రాయికల్: మండలంలోని ఒడ్డెలింగాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో విషజ్వరాలు విజృంభించాయి. జ్వరాలతో విద్యార్థులు మంచాన పడ్డారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో విలవిల్లాడుతున్న విద్యార్థులను ఆశ్రమ పాఠశాల సిబ్బంది శుక్రవారం రాయికల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఈ ఆశ్రమపాఠశాలలో వివిధ మండలాలకు చెందిన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కొన్ని రోజులుగా విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం బాధాకరం. ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు శ్రద్ద కనబరచకపోవడంతో విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఆదివాసి [...]
Posts Tagged as ‘గిరిజనులు’
సెప్టెంబరు 12, 2009
విషజ్వరాల బారిన విద్యార్థులు
సెప్టెంబరు 8, 2009
వారపుసంతలకు తరలిస్తున్న కలప!
విశాఖపట్నం: మన్యంలో ఎటు చూసినా పచ్చదనం కనులపండువ చేస్తుంది. కొండకోనల్లో పెరిగిన వృక్షాలు పచ్చ ‘ధనానికి’ రక్షణగా కొలువు తీరుతాయి. అయితే స్మగ్లర్ల స్వార్థ్యం గొడ్డలివేటుకు ఈ చెట్లు నేలకూలుతున్నాయి. మరోవైపున రోజు గడవడానికి గిరిజనులు చెట్లను నరుకుతున్నారు. కలపను సంతల్లో సైతం అమ్ముతున్నారు. వారపు సంతల్లో బహిరంగంగా కలపను అమ్ముతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారంపై అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. బూదరాళ్ల పంచాయతీకి చెందిన సుమారు 30 [...]
సెప్టెంబరు 1, 2009
గిరిజనుల జీవన స్థితిగతులపై అధ్యయనం
విశాఖపట్నం: గిరిజనుల సామాజిక జీవన విధానాలపై ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ విద్యార్థినులు అధ్యయనం చేస్తున్నారు. హుకుంపేట మండలం మెట్టుజోరు పంచాయతీ రంగపల్లి గ్రామంలో ఆస్ట్రేలియా విద్యార్థినులు పర్యటించి గిరిజన మహిళల జీవన విధానాన్ని గూర్చి తెలుసుకున్నారు. గిరిజన సంస్కృతి, ఆచార సాంప్రదాయాల, ఆహారపు అలవాట్లు గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక రోజంతా గిరిజనులతో గడిపి కుటుంబ పరిస్థితులను, ఆహార పదార్థాలను పరిశీలించారు. ముఖ్యంగా గిరిజన వ్యవసాయ పనులు, పంటలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్ట్రేలియాలో క్విన్స్‌లాండ్ [...]
ఆగష్టు 31, 2009
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీల్ని వెంటనే భర్తీ చేయండి!
విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీల్ని భర్తీ చేయడానికి సత్వరం చర్యలు చేపట్టినట్టు గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజు వెల్లడించారు. ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఏజెన్సీలో తహశీల్థార్లు, ఎం.పి.డి.ఒ. పోస్టులతో పాటు జి.సి.సి. ఇంజనీరింగ్, విద్య, వ్యవసాయం తదితర శాఖల్లో ఖాళీల్ని భర్తీ చేస్తామని చెప్పారు. వసతి గృహాల్లో విద్యావాలంటీర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో 104 మంది విద్యా వాలంటీర్లరని నియమించి కొన్ని నెలల అనంతరం తొలగించారని, తిరిగి [...]
ఆగష్టు 25, 2009
అటవీహక్కుల చట్టం పట్టాల పంపిణీ
కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం 2006లో అటవీహక్కుల గుర్తింపు చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం క్రింద కరీంనగర్ జిల్లాలోని 1618 మంది గిరిజనులకు, ఇతర పరంపరాగత అటవీ నివాసితులకు ప్రయోజనం కలిగింది. ప్రభుత్వం గిరిజనులకు త్వరితగతిన పట్టాలు అందజేయాలని నిర్ణయించినమేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ సుల్తానియా ప్రత్యేక శ్రద్ధ, చొరవ తీసుకుని కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తేదీ 14-62009న మంథని అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కాటారంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ఉన్నత [...]