ఏలూరు: పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల పరిధిలో గల కొల్లేరు మరోసారి వార్తల్లోకెక్కింది. గతంలో ఆనాటిముఖ్యమంత్రి డా వైఎస్ రాజశేఖరరెడ్డి సారధ్యంలో కొల్లేరు అభయారణ్య పరిధిని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు వరకు తగ్గించాలని కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అయితే ఆ ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించినట్లు విదితమవుతోంది. రాజధానిలో కొల్లేరు సరస్సుపై ముఖ్యమంత్రి రోశయ్య సమక్షంలో సమీక్షా సమావేశం జరిగింది.
అనంతరం రాష్ట్ర అటవీ శాఖామంత్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కొల్లేరు సంరక్షణకు [...]
Posts Tagged as ‘పశ్చిమ గోదావరి’
సెప్టెంబరు 12, 2009
ఐదవ కాంటూరు వరకు కొల్లేరు అభివృద్ధికి ప్రణాళిక
ఆగష్టు 31, 2009
ఔను! వాళ్లే జెండా పీకేశారు!!
ఏలూరు: ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి సొంత జిల్లాలోనే ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. సెప్టెంబర్ 8న జరగనున్న రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పీఆర్పీ పోటీ చేయడానికి వెనుకంజ వేసింది. ఈ పరిణామం పీఆర్పీ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. చిరంజీవి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనాన్ని రేపింది. ద్వారకా తిరుమల, గణపవరం జడ్పీటీసీల ఉప ఎన్నికల సమరంలో పీఆర్పీ తలపడే పరిస్థితులు కరువయ్యాయి. పీఆర్పీకి చెందిన [...]
ఆగష్టు 27, 2009
136 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
ఏలూరు: కృష్ణా జిల్లానుండి, తూర్పుగోదావరి జిల్లాకు ఆక్రమంగా రవాణా అవుతున్న 136 క్వింటాళ్ల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం ఏలూరులో పట్టుకున్నారు. బియ్యం విలువ 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరైన ఈ బియ్యాన్ని లారీలో కృష్ణా జిల్లా విస్సన్నపేట నుంచి రవాణా చేస్తున్నారు. సమాచారం అందున్న జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధికారి కె. రంగాకుమారి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఏలూరు బైపాస్ రోడ్డులో లారీని [...]
ఆగష్టు 23, 2009
అవినీతి నిరోధక శాఖ అంటే హడల్
ఏలూరు: ఆశ అనేది మనిషిని ఎంతకైనా తెగింపజేస్తుంది. ఆశ పడడంలో తప్పు లేదు. కానీ, ఆ ఆశ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తే ఆశపడ్డ వ్యక్తికి నిరాశ తప్పదు. ఇలాంటివే ఏసీబీకి పట్టుబడుతున్న కేసులు. ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ అధికారులను, ఉద్యోగులను గమనిస్తే దాదాపు అందరూ కొద్దిపాటి మొత్తానికి ఆశపడి తమ ఉద్యోగాలకు, జీవితాలకు ముప్పు కొనితెచ్చుకుంటున్నారు. ఇది స్వయంకృతాపరాధమే అని చెప్పవచ్చు. కేవలం లంచం సొమ్ము తీసుకుంటున్నప్పుడు పట్టుకోవడమే కాకుండా, అటువంటి వారు అక్రమంగా సంపాదించిన ఆస్తులపైనా [...]
ఆగష్టు 21, 2009
కరవు వాత – ధరల మోత
ఏలూరు: జిల్లాలో ఒక వైపున కరవు పట్టిపీడిస్తుండగా మరోవైపున రోజురోజుకూ ఆకాశానికి అంటుతున్న ధరలతో సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ అరకొరగా వర్షాలు పడుతున్నప్పటికీ, మెట్ట ప్రాంతంలో ఖరీఫ్‌కు ఎటువంటి ప్రయోజనం లేదని, ఇదే వర్షాలు పది రోజుల క్రితం వచ్చి ఉంటే కాస్త ప్రయోజనం ఉండేదని రైతు నాయకులు పేర్కొంటున్నారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో, జిల్లాలోనూ సకాలంలో వర్షాలు పడి, పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ, ఈ [...]