Posts Tagged as ‘విజయనగరం’

సెప్టెంబరు 8, 2009

వైఎస్‌ మృతికి పలువురి సంతాపం

విజయనగరం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని చింతిస్తూ పలు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, పట్టణంలో ఘనంగా సంతాప సభలునిర్వహించాయి. అదే విధంగా అన్నదాన కార్యక్రమాలు, వైఎస్‌, జ్ఞాపకార్థం రక్తదాన శిబిరాలు జరిగాయి.
12వ వార్డులో వైఎస్‌ సంతాప సభ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సంతాపసభ మంగళవారం ఉదయం స్థానిక 12వ వార్డులో జరిగింది. ఈ సందర్భంగా 12వ వార్డుకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. అనంతరం సుమారు మూడు [...]

సెప్టెంబరు 8, 2009

9న ప్రెస్‌క్లబ్‌లో వై.ఎస్‌. సంతాప సభ

విజయనగరం: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి సంతాప సభ ఈనెల 9వ తేదీ ఉదయం 9 గంటలకు ఇక్కడి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (ఎపియుడబ్ల్యుజె) జిల్లా శాఖ ప్రధానకార్యదర్శి పి.ఎస్‌.ఎస్‌.వి.ప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ పాత్రికేయులు, ప్రెస్‌ అకాడమీ సభ్యులు డి.అచ్చుతరావు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ సంతాప సభకు ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెందిన ప్రతినిధులు హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.

సెప్టెంబరు 8, 2009

10 నుంచి బస్సుపాసుల రెన్యువల్స్‌

విజయనగరం: వివిధ మండలాల పరిధిలో గల విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతినెలా 8898 రాయితీ పాసులు, 5041 ఉచిత పాసులు ఇవ్వడం జరుగుతుందని విజయనగరం డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎన్‌.వి.ఎస్‌.వేణుగోపాల్‌, డిపో మేనేజర్‌ టి.వి.ఎస్‌ సుధాకర్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 9లోగా ఉచిత పాసులు పొందాలన్నారు. ప్రభుత్వ సెలవులతో సంబంధం లేకుండా ఈనెల 10 నుంచి 17వ తేదీవరకు విజయనగరంలో రెండు కౌంటర్లలో బస్సు పాలు రెన్యువల్స్‌ [...]

సెప్టెంబరు 8, 2009

ఈనెల 21న బాలల హక్కుల అవగాహన యాత్ర

విజయనగరం: బాలల హక్కుల యాత్రకు సంబంధించి ఈనెల 10న బాలాజీ మార్కెట్‌ ఎదురుగా నెహ్రూ యువకేంద్రం దగ్గర ఉన్నసేవాంజలి కార్యాలయంలో నిరుద్యోగ యువతకు శిక్షణ, జిల్లా వ్యాప్తంగా ఈనెల 21న బాలల హక్కుల అవగాహన యాత్ర జరుగుతుందని సేవాంజలి డైరెక్టర్‌ జి.ప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు 9440867326 నెంబర్‌ను సంప్రదించవచ్చునన్నారు.

సెప్టెంబరు 6, 2009

జడ్పీ ఉప ఎన్నికల పోలింగ్‌ 16న

విజయనగరం: జిల్లాలో జరగనున్న జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజక వర్గాలు, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజక వర్గం ఎన్నికలు ముందుగా ప్రకటించిన విధంగా సెప్టెంబర్‌ 8వ తేదీన కాకుండా సెప్టెంబర్‌ 16వ తేదీన జరుగుతాయని విజయనగరం జిల్లా ఎన్నికల అధారిటి అధికారి మహ్మద్‌ ఇక్భాల్‌ హుస్సేన్‌ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగా ప్రకటించే విధంగా జిల్లాలోని డెంకాక, దత్తిరాజేరు, జియ్యమ్మవలస జడ్పీటీసీ స్థానాలకు, ఎల్‌.కోట మండలం కాసాపేట ఎంపిటిసి స్థానానికి సెప్టెంబర్‌ 8వ తేదీన పోలింగ్‌, [...]