రూ.3 లక్షల ధాన్యం సీజ్‌

నెల్లూరు: కావలి నుంచి అక్రమంగా తరలిస్తున్న 3 లక్షల రూపాయలు విలువచేసే 552 బస్తాల ధాన్యాన్ని కావలి అధికారులు బుధవారం రాత్రి సీజ్‌ చేశారు. పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్‌ శ్రీనివాస్‌రావు, మల్లికార్జున, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావుల బృందం ఈ దాడులు నిర్వహించింది. దగదర్తి మండలం సున్నంబట్టి వద్ద బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందడంతో పౌరసరఫరాల అధికారులు ఈ దాడులు నిర్వహించారు. రెండు లారీల్లో ఉన్న ఈ బియ్యాన్ని జిలకరమసూరి బియ్యంగా గుర్తించారు. వీటిని ఒకటి కావలిలోని [...]

ఎర్రచందనం పట్టివేత

నెల్లూరు: ఇప్పటివరకు అటవీ ప్రాంతాల గుండా అక్రమ రవాణ జరుగుతున్న ఎర్రచందనం ఇప్పుడు ఏకంగా నిత్యం రద్దీగా ఉండే నెల్లూరు నగరం నుంచి స్మగ్లింగ్‌ జరుగుతుండడం అటవీశాఖ అసమర్థతకు అద్దం పట్టింది. నెల్లూరు నగరంలోని పలు లాడ్జీల్లో మకాం వేసి ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లు, స్మగ్లింగ్‌ కోసం ఏకంగా నెల్లూరు నగరాన్నే ప్రధాన కేంద్రంగా చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జనసమర్ధం కలిగిన నెల్లూరు నగరంలో ఏసిఎం హైస్కూల్‌ కంపౌడ్‌లో సుమారు లక్షా 50 వేల రూపాయలు [...]

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఆరు మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి… నెల్లూరుపాలెం నుంచి ఆత్మకూరు పట్టణంలోకి వస్తున్న ఆటోను, ఆత్మకూరు నుంచి ఉదయగిరికి వెళుతున్న ఆర్టీసీ బస్సు సెయింట్‌మెరి స్కూల్‌ వద్ద ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. [...]

నెమళ్లను వేటాడుతున్న వ్యక్తి అరెస్టు

శ్రీకాకుళం: ఒరిస్సాలోని పర్లకిమిడి పరిధిలో గల నారాయణాపూర్‌ వద్ద సోమవారం ఓ వ్యక్తి ఎనిమిది నెమళ్లతో పోలీసులకు పట్టుబడ్డాడు. వన్యప్రాణులైన ఈ నెమళ్లను అనధికారికంగా వేటాడి అక్రమంగా తీసుకుపోతుండడంతో అటవీశాఖ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

శ్రీకాకుళం: జిల్లాలోని నర్సన్నపేట మండల పరిధిలో గల కోమర్పి కూడలి సమీపంలో 5వ నెంబర్‌ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే… ఇదే మండలంలోని పలు గ్రామాలకు చెందిన కొంతమంది దినసరి కూలీలు పనుల కోసం నడుచుకుంటూ వెళుతున్నారు. అదే సమయంలో నర్సన్నపేట నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న లారీ కోమర్తి కూడలి సమీపంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా అదుపుతప్పి వారిపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో గుండువళ్లి [...]

జిల్లాలో ముగిసిన ఐజీ పర్యటన

నెల్లూరు: జిల్లాలో పోలీస్‌స్టేషన్ల తీరు తెన్నులను పరిశీలించడానికి రెండు రోజుల పాటు జిల్లాకు విచ్చేసిన ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కిషోర్‌కుమార్‌ పర్యటన ఆదివారం నాటితో ముగిసింది. వెంకటగిరి, నెల్లూరు నగరంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లను పరిశీలించిన ఆయన చివరిగా ముఖ్యమంత్రి పర్యటన మీద సమీక్షా సమావేశాన్ని ఆదివారం రాత్రి అధికారులతో నిర్వహించారు. ముఖ్యమంత్రి పాల్గొనే రెండు కార్యక్రమాలకు అవసరమైతే పక్క జిల్లాల నుంచి మరింత సిబ్బందిని పిలిపించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పర్యటనలో భద్రత కోసం చిత్తూరు, [...]

ఎర్రచందనం పట్టివేత

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో స్మగ్లింగ్‌ కార్యకలాపాలపై ప్రభుత్వం ఉక్కుపాదాన్ని మోపింది. అటవీ శాఖ ఛీఫ్‌ కన్జర్వేటర్‌ మురళీకృష్ణ శని, ఆదివారాల్లో జిల్లాలో జరిపిన పర్యటనలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. స్మగ్లింగ్‌ కార్యకలాపాల మీద పోలీసుల సహకారంతో నిరోధించాలని ఆయన చేసిన సూచనల ఫలితంగా తన్వాయి మండలం వెంకటరామరాజుపేట గ్రామ సమీపంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన సుమారు మూడు లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు సోమవారం తెల్లవారు జామున స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు [...]

కావలిలో మళ్లీ దొంగతనాలు

నెల్లూరు: కావలిలో విచ్చల విడిగా జరుగుతున్న దొంగతనాల మీద ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కిషోర్‌కుమార్‌ సమీక్ష జరిపి 48 గంటలు తిరగకముందే కావలిలో దొంగతనాలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో ఇళ్ల దొంగతనాలకు పాల్పడే వ్యక్తులు ఇప్పుడు నేరుగా పట్టపగలే బస్టాండ్లు, ప్రధాన కూడళ్ళల్లో ప్రజల మీద మత్తు మందు ప్రయోగించి దొంగతనాలకు పాల్పడడం కలవరం కలిగిస్తోంది. కావలి ఆర్టీసీ బస్టాండ్‌లో పెద్దపట్టపుపాలెం గ్రామానికి చెందిన మంగమ్మ అనే మహిళ తన కుమార్తె శిరీషను మైపాడు గ్రామంలో దిగబెట్టి రావడానికి [...]

Follow

Get every new post delivered to your Inbox.