుమార్‌ ఆగష్టు 7వ తేది విడుదల అయిన ఫలితాలలో ఈ ఘనతను సాధించాడు. సాదారణ రైతు కుటుంబంలో జన్మించిన సతీష్‌ తన పదవ తరగతి విద్యాభ్యాసాన్ని [...]

Follow

Get every new post delivered to your Inbox.