Posts Tagged as ‘న్యూఢిల్లీ’

సెప్టెంబరు 15, 2009

తిరుపతికి మెట్రో రైలు మంజూరు చేయండి

న్యూఢిల్లీ: కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుపతి నగరంలో మెట్రోరైలు సౌకర్యం కల్పించాలని స్థానిక ఎంపీ చింతామోహన్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఓ లేఖ రాశారు. తిరుపతిలో జనాభా నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో అంతర్జాతీయస్థాయి రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి నగర సమీపంలో కృష్ణపట్నం నౌకాశ్రయం, శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధన కేంద్రం, ప్రతిపాదిత మన్నవరం బీహెచ్‌ఈఎల్‌-ఎన్‌టీపీసీ ప్రాజెక్టు, తిరుపతిలో అంతర్జాతీయస్థాయి రైల్వేస్టేషన్‌, [...]

సెప్టెంబరు 11, 2009

యూపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: కాన్షీరాం విగ్రహాలు, స్మారకచిహ్నల ఏర్పాటులో యూపీ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేయతలపెట్టిన కాన్షీరాం, అంబేద్కర్‌ విగ్రహాలు, స్మారకచిహ్నాల పనులను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు జారీచేసింది. లక్నోలో జరుగుతున్న పార్కుల నిర్మాణం, విగ్రహాల ఏర్పాటు పనులను ఆరుగంటల్లో ఆపాలని, పనివాళ్లను అక్కడినుంచి తరలించాలని ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు.

సెప్టెంబరు 6, 2009

ఢిల్లీ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

న్యూఢిల్లీ: చైనాలోని షాంఘై నగరానికి వెళ్లాల్సిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 మంది మెడికల్‌ విద్యార్థులు ఢిల్లీ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. విమానాశ్రయంలో డిస్‌ప్లే బోర్డు లోపం వల్ల తాము ఎక్కాల్సిన విమానాన్ని అందుకోలేకపోయామని విద్యార్థులు అన్నారు. దీంతో విమానాశ్రయంలోంలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. అంతేకాకుండా సోమవారం లోపు చైనాకు వెళ్లకుంటే తమ వీసా గడువు కూడా ముగుస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సెప్టెంబరు 6, 2009

సిఎం రేసులో పురంధేశ్వరి

న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా రేసులో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇక్కడ మీడియా ప్రతినిధుల వద్ద తోసిపుచ్చలేదు. మీరు ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నారా అని అడిగితే పార్టీ అధిష్టాన వర్గం ఈ విషయాన్ని పరిశీలిస్తుందని ఆమె చెప్పారు. అధిష్టాన వర్గానికి ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే సత్తా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. మీరు ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నారా అని [...]

సెప్టెంబరు 2, 2009

విజయలక్ష్మికి సోనియా ఫోన్‌

న్యూఢిల్లీ: బుధవారం ఉదయం నుంచి ఆచూకీ తెలియకుండాపోయిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి క్షేమ సమాచారం కోసం ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫోన్‌ చేసి మాట్లాడారు. వైఎస్‌ సతీమణి విజయలక్ష్మితోను, కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితోను సోనియా మాట్లాడి ధైర్యం చెప్పారు.