Posts Tagged as ‘కరీంనగర్‌’

సెప్టెంబరు 11, 2009

కౌన్సిలర్ల కొమ్ముకాస్తున్న ఆర్డీవో: టిడిపి

కరీంనగర్‌: మెట్‌పల్లి మున్సిపల్‌ అధికారి, జగిత్యాల ఆర్డీవో అమయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ కౌన్సిలర్ల కొమ్ముకాస్తున్నాడని టిడిపి మహిళా కౌన్సిలర్‌ వడ్డెపల్లి లక్ష్మి ఆరోపించింది. శుక్రవారంనాడు మెట్‌పల్లి మున్సిపల్‌ ప్రాంతంలో విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, టిఆర్‌ఎస్‌ విప్‌ ఒరిజినల్‌ కాగితం ఆర్డీవోకు అందజేయడం జరిగిందని, కాంగ్రెస్‌ వాళ్ల కొమ్ముకాచేందుకే జిరాక్స్‌ కాగితం అందినట్లు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మాట వినాల్సిందే తప్ప, ఇలా తప్పుడు ఆరోపణలతో భుజస్కాందాలపై వేసుకొని ఇలాంటి అబద్ధాలు ఆడకూడదని [...]

సెప్టెంబరు 11, 2009

హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికలు వాయిదా

కరీంనగర్‌: మెట్‌పల్లి మున్సిపల్‌ ఎన్నికలు హైకోర్టు స్టే ఉత్తర్వులు మధ్యంతరంగా వెలువడడంతో ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు జగిత్యాల ఆర్డీవో, ఎన్నికల అధికారి అమయ్‌కుమార్‌ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారంనాడు 3వ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక జరగనున్న ప్రక్రియలోనే ఈ ఎన్నికలను నిలిపివేయాలన్న హైకోర్టు నుండి వచ్చిన పిటిషన్‌ ఆధారంగా ఈ ఎన్నికలను నిలిపివేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 24 మంది కౌన్సిలర్లు ఉండగా, అందులో కాంగ్రెస్‌కు సంబంధించి సుభాషిణి అనే కౌన్సిలర్‌ [...]

సెప్టెంబరు 11, 2009

ఘనంగా సింగరేణి బొగ్గుగనుల్లో వారోత్సవాలు

కరీంనగర్‌: శుక్రవారం నుండి జిల్లాలోని సింగరేణి బొగ్గు గనుల్లో రక్షణ వారోత్సవాలు ఘనంగా చేపట్టారు. సింగరేణి ప్రాంతంలోని 32 బొగ్గు గనుల్లో, 14 ఉపరిత గనుల్లో వారం రోజులపాటు ఈ రక్షణ వారోత్సవాలు జరుపుకుంటారు. అంతేగాకుండా గతంలో సింగరేణి ప్రాంతంలోని ప్రతి మైనింగ్‌లో బొగ్గు పెళ్లలు పైనుండి కిందపడకుండా కర్రదిమ్మెలతో సపోర్టులు చేపట్టి భద్రత నిర్వహించేవారు. ప్రస్తుత పరిస్థితులలో అండర్‌గ్రౌండ్‌లోని పైకప్పు కూలి బొగ్గు పెళ్లలు పడకుండా ఆధునీక పద్ధతిలో రూపుబోల్టింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ భద్రతను [...]

సెప్టెంబరు 11, 2009

దివంగత నేత సేవలు మరవం: ఎంపీ

కరీంనగర్‌: దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలను మరువబోమని పెద్దపల్లి ఎంపి వివేకానంద అన్నారు. శుక్రవారంనాడు పెగడపల్లి మండలంలోని బతికెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన వెంట మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి నివాళులర్పించినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దివంగత నేత రాష్ట్రంలోని రైతులకు, మహిళలకు అత్యధికంగా అభివృద్ధి చేసే దశలోనే రాజశేఖర్‌రెడ్డి పయణించడాని వారు గుర్తు చేశారు. రైతులకు [...]

సెప్టెంబరు 6, 2009

జడ్పీటీసీ ఎన్నికలు 16కు వాయిదా

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికలు వై.ఎస్‌. మరణానంతరం ఎన్నికలను 8రోజులపాటు పొడిగించారు. జిల్లాలో తిమ్మాపూర్‌, ఎల్లారెడ్డిపేట మండలాల జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించి ఈ నెల 8 జరగనున్న జడ్పీటీసీ ఎన్నికలను 16న జరిగేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 16న ఎన్నికలు, ఒట్ల లెక్కింపు 17న జరుగుతాయని వారు తెలిపారు. ఈ ఎన్నికల ప్రచారం సాగుతున్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. హఠాన్మరణంతో 4రోజులపాటు ప్రచారాన్ని నిలిపివేసారు. ఎలాగైనా టిడిపి [...]