ఇల్లందు: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశే ఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి పేద వారి గుండె చప్పుళ్లను ఆగకుండా చేశారు. అయితే ఆయన మృత్యుఒడిలోకి వెళ్లగానే వైద్యులు ఆరోగ్యశ్రీపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు కిడ్నీలు చెడిపోయి మృత్యు వుతో పోరాడుతున్న ఓ వ్యక్తిని ఆదుకునేనాథుడు లే ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబం ఇడ్లీ బండి పెట్టుకొని జీవనం సాగిస్తోంది. ఇల్లందు పట్టణానికి చెందిన సముద్రాల వెంకటేశ్వర్లు(60)కు [...]
Posts Tagged as ‘ఖమ్మం’
సెప్టెంబరు 11, 2009
సంక్షేమం పట్టని వసతి గృహాలు
ఖమ్మం: జిల్లాలోని సాంఘీక సంక్షేమ వసతి గృహాలను మెరుగుపర్చే చర్యలు ఈ విద్యాసంవత్సరానికి కూడా పూర్తయ్యే అవకాశాలు కనబడడం లేదు. ఆయా శాఖ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, నిధుల విడుదలలో జాప్యం వెరసి విద్యార్థులకు ఇబ్బంది తప్పేల లేదు. గత విద్యాసంవత్సరం ప్రారంభం సమయంలో చేపట్టిన పనులు విద్యాసంవత్సరం ముగిసినప్పటికీ కొన్ని సంక్షేమ వసతి గృహాల్లో ఎటువంటి పనులు చేపట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాంఘీక సంక్షేమశాఖ పరిధిలోని 90 వసతి గృహాల మరమ్మతుల కోసం 60 మరుగుదొడ్ల [...]
సెప్టెంబరు 11, 2009
అక్కడ నీళ్లన్నీ వృధా, ఇక్కడ నీళ్లందక వ్యధ
ఖమ్మం: ఖమ్మం పట్టణంలోని పలు ప్రాంతాలలో మున్సిపల్ పంపులకు ఆన్, ఆఫ్ నళ్లాలు లేకపోవడంతో మంచినీరు వృధా అవుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, మరికొన్ని ప్రాంతాలలో నీరు వృధాగా పోతోంది. దీనిని నివారించేందుకు మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పంపులకు ట్యాబ్‌లు బిగిస్తే నీటి వృధాను అరికట్టవచ్చు. తద్వారా నీటి ఎద్దడిని కొంతవరకైనా తగ్గించవచ్చు. కానీ ఈ ట్యాపును ఏర్పాటుచేయడానికి మన మున్సిపల్ యంత్రాంగానికి ఏర్పడుతున్న [...]
సెప్టెంబరు 11, 2009
విద్యుత్ పరికరాలు లేక పలు చోట్ల అవస్థలు
ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ అధికారులకు ముందు చూపు కొరవడింది. ఫలితంగా ఖమ్మం పట్టణంలోని పలు చోట్ల చిమ్మచీకటి అలుముకుంది. ట్యూబ్‌లైట్లు, ఎస్వీ ల్యాంపులు లేకపోవడంతో వీధుల్లోను, హైవేపైన అంధకారం ఏర్పడుతుంది. దీంతో స్థానికులు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనడంతోపాటు ప్రధాన వీధుల్లో ప్రమాదాలకు అస్కారం ఏర్పడింది. కోట్లాది రూపాయల పన్నులు వసూలుచేసే ఖమ్మం మున్సిపాలిటీ పనితీరు మామూలు గ్రామపంచాయితీల కన్నా హీనంగా తయారైందని పాలకవర్గ కౌన్సిలర్లే విమర్శిస్తున్నారు. పట్టణంలోని పలు వార్డులలో దాదాపు వంద వరకు [...]
సెప్టెంబరు 11, 2009
వానొచ్చే వరదొచ్చే… రాకపోకలకు తావొచ్చే
ఖమ్మం: ఎప్పుడు వాన వచ్చిందో, ఎక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లతాయో, ఎక్కడ రహదారులు పొంగిపొర్లతాయో, రవాణా సౌకర్యాలు ఎక్కడ నిలిచిపోతాయో వర్షాకాలంలో గుండాల మండల ప్రజలు ఎంతో కాలంగా అనుభవిస్తున్న బాధ ఇది. గుండాల మండల కేంద్రం నుంచి భాహ్య ప్రపంచానికి ఉన్న రహదారులన్నీ గుంటల మయం, బురదల మయం కావడంతోపాటు మార్గ మధ్యంలో ఉన్న కల్వట్లు శిథిలావస్థకు చేరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గుండాల మండల ప్రజలకు ఏ చిన్న అవసరం వచ్చినా నిత్యావసర [...]