Posts Tagged as ‘కర్నూలు’

సెప్టెంబరు 12, 2009

పావురాలగుట్టకు సీబీఐ

కర్నూలు: నల్లమలలోని పావురాలగుట్టలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన స్థలాన్ని సీబీఐ(కేంద్రీయ దర్యాప్తుసంస్థ) పరిశీలించనుంది. హెలికాప్టర్‌ ప్రమాదంపై సీబీఐచే దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే దర్యాప్తు సాగించిన సీఐడీనుంచి సమాచారాన్ని సేకరించింది.

సెప్టెంబరు 6, 2009

హెలికాప్టర్‌ ఘటనపై పలు అనుమానాలు

కర్నూలు: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్‌ నల్లమల అడవుల్లో కూలిపోయిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇప్పటికే విచారణ మొదలైంది. ప్రమాదంలో సిఎంతో సహా అందరూ మరణించడంతో ఎంక్వైరీకి సాంకేతిక అంశాలే కీలకం కానున్నాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్‌ ప్రమాద ఘటనపై సిబిసిఐడి పోలీసులు విచారణ జరుపుతున్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంపై కర్నూలు జిల్లా ఆత్మకూరు ఎఆర్‌ఓ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. హెలికాప్టర్‌ కొండను ఢీ కొందా? లేదా [...]

సెప్టెంబరు 3, 2009

23 గంటల తర్వాత గుర్తింపు

కర్నూలు: 23 గంటల ఉత్కంఠ తర్వాత సీఎం హెలికాప్టర్‌ ఆచూకీ లభ్యమైంది. సంతజూటూరు-వెలుగోడు మధ్యలో కొండపై దీనిని వైమానికి దళం గుర్తించింది. అయితే హెలికాప్టర్‌ ఎలా ఉందనే విషయం ఇప్పుడే చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. క్షేమ సమాచారం తెలియడానికి మరికొంత సమాచారం పడుతుందని అధికారులు చెప్పారు. మరికాసేపట్లో అక్కడికి చేరుకున్నాకే పూర్తి సమాచారం అందుతుందని అధికారులు తెలిపారు. సీఎం హెలికాప్టర్‌ గుర్తించిన ప్రదేశంలో మూడు ఆర్మీ హెలికాప్టర్లు ల్యాండ్‌ అయ్యేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.

ఆగష్టు 21, 2009

ఎపీపీఎస్సీలో నాగులదిన్నె ఆణిముత్యం

నందవరం: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ నిర్వహించిన పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏఈ ఉద్యోగాలకు జరిగిన వ్రాత పరీక్షల్లో నాగలదిన్నె వాసి సతీష్‌కుమార్‌ తన ప్రతిభను చాటి రాష్ట్రంలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో రాయలసీమలో ప్రథమ స్థానం చోటుచేసుకుంది. నవంబర్‌ 17న నిర్వహించిన వ్రాత పరీక్షల్లో పాల్గొన్న సతీష్‌కుమార్‌ ఆగష్టు 7వ తేది విడుదల అయిన ఫలితాలలో ఈ ఘనతను సాధించాడు. సాదారణ రైతు కుటుంబంలో జన్మించిన సతీష్‌ తన పదవ తరగతి విద్యాభ్యాసాన్ని [...]

ఆగష్టు 21, 2009

పసుపల ఎస్టీ హాస్టల్‌పై ఎసిబి దాడులు

బనగానపల్లె (కర్నూల్ జిల్లా): బనగానపల్లె మండలం పసుపల గ్రామంలోని ఎస్పీ హాస్టల్‌పై ఎసిబి దాడులు నిర్వహించారు. జిల్లా ఎసిబి సిఐ మహబూబ్‌బాష, డోన్‌ఇఓ ఆర్డీ ఐజయ్య, జూనియర్‌ అసిస్టెంట్‌ కాశినాధ్‌ప్రసాద్‌లు దాడి చేసిన వారిలో ఉన్నారు. ఎసిబి అధికారులు హాస్టల్‌పై దాడులను నిర్వహించగా హాస్టల్‌లోని ఒక గదిని వాచ్‌మెన్‌ సొంతం చేసుకొని తన అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. అందులో మద్యం బాటిళ్లు లభ్యం అయ్యాయి. వార్డన్‌ సుంకన్న మెనూ ప్రకారం విద్యార్థులకు భోజన వసతులు కల్పించడం [...]