హైదరాబాద్: దళారుల బారి నుంచి రైతులను కాపాడటంతోపాటు గ్రామ స్థాయిలో మహిళా సంఘాలకు ఆదాయం సమకూర్చిపెట్టేందుకు ప్రవేశపెట్టిన ధాన్యం మార్కెటింగ్ పథకం మూలనపడింది. కొనుగోలుకు అవసరమైన సంచులను సకాలంలో సరఫరా చేయకపోవడమేగాక కొన్న ధాన్యాన్ని వెంటనే తరలించే చర్యలూ చేపట్టకపోవడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడంలేదు. కొనుగోలు చేసిన ధాన్యానికిగానూ రైతులకు డబ్బులు ఇప్పించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. కొనుగోళ్లు జరిపినందుకుగానూ మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన కమీషనూ సరిగ్గా అందడంలేదు. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్రం మొత్తంమీద ఇప్పటిదాకా రూ.188 [...]
Filed under: వార్తలు | Tagged: గ్రామ స్థాయి, దళారులు, మహిళా సంఘాలు, రైతులు, హైదరాబాద్ | Leave a Comment »




