రాజమండ్రి: వ్యవసాయ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఈనెల 29వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో 29 ఉదయం 10.30 గంటలకు అన్నవరం చేరుకొని సత్యనారాయణస్వామిని, అనంతరం 12.15 గంటలకు తలుపులమ్మ తల్లిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు గండేపల్లిలో క్షేత్ర సందర్శన జరిపి రైతులతో ముచ్చటిస్తారు. 4.30 గంటలకు రాజమండ్రి చేరుకొని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సీజనల్ వ్యాధులపై సమీక్షిస్తారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ఇరిగేషన్, ట్రాన్స్‌కో అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం 6 [...]
Posts Tagged as ‘రాజమండ్రి’
సెప్టెంబరు 24, 2009
అశ్లీల చిత్రాలు చూపించి కోరిక తీర్చమంటున్న గురువు
రాజమండ్రి: తొమ్మిదవ తరగతి విద్యార్థినికి అశ్ల్లీల చిత్రాలు చూపించి కోరిక తీర్చమన్న కీచక గురువు దయాసాగర్‌పై గతంలోను విద్యార్థులపై వేధింపులకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. దయాసాగర్ తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ అతను పనిచేస్తున్న ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యానికి గతంలో ఓ విద్యార్థి ఫిర్యాదు చేసింది. కానీ స్కూలు పరువు పోతుందేమోనని యాజమాన్యం ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు.
సెప్టెంబరు 24, 2009
గోదావరినదిలో యువకుడి అనుమానాస్పద మృతి
రాజమండ్రి: ఈనెల 13వ తేదీన అదృశ్యమైన యువకుడు గోదావరి నదిలో శవమై తేలింది. స్థానిక దానవాయిపేటకు చెందిన కోటారి సతీష్(22) మృతదేహం గౌతమి ఘాట్ సమీపంలోని ఇసుక తెన్నెలపై కనిపించింది. సతీష్ స్నేహితులతో కలిసి ఈనెల 13వ తేదీన కేతవరం పోతురాజు గుడికి వెళ్లిన సతీష్ తిరిగి రాలేదని తండ్రి అన్నవరం ఈనెల 20వ తేదీన వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా బుధవారం గౌతమి ఘాట్ సమీపంలో మృతదేహం ఉన్నట్టు సమాచారం తెలుసుకొని వెళ్లి పరిశీలించగా [...]
సెప్టెంబరు 24, 2009
స్వైన్‌ఫ్లూతో మరో యువకుడి మృతి
రాజమండ్రి: కాకినాడ రూరల్ మండలం అరహ్యకట్టకు చెందిన ప్రత్తిపాటి రాజేష్(18) కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో గత 20 రోజులుగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. అరహ్యకట్టలో స్వైన్‌ఫ్లూ వ్యాపించిందన్న ఉదంతం నేపథ్యంలో రాజేష్ మృతితో గ్రామంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. రాజేష్ తల్లి ప్రతిపాటి వరలక్ష్మి, అదే వీధిలో ఉంటున్న సత్యనారాయణ, బి.రాజేష్‌కుమార్ మృతి చెందిన విషయం విదితమే. రాజేష్ రక్త పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ నెగిటివ్ రిపోర్టు వచ్చిందని, గ్రామంలో స్వైన్‌ఫ్లూ లేదని [...]
సెప్టెంబరు 24, 2009
మహిళల రక్షణకు పటిష్ఠ చర్యలు
రాజమండ్రి: నగరంలో ఇటీవల మహిళలపై జరుగుతున్న వరుస దాడులపై పోలీస్ యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. లుఫరన్ కళాశాల విద్యార్థుల వ్యవహారం దగ్గర నుండి అనూషపై ఉన్మాది దాడి, విద్యార్థినీపై టీచర్ అఘయిత్యం వంటి ఉదంతాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో మహిళల రక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. దీనికోసం యాంటి ఈవ్‌టీచింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతోపాటు దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించారు. మహిళలు తమకు ఎటువంటి సమస్య వచ్చినా స్వయంగా తనతో చెప్పుకోవచ్చునని డిఎస్పీ [...]