ఏలూరు: పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల పరిధిలో గల కొల్లేరు మరోసారి వార్తల్లోకెక్కింది. గతంలో ఆనాటిముఖ్యమంత్రి డా వైఎస్ రాజశేఖరరెడ్డి సారధ్యంలో కొల్లేరు అభయారణ్య పరిధిని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు వరకు తగ్గించాలని కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అయితే ఆ ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించినట్లు విదితమవుతోంది. రాజధానిలో కొల్లేరు సరస్సుపై ముఖ్యమంత్రి రోశయ్య సమక్షంలో సమీక్షా సమావేశం జరిగింది.
అనంతరం రాష్ట్ర అటవీ శాఖామంత్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కొల్లేరు సంరక్షణకు [...]
Posts Tagged as ‘ఏలూరు’
సెప్టెంబరు 12, 2009
ఐదవ కాంటూరు వరకు కొల్లేరు అభివృద్ధికి ప్రణాళిక
ఆగష్టు 31, 2009
ఔను! వాళ్లే జెండా పీకేశారు!!
ఏలూరు: ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి సొంత జిల్లాలోనే ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. సెప్టెంబర్ 8న జరగనున్న రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పీఆర్పీ పోటీ చేయడానికి వెనుకంజ వేసింది. ఈ పరిణామం పీఆర్పీ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. చిరంజీవి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనాన్ని రేపింది. ద్వారకా తిరుమల, గణపవరం జడ్పీటీసీల ఉప ఎన్నికల సమరంలో పీఆర్పీ తలపడే పరిస్థితులు కరువయ్యాయి. పీఆర్పీకి చెందిన [...]
ఆగష్టు 28, 2009
వివాదానికి తెరతీసిన విలేఖరులపై కేసు నమోదు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఇద్దరు పత్రికా విలేఖరులపై పోలీసుల కేసు నమోదు వ్యవహారం తీవ్ర వివాదానికి తెరతీసింది. జర్నలిస్టుల సంఘాలు ఇది తప్పుడు కేసుగా ఆరోపిస్తున్నాయి. చివరకు మీడియా ప్రతినిధులకు, పోలీసు యంత్రాంగానికి మధ్య కోల్డ్‌వార్‌కు ఈ ఉదంతం శ్రీకారం చుట్టింది. అదే సమయంలో నిత్యం అవినీతి ఆరోపణల ఊబిలో చిక్కిన ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అధికారులకు జర్నలిస్టులపై కేసు నమోదు వ్యవహారం ప్రచ్ఛన్న యుద్ధానాకి కారణమైంది. జర్నలిస్టులపై కేసుల నమోదు వ్యవహారంలో [...]
ఆగష్టు 27, 2009
136 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
ఏలూరు: కృష్ణా జిల్లానుండి, తూర్పుగోదావరి జిల్లాకు ఆక్రమంగా రవాణా అవుతున్న 136 క్వింటాళ్ల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం ఏలూరులో పట్టుకున్నారు. బియ్యం విలువ 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరైన ఈ బియ్యాన్ని లారీలో కృష్ణా జిల్లా విస్సన్నపేట నుంచి రవాణా చేస్తున్నారు. సమాచారం అందున్న జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధికారి కె. రంగాకుమారి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఏలూరు బైపాస్ రోడ్డులో లారీని [...]
ఆగష్టు 27, 2009
20 మంది సిఐలకు స్థానచలనం
ఏలూరు: ఏలూరు రేంజ్ పరిధిలో 20 మంది పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. గురువారంనాడు ఈ మేరకు ఇన్‌ఛార్జీ డిఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన సిఐలు తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందినవారు. ఏపి టాస్క్‌లో పనిచేస్తున్న వీరారెడ్డిని కాకినాడ స్పెషల్ బ్రాంచీ సిఐగా నియమించారు. రాజవమ్మంగిలో పనిచేస్తున్న వెంగరాజును రాజమండ్రిలోని ప్రకాశ్‌నగర్‌కు బదిలీ చేశారు. వేకెన్సీలో ఉన్న రామచంద్రరావును రాజవొమ్మంగికి బదిలీ చేశారు. అలాగే కిశోర్‌ను కృష్ణా జిల్లా మైలవరానికి, అప్పారావును [...]