రాజమండ్రి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఏకగ్రీవం

కాకినాడ: రాజమండ్రి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది.ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్‌, టిడిపి నాయకులు చేసినప్రయత్నాలు శనివారం రాత్రికి ఫలించాయి. టిడిపి 3 డైరెక్టర్‌ పదవులతో సంతృప్తి చెందింది. వచ్చే ఏడాది కార్యవర్గంలో ముఖ్యపదవులను కట్టబెడతామని కాంగ్రెస్‌ నాయకులు హామీ ఇవ్వడంతో డైరెక్టర్‌ పదవులకు అంగీకరించినట్లు టిడిపి నాయకులు జి.కృష్ణా తెలిపారు. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు పీసీసీ కార్యదర్శి ఎస్‌.శివరామసుబ్రహ్మణ్యం నాలుగు రోజులుగా ఇరువర్గాలతో చర్చలు జరిపగా ఫలించాయి. [...]

వెంకటేశ్వర ఆయుర్వేధంకు పేటెంట్‌ అవార్డు

కాకినాడ: సాంప్రదాయక ఆయుర్వేధ వైద్యంలో ప్రసిద్ధికెక్కిన తూర్పుగోదావరి జిల్లా చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేధ నిలయంకు ఎట్టకేలకు పేటెంట్‌ అవార్డును దక్కించుకుంది. హైదరాబాద్‌లోని హోటల్‌ మారియట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖా మంత్రి ఆనంద శర్మ నుంచి సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.వెంకటశ్రీరామ్మూర్తి అవార్డు అందుకున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య, కెన్యా ఆరోగ్య శాఖ మంత్రి ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయుర్వేధ రంగాలలో ఈ పేటెంట్‌ సంపాదించిన సంస్థ వెంకటేశ్వర ఆయుర్వేధ [...]

వరకట్న వేధింపులకు యువతి బలి

కాకినాడ: కాకినాడ కొండయ్యపాలెం రైల్వేగేటు సమీపంలో నివాసముంటున్న అడబాల నాగేశ్వరరావు అలియాస్‌ నాగుకు నాగమూరు మండలం నవాబు పేటకు చెందిన దారం సౌజన్యను ఈ సంవత్సరం ఏప్రిల్‌ 17న అతనికి ఇచ్చి పెళ్ళి చేశారు. వివాహం అయినప్పటి నుంచి సౌజన్యను నాగు వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు. అయితే శనివారం ఉదయం సౌజన్య తన అక్కకు ఫోన్‌ చేసి నా భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని నన్ను చంపేస్తాడని భయంగా ఉందని తెలిపింది. అయితే ఆదివారం ఉదయం [...]

ఆటో కన్సల్‌టెన్సీ షోరూంలో అగ్నిప్రమాదం

కాకినాడ: రాజమండ్రి నగరం నడిబొడ్డున తాడికోట సెంటర్‌లో శనివారం రాత్రి ఆటోకన్సల్‌టెన్సీ షోరూంలో అగ్నిప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ లక్ష్మీసాయి మోటార్స్‌లో పని చేస్తున్న సూపర్‌వైజర్‌ రాత్రి 8 గంటలకు కరెంటు పోవడంతో షాపు మూసివేసి ఇంటికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికే షాపులో నుంచి మంటలు రావడం చూసి వెంటనే తాళాలు పగులగొట్టి చూడగా మోటారు సైకిళ్లు తగలబడుతున్నాయి. స్థానికులు సాహసించి ఆరు మోటారు సైకిళ్లను బయటికి తీయగలిగారు. మోటారు సైకిళ్లలో పెట్రోలు [...]

అశ్లీల చిత్రాలు చూపించి కోరిక తీర్చమంటున్న గురువు

రాజమండ్రి: తొమ్మిదవ తరగతి విద్యార్థినికి అశ్ల్లీల చిత్రాలు చూపించి కోరిక తీర్చమన్న కీచక గురువు దయాసాగర్‌పై గతంలోను విద్యార్థులపై వేధింపులకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. దయాసాగర్‌ తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ అతను పనిచేస్తున్న ఇంటర్నేషనల్‌ పాఠశాల యాజమాన్యానికి గతంలో ఓ విద్యార్థి ఫిర్యాదు చేసింది. కానీ స్కూలు పరువు పోతుందేమోనని యాజమాన్యం ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు.

గోదావరినదిలో యువకుడి అనుమానాస్పద మృతి

రాజమండ్రి: ఈనెల 13వ తేదీన అదృశ్యమైన యువకుడు గోదావరి నదిలో శవమై తేలింది. స్థానిక దానవాయిపేటకు చెందిన కోటారి సతీష్‌(22) మృతదేహం గౌతమి ఘాట్‌ సమీపంలోని ఇసుక తెన్నెలపై కనిపించింది. సతీష్‌ స్నేహితులతో కలిసి ఈనెల 13వ తేదీన కేతవరం పోతురాజు గుడికి వెళ్లిన సతీష్‌ తిరిగి రాలేదని తండ్రి అన్నవరం ఈనెల 20వ తేదీన వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా బుధవారం గౌతమి ఘాట్‌ సమీపంలో మృతదేహం ఉన్నట్టు సమాచారం తెలుసుకొని వెళ్లి పరిశీలించగా [...]

స్వైన్‌ఫ్లూతో మరో యువకుడి మృతి

రాజమండ్రి: కాకినాడ రూరల్‌ మండలం అరహ్యకట్టకు చెందిన ప్రత్తిపాటి రాజేష్‌(18) కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో గత 20 రోజులుగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. అరహ్యకట్టలో స్వైన్‌ఫ్లూ వ్యాపించిందన్న ఉదంతం నేపథ్యంలో రాజేష్‌ మృతితో గ్రామంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. రాజేష్‌ తల్లి ప్రతిపాటి వరలక్ష్మి, అదే వీధిలో ఉంటున్న సత్యనారాయణ, బి.రాజేష్‌కుమార్‌ మృతి చెందిన విషయం విదితమే. రాజేష్‌ రక్త పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ నెగిటివ్‌ రిపోర్టు వచ్చిందని, గ్రామంలో స్వైన్‌ఫ్లూ లేదని [...]

మహిళల రక్షణకు పటిష్ఠ చర్యలు

రాజమండ్రి: నగరంలో ఇటీవల మహిళలపై జరుగుతున్న వరుస దాడులపై పోలీస్‌ యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. లుఫరన్‌ కళాశాల విద్యార్థుల వ్యవహారం దగ్గర నుండి అనూషపై ఉన్మాది దాడి, విద్యార్థినీపై టీచర్‌ అఘయిత్యం వంటి ఉదంతాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో మహిళల రక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖ నిర్ణయించింది. దీనికోసం యాంటి ఈవ్‌టీచింగ్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతోపాటు దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించారు. మహిళలు తమకు ఎటువంటి సమస్య వచ్చినా స్వయంగా తనతో చెప్పుకోవచ్చునని డిఎస్పీ [...]

పండుగ సీజన్‌లో బ్లాక్ దందా

రాజమండ్రి: అసలే పండుగల సీజన్‌.. ఆపై మండుతున్న ధరలు… మరోవైపు అక్రమ నిల్వలపై పౌర సరఫరాల శాఖ అధికారుల దాడులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని నిత్యావసర సరకులు పెద్దఎత్తున బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరగడంతో.. దీనిని నియంత్రించేందుకు జిల్లా అధికార యంత్రాగం పటిష్టమైన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ గొడౌన్లలో అక్రమంగా నిల్వచేసిన సరకులపై అధికారుల దాడులు ముమ్మరమయ్యాయి. రాజమండ్రిలోని ఎస్‌విజి మార్కెట్‌లో కూడా పౌర సరఫరాల శాఖ [...]

పోలవరానికి జాతీయ హోదాపై చిగురిస్తున్న ఆశలు

రాజమండ్రి: పోలవరం(ఇందిరాసాగర్‌) ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించే విషయాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్ర అధికారుల బృందం శనివారం రానుంది. కేంద్ర జల సంఘం, పునరావాస కమిషన్‌, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు సభ్యులుగా ఉన్న ఈ బృందం ప్రాజెక్ట్‌ ప్రదేశాన్ని, కాలువల నిర్మాణాన్ని, ప్రయోజనం పొందే కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు పర్యటిస్తుంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా 2005లో శంకుస్థాపన జరిగిన పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించి కేంద్ర నిధులు [...]

Follow

Get every new post delivered to your Inbox.