సెప్టెంబర్‌ 14న ఇంటర్మిడియట్‌ పరీక్షా ఫీజు తుది గడువు

మెదక్‌: ఇంటర్మిడియెట్‌ పరిక్ష ఫీజు సెప్టెంబర్‌ 14 వ తేది లోగా చెల్లించాలని ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి అబ్దుల్‌ బాసిత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 2010లో జరిగే ఇంటర్మిడియట్‌ మినహయింపు పోందిన ప్రయివేటు విద్యార్థులు, గ్రూపు మార్చుకొన్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించుటకుఅఖరు తేదీ సెప్టెంబరు 14, 2009 లోగా చెల్లించాలని తెలిపారు. అపరాధ రుసుము వంద రూపాయలతో సెప్టెంబర్‌ 24 ,2009 లోగా చెల్లించాలని ఆయన తెలిపారు. పరీక్ష ధరఖాస్తూ ఫారం ఖరీదు [...]

గిడ్డంగులలో రైతులు ధాన్యం అమ్మాలి

మెదక్‌: మెదక్‌ సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యం అమ్మాలని సి.డబ్ల్యూసి. రీజనల్‌ మేనేజర్‌ ఎస్‌.సి.ఎస్‌్‌.రావు అన్నారు. ఎంపిపి సమావేశ హల్‌లో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం మెదక్‌ గోదాంలో నవంబర్‌ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నామని తెలిపారు. రైతులు తొందరపడి రైస్‌మిల్లర్లకు ధాన్యాన్ని అమ్మవద్దని కోరారు. గత 50 [...]

జనశక్తినేత అమర్‌ అరెస్టు, విడుదల

మెదక్‌: కామ్రేడ్‌ సుభాష్‌ నివాళులర్పించేందుకు మెదక్‌ జిల్లాకు వచ్చిన జనశక్తినేత అమర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనుమతి లేకుండా సభను నిర్వహిస్తున్నారంటూ అడ్డుకున్నారు. అనంతరం స్వంత పూచికత్తును అమర్‌ను విడుదల చేశారు.

వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు

మెదక్‌: మెదక్‌ జిల్లాలోని వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి సెంట్రీ రూం కూలడంతో గదిని శుభ్రం చేస్తున్న గ్రామ సేవకుడు బాలయ్య మృతి చెందాడు. స్టోర్‌ రూం కాలిబూడిదయింది. ఈ ప్రమాదం నుంచి ఎస్‌ఐ, మరో కానిస్టేబుల్‌ తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow

Get every new post delivered to your Inbox.