Posts Tagged as ‘గుంటూరు’

సెప్టెంబరు 12, 2009

మైనింగ్‌శాఖ ఆదాయ లక్ష్యం 100 కోట్లు

గుంటూరు: జిల్లాలో మైనింగ్‌శాఖ ద్వారా 2009-10 సంవత్సరానికి 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని సేకరించేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్‌ బి.రామాంజనేయులు వెల్లడించారు. కలెక్టరేట్‌లోని డి.ఆర్‌.సి. సమావేశ మందిరంలో మైనింగ్‌ అధికారులు, స్టోన్‌ క్రషర్‌ యజమానులతో జిల్లా కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు 2010 సంవత్సరం మార్చి కల్లా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విషయంలో స్టోన్‌క్రషర్‌ యజమానులు అధికారులతో సహకరించాలన్నారు.
క్వారీ యజమానులు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుతామనే [...]

సెప్టెంబరు 12, 2009

దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేది జర్నలిస్టు

గుంటూరు: దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడంలో జర్నలిస్టు పాత్ర కీలకమని షార్జా యూనివర్శిటీ కమ్యూనికేషన్‌ విభాగం ఆచార్యులు గనీమ్‌ సమురాయ్‌ అభిప్రాయపడ్డారు. వర్శిటీ ఇంగ్లీష్‌ విభాగం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గోనేందుకు విచ్చేసిన ఆయన వర్శిటీ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం విధ్యార్థులతో ఏర్పాటు చేసిన ‘జర్నిలిస్టు పాత్ర’ అవగాహన కార్యక్రమంలో పాల్గోని ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి వర్శిటీ జర్నలిజం విభాగం కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.చెన్నారెడ్డి అధ్యక్షత వహించగా, ఆస్ట్రేలియా వల్గార్‌ [...]

సెప్టెంబరు 6, 2009

పులిచింతల నిర్వాసితుల మౌలిక వసతులు త్వరగా కల్పించండి: జెసి

గుంటూరు: పులిచింతల ముంపు గ్రామాల నిర్వాసితులకు మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని జెసి డాక్టర్‌ గౌరవ ఉప్పల్‌ అన్నారు. తన ఛాంబర్‌లో నేడు ఆయన పులిచింతల అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసితులకు పక్కా గృహాలను వారు ఇష్టపడిన నమూనలో నిర్మించాలని, విద్యుత్‌ సౌకర్యం తదితర ఏర్పాట్లను త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏమ్మాజిగూడెం, బోధనం, కేతవరం గ్రామస్థులకు పునరావస ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా వీలైనంత [...]

సెప్టెంబరు 6, 2009

నియమాలను పాటించని కళాశాలలపై కఠిన చర్యలు

గుంటూరు: నిబంధనలు ఉల్లంఘించే జూనియర్‌ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్‌ బోర్డు ఆర్‌ఐఓ ఎస్‌.కోటేశ్వరరావు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రవేటు జూనియర్‌ కళాశాలల తనిఖీ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 227 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయన్నారు. గత ఏడాది 45 వేల మంది ఇంటర్‌ విద్యనభ్యసించగా ఈ ఏడాది 50వేల మంది ఉండవచ్చని అన్నారు. గత నెల 22వ తేదితో ఇంటర్‌ ప్రవేశాలకు గడవుపూర్తయిందని అన్నారు. జిల్లావ్యాప్తంగా 21 ప్రైవేటు కళాశాలలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించామని తెలిపారు. ఈ [...]

సెప్టెంబరు 6, 2009

ముగ్గురు మినహా జిల్లాలో మావోయిస్టులు లేరు

గుంటూరు: జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదని, ముగ్గురు నాయకులు మాత్రమే మిగిలారని ఎస్పీ శంఖ బత్ర బాగ్చీ తెలిపారు. దుగ్గిరాల పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, వెల్దుర్తి, నిజాంసాగర్‌ మండలాలో ముగ్గురు మావోయిస్టులు మాత్రమే మిగిలారని, వారు అడపా, తడపా ప్రాంతాల్లో సంచరిస్తున్నారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి వంటి వారు దేశంలోనే లేరని అన్నారు. అంతటి ఆదరణ ఉన్న నాయకుడు కనుకనే ఆయన మృతితో [...]