మచిలీపట్నం: కోస్తా తీర ప్రాంతంలో పటిష్ఠవంతంగా నిఘా ఏర్పాట్లు చేపట్టే చర్యలోభాగంగా కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతంలో కొత్తగా రెండు మెరైన్ పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు మెరైన్ డిఐఇ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపినట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ రామకృష్ణయ్యతో కలిసి ఆయన మెరైన్ పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద మెరైన్ పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించామని, భవన [...]
Posts Tagged as ‘మచిలీపట్నం’
సెప్టెంబరు 11, 2009
కృషా జిల్లాలో 49 కరువు మండలాలు
మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించింది. కృష్ణా జిల్లాలోని 50 మండలాల్లో ఒక విజయవాడ అర్బన్ మినహ మిగిలిన 49 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా కరువు విలయ తాండవం చేస్తోంది. దీనిపై జిల్లా యంత్రాంగం జిల్లాలోని అన్నీ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి నివేదిక పంపించింది. అలాగే జిల్లా అభివృద్ధి [...]
సెప్టెంబరు 9, 2009
11న వైఎస్ స్మృత్యర్థం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
మచిలీపట్నం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి స్మృత్యర్థం జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఈ పోటీలు ఈనెల 11న నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో వైఎస్ సేవలపై వ్యాసరచన, కవిత్వ పోటీలు జరుగుతాయని అన్నారు. విద్యార్థులకు డ్రాయింగ్ కూడా నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాలస్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గెలుపొందినవారి స్క్రీప్టులను జిల్లాస్థాయి పోటీలకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పంపాలని కోరారు. [...]
సెప్టెంబరు 9, 2009
‘పారిశ్రామిక సంస్థల నైతిక బాధ్యత-సంస్థాగత దృక్పథం’పై జాతీయసదస్సు
మచిలీపట్నం: రాష్ట్ర ఉన్నత విద్యామండలి, కృష్ణా విశ్వవిద్యాలయంల సంయుక్త ఆధ్వర్యంలో పారిశ్రామిక సంస్థల నైతిక బాధ్యత-సంస్థాగత దృక్పథం అన్న అంశంపై ఈనెల 10, 11వ తేదీలలో జాతీయస్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ఎం.కేశవదుర్గాప్రసాద్ తెలిపారు.ఈ సదస్సు మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నివాళికి ఈ సదస్సును అంకితమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 10వ తేదీ ఉదయం 9 గంటలకు సదస్సు [...]
సెప్టెంబరు 8, 2009
మరో 16 వేల క్యూసెక్కుల నీరు కృష్ణా డెల్టాకు అవసరం
మచిలీపట్నం: కృష్ణా డెల్టాలో సాగునీటి వినియోగం పెరిగినందున ఇప్పుడు అందిస్తున్న సాగునీరు సారిపోనందున అందనంగా నీటిని పెడుదల చేయాలని నీటి పారుదల శాఖ ఎస్.ఇ. డి.చంద్రరావు ప్రభుత్వాని కోరారు. ప్రస్తుతం విజయవాడ, ప్రకాశ బ్యారేజి వద్ద 7.6 అడుగుల నీటి మట్టం ఉందని అన్నారు. సాగర్ నుండి అదనపు నీరు వచ్చి చేరడంతో ప్రకాశం బ్యారేజి వద్ద 10వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని అన్నారు. కృష్ణా, తూర్పు, పశ్చిమ డెల్టాలో రైతుల నీటి వినియోగం అధికమైందని [...]