Posts Tagged as ‘కడప’

సెప్టెంబరు 11, 2009

బడుగు వర్గాలను ఆదుకున్న వైఎస్‌

కడప: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పేద, బీద, బడుగు, బలహీనవర్గాల ప్రజలతోపాటు గిరిజనులు కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ అన్ని విధాలుగా ఆదుకున్నారని ఏపి వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి అన్నారు. 2004లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత డాక్టర్‌ వైఎస్‌ వృద్ధాప్య, వికలాంగ, పింఛన్‌లను పెంచరాన్నారు. అదేవిధంగా పక్కా గృహాల నిర్మాణ వ్యయాన్ని కూడా పెంచారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 46 మండలాలను కరువు ప్రాంతాలుగా [...]

సెప్టెంబరు 11, 2009

ఆ మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి

కడప: కడప జిల్లాలోని ప్రభుత్వం ప్రకటించని ఐదు మండలాలను కూడా కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని పీఆర్పీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి హరిప్రసాద్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని మొత్తం 51 మండలాలలో ప్రభుత్వం 46 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిందన్నారు. ఈ ప్రకటన జిల్లా ప్రజలకు ఆనందం కలిగించేదే అయినప్పటికీ మిగిలిన మండలాలను ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. వర్షాభావ పంటలపైనే ఆధారపడ్డ లక్కిరెడ్డిపల్లి, పిన్నమండం, కంభేపల్లి మండలాలతోపాటు రైల్వేకోడూరు, గోగులవారిపల్లి మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ [...]

సెప్టెంబరు 11, 2009

పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

కడప: జిల్లాలో కానిస్టేబుళ్ల ఎంపికలో భాగంగా నిర్వహించిన వ్రాత పరీక్షలలో అభ్యర్థులు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని కడప డిఎస్పీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 13వ తేదీన రాత పరీక్షలు నిర్వహించనున్నామని ఆయన అన్నారు. కడపలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. వ్రాత పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కెఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ పరీక్షలు జరుగుతాయని అన్నారు. అభ్యర్థులు ఉదయం 8 గంటల లోపే పరీక్షా కేంద్రంలోకి రావాలని చెప్పారు. [...]

సెప్టెంబరు 11, 2009

పదవి ఇవ్వకపోతే రాజీనామాలు ఆమోదించండి

కడప: కడప ఎంపి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించని పక్షంలో తాము చేస్తున్న రాజీనామాలను ఆమోదించాలని ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబుకు విజ్ఞప్తి చేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్‌ ఇన్‌ఛార్జ్‌ ఛైర్‌పర్సన్‌ ముక్తియార్‌ తోపాటు రాజుపాలెం ప్రొద్దుటూరు ఎంపిపిలు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు మొత్తం 79 మంది ప్రజాప్రతినిధులు తమ రాజీనామా పత్రాలను అధ్యక్షునికి అందజేశారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి ఆధ్వర్యంలో ఈ [...]

సెప్టెంబరు 11, 2009

ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి

కడప: కెసి కాల్వ సాగునీటి విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.వెంకటసుబ్బరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ కాల్వ నీటి విడుదలపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రభుత్వం కెసి కాల్వ అధికారులు ఎవరికి వారుగా ప్రకటనలు చేస్తుండడంతో రైతాంగంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన నేడిక్కడ విడుదల చేసిన ప్రకటనలో చెప్పారు. ఆయకట్టు రైతాంగం అయోమయంలో ఉందని తెలిపారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కాల్వ నీటి విడుదలపై [...]