విజయవాడ: 2నెలల క్రితం నాగాయలంక చేరుకున్న శ్రీలంక జాలర్లను త్వరలోనే వారి దేశానికి పంపిస్తామని శ్రీలంక డిప్యూటి కమీషనర్ ఫెర్నాండో తెలిపారు. వారు సముద్రంలో చేపలవేటకు వెళ్లి దారితప్పి కృష్ణాజిల్లా నాగాయలంక ప్రాంతానికి రెండు నెలల క్రితం చేరుకున్నారు. మొత్తం ఏడుగురు శ్రీలంక జాలర్లు ఇక్కడ పునరావాసం పొందుతున్నారు. తొలుత వారిని శ్రీలంక తీవ్రవాదులుగా అనుమానించిన పోలీసులు అన్ని కోణాల నుండి దర్యాప్తు చేయగా వారు దారితప్పి ఇక్కడకు చేరినట్లు ధ్రువపడింది. దీంతో వీరి విషయమై శ్రీలంక [...]
Posts Tagged as ‘కృష్ణా’
సెప్టెంబరు 11, 2009
ఆంధ్రాబ్యాంకు సమ్మెతో నిలిచిపోయిన కార్యకలాపాలు
విజయవాడ: ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడంతో నగరంలోని 16శాఖల్లో బ్యాకింగ్ కార్యకలాపాలు స్థంభించిపోయాయి. కిందిస్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సమ్మె చేపట్టారు. అయితే ముందస్తు లేకుండా వారు సమ్మెకు దిగడంతో ఖాతాదారులు ఇబ్బందులకు గురయ్యారు. వాణిజ్య రాజధాని అయిన విజయవాడలో ఆంధ్రాబ్యాంకు ద్వారా రోజుకు కనీసం రూ.30కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయని అంచనా సమ్మె కారణంగా ఆంధ్రాబ్యాంకు శాఖలు మూతపడ్డంతో ఖాతాదారులు ఎటిఎంల వైపు పరుగుతీసారు. అనేక ఆంధ్రాబ్యాంకు ఎటిఎంలలో [...]
సెప్టెంబరు 11, 2009
భారీ వర్షంతో మళ్లీ పాత(బస్తీ)సీనే
విజయవాడ: విజయవాడ వన్‌టౌన్ మళ్లీ జలమయమైంది. జనజీవనం స్థంభించింది. గురువారం రాత్రి కురిసిన కుంభవృష్టితో ముంపునకు గురైంది. సరిగ్గా పది రోజుల క్రితమే ఇదే పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులపాటు కురసిన ఎడతురిపిలేని వర్షాల కారణంగా వన్‌టౌన్ జలదిగ్భంధనంలో చిక్కుకోగా ప్రజలు అధికారులు పడవలను ఆశ్రయించాల్సి వచ్చింది. అక్కడ చిక్కుకున్న నీటినంతా బయటకు పంపించేందుకు రోడ్లకు గండిపెట్టాల్సి వచ్చింది. ఇంత జరిగినా అధికారులకు కనువిప్పు కాకపోవడంతో మళ్లీ అదే పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రైన్లలో పూడిక తీయకపోవడంతో ఎక్కడినీరు [...]
సెప్టెంబరు 11, 2009
జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ యువకుడి దీక్ష
విజయవాడ: వై.ఎస్.జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తూ ఒక యువకుడు శుక్రవారం నుండి ఆమరణ దీక్ష చేపట్టాడు. కమ్యూనిస్టు యోధుడి మనవడైన జయదీప్ ఈ దీక్ష చేపట్టడం ప్రాథాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా జయదీప్ మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు కష్టించిన ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.ఆర్ అసలు సిసలు కమ్యూనిస్టు అని నివాళులర్పించారు. ఆయన చేపట్టిన ఎన్నో పథకాలు పేదల జీవితాల్లో వెలుగునింపాయని అన్నారు. అలాంటి నాయకుడు మరణించిన ప్రస్తుత పరిస్థితుల్లో అవే [...]
సెప్టెంబరు 11, 2009
కృషా జిల్లాలో 49 కరువు మండలాలు
మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించింది. కృష్ణా జిల్లాలోని 50 మండలాల్లో ఒక విజయవాడ అర్బన్ మినహ మిగిలిన 49 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా కరువు విలయ తాండవం చేస్తోంది. దీనిపై జిల్లా యంత్రాంగం జిల్లాలోని అన్నీ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి నివేదిక పంపించింది. అలాగే జిల్లా అభివృద్ధి [...]