యుద్ధప్రాతిపదికన చర్యల్లో దిగిన సర్కారు

హైదరాబాద్: రాజకీయం, తీవ్రవాదం, వేర్పాటువాదం అన్నీ మరుగునపడిపోయాయి.. అటు జనంలోను, ఇటు సర్కారులోనూ ఇప్పుడంతా లైలా భయమే. తుపాను ముప్పు తీరాన్ని తాకడంతో.. సహాయచర్యలంటూ ప్రభుత్వం, ముందస్తుజాగ్రత్తల్లో జనం నిమగ్నమయ్యారు. సెలవు రద్దు చేసిమరీ అధికారులను పరుగుపెట్టిస్తోంది ప్రభుత్వం. వీలైనంత నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన చర్యల్లో దిగింది సర్కారు. ఉత్తర, దక్షిణకోస్తాల్లో తుపాను అలజడి షురూ అవడంతో.. ప్రభుత్వం ముందే మేలుకుంది. సెక్రటేరియట్, కలెక్టరేట్లలో కదలిక కనిపించింది. స్వయంగా రంగంలో దిగిన ముఖ్యమంత్రి ఉన్నతాధికారులు, మంత్రులతో [...]

బ్రిటన్‌లో మళ్లీ ఎన్నికలు?

లండన్‌: బ్రిటన్‌లో మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు హంగ్‌ కూడా వచ్చేట్లుగా కనపడటం లేదు. అంతర్గతంగా ఏర్పడ్డ పార్టీ విభేదాలతో కన్జర్వేటివ్‌ – డెమొక్రాట్లు దూరమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మే 25 లోపు బ్రిటన్‌లో ఏ పార్టీనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈసారి బ్రిటన్‌లో తప్పకుండా సంకీర్ణ [...]

బాబును ఏమీ అనను: రోజా

హైదరాబాద్‌: తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ఏమీ అనబోనని రోజా అన్నారు. తెలుగుదేశంలో వారే కొందరు తనను ఎన్నికల్లో మోసం చేసి ఓడించారని, చంద్రబాబుకు కూడా ఆ విషయం తెలుసునని రోజా అన్నారు. పార్టీ నాయకులు కొందరు అమ్ముడుపోయి కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన విషయం అందరికీ తెలుసునని ఆమె అన్నారు. పనిచేసే వారని పార్టీలో ఇబ్బంది పెడుతుంటే పనిచేయలేమని, అలాంటివి చేసినవారి విషయం చంద్రబాబు నాయుడికి కూడా తెలుసునని ఆమె అన్నారు. అలాంటి వారిని పక్కన [...]

రోజాను బెదిరించారు: ఎర్రబెల్లి

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు రోజా కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వర్గీయులు బెదిరించడం వల్లనే ఆమెకు కాంగ్రెస్‌లోకి వెళ్లాలని లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ తీర్థం పుర్చుకోవడానికి సిద్ధమైదని టీడీపీ సీనియర్‌నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో రోజాకు చాలా ప్రాధాన్యం ఇచ్చామని, ఎన్నో అంశాల్లో సీనియర్లను కాదని ఆమెకు సముచిత స్థానం కల్పించామన్నారు. పార్టీ నేతల వల్లనే తాను ఓడిపోయానని, తనకు పార్టీలో అవమానం జరిగిందని రోజా [...]

Follow

Get every new post delivered to your Inbox.