Posts Tagged as ‘వరంగల్‌’

సెప్టెంబరు 8, 2009

వైఎస్‌ జ్ఞాపకాలను మరువలేము: మంత్రులు

వరంగల్‌: బడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జ్ఞాపకాలను మరువలేమని రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖ అన్నారు. కొత్త మంత్రివర్గంలో చేరిన తరువాత వారు మంగళవారం వరంగల్‌ వచ్చారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్‌కు ఘనంగా నివాళి అర్పించారు. రాష్ట్ర ప్రజల కోసం వైఎస్‌ ప్రారంభించిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. పేదల కోసం తపించిన వైఎస్‌ మరణం [...]

సెప్టెంబరు 8, 2009

18న బీఈడీ పరీక్ష

వరంగల్‌: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మృతి కారణంగా ఈనెల 4వ తేదీన ఈ పరీక్ష జరగాల్సి ఉండగా, వాయిదా వేసిన బీఈడీ మూడో పేపర్‌ పరీక్షను ఈనెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్‌.రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇది వరకు అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లోనే మధ్యాహ్నాం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ అండ్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌లో పరీక్ష [...]

సెప్టెంబరు 8, 2009

వరంగల్‌లో పాఠశాల గదుల్ని కూల్చివేసిన దుండగులు

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో గుర్తు తెలియని కొందరు దుండగులు ప్రభుత్వ పాఠశాల భవనాన్ని గత అర్థరాత్రి కూల్చివేశారు. జిల్లాలోని గోవిందరాజు గుట్టలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రోడ్డున పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆగష్టు 27, 2009

పావలా వడ్డీ కింద రూ.2 కోట్లు

వరంగల్‌: రైతులకు పావలా వడ్డీ కింద పంట రుణాలు అందించడానికి ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు జిల్లాకు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. 2008 ఖరీఫ్‌, రబీ, సీజన్లలో పొందిన పంట రుణాలను పూర్తిగా చెల్లించినవారికి ఈ పావలా వడ్డీ కింద రుణాలు అందించనున్నట్లు తెలిపారు. గత ఖరీఫ్‌లో రుణాలు పొందిన రైతులు తమ బాకీలు చెల్లించడానికి 2009 ఆగస్టు 31వ తేదీని, రబీలో రుణాలు పొందిన రైతులు తమ బాకీలను 2009 సెప్టెంబర్‌ [...]

ఆగష్టు 27, 2009

రూ.600 కోట్లు పంటరుణాలు: కలెక్టర్‌

వరంగల్‌: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ రైతులకు ఇవ్వాల్సిన పంటరుణాలు 600 కోట్ల రూపాయలను సెప్టెంబర్‌ మొదటివారంలోగా అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎన్‌.శ్రీధర్‌ తెలియజేశారు. పంటరుణాల పంపిణీపై కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రత్యేకంగా బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ను రూ.600 కోట్లు పంటరుణాలు అందించాలన్న లక్ష్యానికిగాను ఇప్పటివరకు 242 కోట్ల రూపాయలను పంపిణీ చేశామని చెప్పారు. మొత్తం లక్ష్యంలో 41 శాతం అని, మిగిలిన 258 కోట్ల రూపాయలను ఈ [...]