రాయికల్: మండలంలోని ఒడ్డెలింగాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో విషజ్వరాలు విజృంభించాయి. జ్వరాలతో విద్యార్థులు మంచాన పడ్డారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో విలవిల్లాడుతున్న విద్యార్థులను ఆశ్రమ పాఠశాల సిబ్బంది శుక్రవారం రాయికల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఈ ఆశ్రమపాఠశాలలో వివిధ మండలాలకు చెందిన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కొన్ని రోజులుగా విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం బాధాకరం. ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు శ్రద్ద కనబరచకపోవడంతో విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఆదివాసి [...]
Posts Tagged as ‘కరీంనగర్’
సెప్టెంబరు 12, 2009
విషజ్వరాల బారిన విద్యార్థులు
ఆగష్టు 21, 2009
గిరిజన మహిళలకు దీపం సర్టిఫికెట్ల పంపిణి
మెట్‌పల్లి: ఎనిమిది మంది గిరిజన మహిళలకు ఎంఎల్‌ఏ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దీపం సిలిండర్ సర్టిఫికెట్లు తహసీల్దార్ కార్యలయంలో పంపిణి చేశారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సుల్తానియా రంగరావుపేట తండా పరిశీలనకు వచ్చినప్పుడు 71 కుటుంభాలకు దీపం సిలిండర్‌లు మంజూరు చెయిస్తానని హమి ఇచ్చారని అందులో భాగంగా సిలిండర్‌తో పాటు అదనపు తరగతిగది, త్రాగునీటి పైపు లైను, మంజూరు చెశారని ఎంఎల్‌ఏ విద్యాసాగర్‌రావు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి సంపత్‌కుమార్ గ్యాస్ ఎజెన్సీ నిర్వహకులు [...]
ఆగష్టు 21, 2009
‘ఫీల్డ్ చానల్ ’ పేరుతో ఉపాధి అవినీతి
రాయికల్ (కరీంనగర్ జిల్లా): అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారనడానికి ఇదో మంచి ఉదాహరణ. జాతీయ గ్రామీణ ఉపాధి హామి నిధులను పక్కదారి పట్టించి చేయని పనులను బిల్లులందించారు. రికార్డుల్లో ఫీల్డ్‌ఛానల్ పనులను నిర్వహించినట్లు చూపుతూ అట్టి నిధులను కాజేశారు. క్షేత్రస్థాయిలో పనులు జరిగిన ఆనవాళ్ళే లేకపోవడం విస్మయానికి గురిచేసింది. రాయికల్ మండలం వస్తాపూర్ అటవీ గ్రామానికి ఫీల్డ్‌ఛానల్ నిర్మాణ పనుల పేరుతో జరిగిన అవినీతిపై కథనమిది.
వస్తాపూర్ గ్రామంలోని చెరువు తూము [...]
ఆగష్టు 21, 2009
ధర్మపురిలో పెరిగిన గోదావరి
ధర్మపురి (కరీంనగర్ జిల్లా): గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ధర్మపురిలో గోదావరి నీటిమట్టం పెరిగింది. వర్షాకాలం ప్రారంభమెనై రెండు నెలల్లో కేవలం రెండు సార్లు మాత్రమే నీటిమట్టం పెరిగింది. మిగిలిన రోజుల్లో వర్షాలు లేక వెలవెల బోయింది. వర్షాకాల ప్రారంభంలో జాన్ 27న రాత్రి కురిసిన తొలకరి వర్షానికి జూన్ 28న మొదటిసారి గోదావరి నీటిమట్టం పెరగగా రెండవసారి గురువారం పెరిగింది. పెరిగిన గోదావరిని చూడడానికి ధర్మపురి గ్రామస్థులతో పాటు చుట్టు ప్రక్క [...]