నెల్లూరు: ప్రజారాజ్యంపార్టీకి రాజీనామా చేయడం ద్వారా ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి మరోమారు కప్పదాటు రాజకీయాలకు తెర తీశారు. అనంతసాగరం జడ్పీటిసి సభ్యుడుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందర్‌రామిరెడ్డి కుమారుడు. బొమ్మిరెడ్డి కుటుంబం అనాదిగా ఆనం వర్గానికి నియోజకవర్గంలో అండదండలు అందిస్తూ నమ్మిన భంటులా పని చేస్తోంది. ఈ క్రమంలోనే అప్పటి ఆనం చెంచు సుబ్బారెడ్డి (ఎసి సుబ్బారెడ్డి)ని అటు తర్వాత అదే కుటుంబానికి చెందిన ఆనం సంజీవరెడ్డిని ఆత్మకూరు [...]
Posts Tagged as ‘ప్రజారాజ్యం’
ఆగష్టు 31, 2009
ఔను! వాళ్లే జెండా పీకేశారు!!
ఏలూరు: ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి సొంత జిల్లాలోనే ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. సెప్టెంబర్ 8న జరగనున్న రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పీఆర్పీ పోటీ చేయడానికి వెనుకంజ వేసింది. ఈ పరిణామం పీఆర్పీ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. చిరంజీవి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనాన్ని రేపింది. ద్వారకా తిరుమల, గణపవరం జడ్పీటీసీల ఉప ఎన్నికల సమరంలో పీఆర్పీ తలపడే పరిస్థితులు కరువయ్యాయి. పీఆర్పీకి చెందిన [...]
ఆగష్టు 26, 2009
ఆత్మవిమర్శ దిశగా పీఆర్పీ
నెల్లూరు: ప్రజారాజ్యంపార్టీ ఏర్పడి సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నికల నేపథ్యంలో ఏర్పడ్డ చేదు అనుభవాలను, సమస్యలను ఏకరువు చేసుకోవడంతో పాటు ఆ పార్టీ ఆత్మవిమర్శదిశగా అడుగులు వేస్తోంది. 2009 ఎన్నికల్లో పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఎంపి స్థానానికి పోటీ చేసిన ఆ పార్టీ కేవలం ఒక నెల్లూరు నగరంలో తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలలో దారుణమైన ఓటమి చవి చూసిన విషయం తెలిసిందే. కొన్ని నియోజకవర్గాలలో డిపాజిట్లు కూడా దక్కకపోవడం గమనార్హం కాగా [...]
ఆగష్టు 23, 2009
కలంపై దాడి వెనుక.. కులం కోణం?
హైదరాబాద్: ప్రజా రాజ్యం పార్టీ నాయకత్వం హటాత్తుగా మీడియాపై దాడి చేయడం వెనుక కారణాలేమిటన్న చర్చ ఆ పార్టీ నాయకులలో మొదలయింది. సినీ పరిశ్రమలో ఉన్న సమయం నుంచి చిరంజీవికి, మీడియాకు ఘర్షణ జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో పవన్ కల్యాణ్ సహా అభిమానులు పత్రికా కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించడం కొత్త కానప్పటికీ.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా స్వయంగా చిరంజీవి మీడియాపై విరుచుకుపడటం నేతల్లో చర్చకు కారణమయింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరో అడుగు ముందుకేసి, [...]
ఆగష్టు 21, 2009
చిరంజీవి జన్మదినోత్సవానికి భారీ ఏర్పాట్లు
నెల్లూరు: ఈనెల 22న ప్రజారాజ్యంపార్టీ అధినేత చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని చిరంజీవి అభిమాన సంఘాలు, చిరంజీవి సేవా సమితి, ప్రజారాజ్యంపార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం ఒంటి గంటకు ఆర్‌ఆర్ వీధిలో పేదలకు అన్నదానం నిర్వహించనున్నట్లు చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు ద్వారకా నాథ్ తెలిపారు. అలాగే ఆయన 55వ జన్మదినాన్ని పురస్కరించుకొని 55 కిలోల కేక్‌ను రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా చిరంజీవి సోదరులు నాగబాబు విచ్చేస్తున్నట్లు [...]