ఆదిలాబాద్: అక్టోబర్ 2,3 తేదీలలో అనంతపురంలో మానవహక్కుల వేదిక 3వరాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బాలగోపాల్ తెలిపారు. ఆహారభద్రత, ఆర్థికమాంద్యం బడుగుదేశాల జీవనంపై ప్రభావం శ్రీలంక తమిళలుల భద్రత అనే అంశాలపై ఈ సభలో చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.సభకు రాష్ట్రంలోని 20జిల్లాల నుండి సంఘం కార్యవర్గ సభ్యులు, అభిమానులు పాల్గొంటారని ఆయన వివరించారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో వివిధ వ్యాధులతో మృతిచెందుతున్నా సహాయం అందడం లేదని ఆయన ఆరోపించారు. ఓపెన్‌కాస్ట్ సింగరేణిలో భూములు కోల్పోయిన [...]
Posts Tagged as ‘ఆదిలాబాద్’
సెప్టెంబరు 27, 2009
తెలంగాణా విషయంలో మాది స్పష్టమైన వైఖరి: సిపిఐ
ఆదిలాబాద్: తెలంగాణా విషయమై తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని బెల్లంపల్లి ఎమ్మెల్యే సిపిఐ శాసనసభ పక్ష నేత జి.మల్లేష్ స్పష్టం చేసారు. తెలంగాణా విషయంలో గత 30సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ వస్తుందని ఆయన ఆరోపించారు. నాడు చెన్నారెడ్డిని మొదలుకొని నిన్న రాజశేఖర్‌రెడ్డి వరకు తెలంగాణా ప్రజలకు ద్రోహం చేసారని విమర్శించారు. తెలంగాణా టిఆర్‌ఎస్ వల్ల రాదని ఆయన స్పష్టం చేసారు. టిఆర్‌ఎస్‌లో అంతర్గత సంక్షోభం ఉందని, తెలంగాణా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నడుచుకుంటూ [...]
సెప్టెంబరు 27, 2009
చైర్మన్ ఎంపికకై క్యాంపులతో టిడిపి, కాంగ్రెస్ బిజీబిజీ
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి విషయమై అభ్యర్థిని ఖరారు చేయడంలో కాంగ్రెస్ పార్టీలో ఈనెల 30న జరగనున్న జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపిక కోసం తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు క్యాంపులు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉన్నారు. చైర్మన్ పదవికి దాదాపుగా కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టమైనప్పటికీ అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ పార్టీలోని రెండు గ్రూపులలో వివాదం నెలకొంది. ఒక గ్రూపుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు నాయకత్వం వహిస్తూ 28సభ్యులతో క్యాంపు నిర్వహిస్తుండగా మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి 8మంది [...]
సెప్టెంబరు 18, 2009
ఆశావహులకు వేతనాలు విడుదల
ఆదిలాబాద్: జిల్లాలోని ఆశా వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న పారితోషకాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారి విడుదల చేశారని ఆంధ్రప్రదేశ్ వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రాములు తెలిపారు. ఈ విషయమై గత కొంత కాలంగా యూనియన్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుందని దీని ఫలితంగానే గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పారితోషకాలను విడుదలచేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ఆశావహులకు సంబంధించిన మొత్తం 25 లక్షల 8 వేల రూపాయలు విడుదల అయ్యాయని జిల్లాలోని సంబంధిత [...]
సెప్టెంబరు 18, 2009
కార్మికులకు వేతన సవరణ అమలు చేయాలి
ఆదిలాబాద్: సిర్పూర్ పేపర్ మిల్లులో పని చేస్తున్న కార్మికులకు వేతన సవరణ ఒప్పందం చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వ జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని విఐపిలు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐటియు మహాసభలో పలు అంశాలపై తీర్మానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు నెల నెల వేతనాలు చెల్లించాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ఆయన కోరారు. అంగన్‌వాడీ, ఆశా తదితర [...]