సంగారెడ్డి: మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు విషజ్వరాలు సోకి జనం విలవిల లాడుతున్నారు. జిల్లాలోని గ్రామాలలోని గిరిజన తాండాలలో, పట్టణాలలో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న వైద్యాధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. రామాయంపేట మండలం దొంగల ధర్మారంలో ఇద్దరు ఉపాధి కూలీలు మరణించగా, మరో 50 మందికి అస్వస్థతతో భాదపడుతున్నారు. ప్రతి ఇంటా ఒక్కరు అంతుచిక్కని విషజ్వరాలు సోకి మంచాన పడుతున్నారు. వ్యాధి లక్షణాలు వింతగా ఉండటంతో వైదులు చికిత్స అందించినప్పటికీ ఏ మాత్రం జ్వరం [...]
Posts Tagged as ‘మెదక్’
సెప్టెంబరు 8, 2009
సింగూరు ఆనకట్టలో నిలువ నీటితో తీరనున్న జంటనగరాల దాహర్తి
సంగారెడ్డి: మెదక్ జిల్లా సింగూరు ఆనకట్టలో ఉన్న నిలువైన నీటితో జంటనగరాల ప్రజల దాహర్తి తీరనున్నది. సింగూరు ప్రాజేక్టు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజేక్టులోనికి నిత్యం నాలుగు వేల క్యుసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. సింగూరులో ఈ వర్షాకాలంలో 3.78 టి.ఎం.సిల నీరు వచ్చి చేరింది.ఆగస్టు 20 వ తేదీ నుండి వర్షాలు కురియడంతో మంచినీటి ఎద్దడి తీరనున్నది. మెదక్ జిల్లా జహిరాబాద్,నారాయణఖైడ్, మనూర్, న్యాలకల్ ,పుల్కల్, మండలాల్లో కురిసిన వర్షాల వల్ల సింగూరు [...]
సెప్టెంబరు 1, 2009
బిల్లుకోసం పాఠశాలకు తాళంవేసిన కాంట్రాక్టర్
సంగారెడ్డి: కాంట్రాక్ట్ ఒప్పందం ప్రకారం బిల్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాఠశాలకు తాళంవేసిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేట గ్రామంలో జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజాంపేట ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను మంజూరు చేసింది. భవన నిర్మాణం కోసం సంజీవులు అనే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించింది. అయితే ఆ కాంట్రాక్టర్ నిర్మాణరంగంలో ధరలు పెరగడంతో కాంట్రాక్టర్ సంజీవులు మొదటిబిల్లు తీసుకున్న [...]
ఆగష్టు 31, 2009
పోలీసుల స్వంత ఇంటి కల నిజం చేస్తాం
సంగారెడ్డి: రాష్ట్ర పోలీసు శాఖలో పని చేస్తున్న వారందరికి స్వంత ఇళ్ళు నిర్మాణం కోసం స్థలాలు కేటాయించవలిసిందిగా రాష్ట్ర హోంశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం పరిధిలో ఆదివారం సాయంత్రం ఆమె బేగంపేటలో నూతనంగా నిర్మించిన పోలీసుస్టేషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదేశాల మేరకు పోలీసులకు స్వంత ఇంటి కలను నిజం చేయాలని ఆమె మెదక్ జిల్లా [...]
ఆగష్టు 21, 2009
మద్యం మత్తులో పల్లె సీమలు
సిద్దిపేట (మెదక్ జిల్లా): సిద్దిపేట డివిజన్‌లో కల్తీ కల్లు ఏరులై పారుతుంది. కల్లు మత్తులో పల్లెలు తూగుతున్నాయి. కల్లు దుకాణాల యజమానులు ఇచ్చే మామూళ్లతో సంబంధిత అధికార యంత్రాంగం మునిగితేలుతోంది. కల్లుతో పాటు సారా విక్రయాలకు హద్దూ, అదుపు లేకుండా సాగుతున్నాయి. పల్లెల్లో మద్యానికి బానిసలై సర్వస్వాన్ని కోల్పోతున్నారు. అయితే, అక్రమంగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వారు మాత్రం లక్షాధికారులవుతున్నారు. అక్రమ మద్యం అమ్మకాలు ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నాయి. తాగుతున్న కుటుంబాలను గుల్ల చేస్తున్నాయి.
కల్తీకల్లు, సారా విక్రయాలు, [...]