ఖైదీలకు దూరంగా వైద్య సేవలు?

హైదరాబాద్‌: జైళ్లలో ఖైదీలకు ఎప్పటికప్పుడు సరైన వైద్య సేవలు అందిస్తున్నామంటూ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రకటనలు కేవలం పత్రికలకే పరిమితమవుతున్నాయి. ఆచరణలో ఆ మాటలు కనీసం మచ్చుకైనా కానరావడం లేదు. సబ్‌ జైలులో ఉన్న ఖైదీని పరిశీలించేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి డాక్టర్‌ వస్తారు. ఒకవేళ ఖైదీ ఎవరైనా ఆనారోగ్యానికి గురై వైద్య సేవలు అవసరమైతే 15 రోజుల పాటు ఆగాల్సిందే. రాష్ట్రంలో ఉన్న 141 సబ్‌ జైళ్లలో ఉన్న ఖైదీల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతుండగా, [...]

గైర్హాజరుపై అళగిరినే అడగండి: కరుణ

న్యూఢిల్లీ: యుపిఎ రెండవ విడత అధికారం చేపట్టిన సంవత్సరం తర్వాత తొలిసారిగా ఆదివారం రాజధాని సందర్శనకు వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి స్పెక్ట్రమ్‌ వివాదంలో చిక్కుకున్న టెలికాం మంత్రి రాజాకు బాసటగా నిలిచారు. స్పెక్ట్రమ్‌ వివాదంలో రాజా రాజీనామా చెయ్యాలంటున్న ప్రతిపక్షం డిమాండ్‌లపై వ్యాఖ్యానించాలని అడిగినప్పుడు ”మీ అందరికీ ఏదో శుభవార్త చెప్పడానికి నేనిక్కడికి రాలేదు” అని ఆయన తమిళభాషలో వ్యంగ్యంగా అన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీలతో ఆయన చర్చల సందర్భంగా ఈ అంశం [...]

కల్లు పారుతోంది

గోపాల్‌పేట: ఉదయం నుంచి సాయంత్రం వరకు కాయకష్టం చేసి పేదోడు సేద తీరేందుకు తాగే కల్లులో పూర్తిగా కల్తీ ఉండడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కల్తీకల్లు నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఈత చెట్లు లేనిది స్వచ్ఛమైన కల్లెక్కడిదని ప్రశ్నిస్తున్నారు. ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకొన్న కల్లు వ్యాపారులు అధిక మొత్తంలో విషపదార్థాలను వేయడం ప్రజల ప్రాణాలతో చలగాటమాడడం వంటి సంఘటనలు మండలంలో చోటుచేసుకుంటున్నాయి. గతంలో గోపాల్‌పేటలో కల్లుడిపో [...]

టీటీడీ అవినీతి వ్యవహారంపై దద్దరిల్లిన సభ

హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి వ్యవహారంపై సోమవారం శాసనసభను కుదిపివేసింది. పాలకపక్షాల, ప్రతిపక్షాల వాదోపవాదాల మధ్య సభ వేడెక్కిపోయింది. టీటీడీ అవినీతి వ్యవహారంపై సభా సంఘాన్ని వేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. అందుకు ప్రభుత్వం తిరస్కరించడంతో సభ నుండి టీడీపీ, పీఆర్పీ, టీిఆర్‌ఎస్‌, సీపీిఎం, బీజేపీి పార్టీలు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, సభ నుండి వాకౌట్‌ చేశాయి. సోమవారం శాసనసభలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నగల అవినీతిపై పాలక విపక్షాలు సుదీర్ఘంగా చర్చించాయి. ముందుగా తెలుగుదేశం [...]

తడ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు

నెల్లూరు: జిల్లా సరిహద్దుప్రాంతమైన తడ చెక్‌పోస్టు మీద గురువారం తెల్లవారు జామున ఏసీబీ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. రవాణా, కమర్షియల్‌ టాక్స్‌, అటవీ శాఖ, ఇలా ప్రధాన ప్రభుత్వ శాఖలకు చెందిన చెక్‌పోస్టులకు తడ కేంద్రంగా ఉంటుంది. ఈ క్రమంలో రోజు చెన్నై – కలకత్తా జాతీయ రహదారి మీద తడ చెక్‌పోస్టు మీదుగా సుమారు రెండు వైపుల 30 వేల లారీలు ప్రయాణిస్తాయి. వివిధ లోడ్‌లతో వచ్చిన ఈ లారీలను పరిశీలించి బిల్లులను సక్రమంగా [...]

ఇందిరమ్మ అక్రమాల నేపథ్యంలో ఇద్దరు వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెండ్‌

నెల్లూరు: నాయుడుపేటలో ఇందిరమ్మ గృహాలలో అక్రమాలు జరిగినట్లు రుజువు కావడంతో జిల్లా యంత్రాంగం బి.మస్తానయ్య అనే వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ను నెల్లూరు నుంచి పూర్తిగా విధుల నుంచి తొలగించడంతో పాటు అతని మీద క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఇతడితో పాటు మరో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ను కూడా సస్పెండ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సస్పెండ్‌ చేయనున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ పేరును రాజకీయ ఒత్తిడిల నేపథ్యంలో గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి నాయుడుపేట డిప్యూటి [...]

అవినీతి నిరోధక శాఖ అంటే హడల్‌

ఏలూరు: ఆశ అనేది మనిషిని ఎంతకైనా తెగింపజేస్తుంది. ఆశ పడడంలో తప్పు లేదు. కానీ, ఆ ఆశ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తే ఆశపడ్డ వ్యక్తికి నిరాశ తప్పదు. ఇలాంటివే ఏసీబీకి పట్టుబడుతున్న కేసులు. ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ అధికారులను, ఉద్యోగులను గమనిస్తే దాదాపు అందరూ కొద్దిపాటి మొత్తానికి ఆశపడి తమ ఉద్యోగాలకు, జీవితాలకు ముప్పు కొనితెచ్చుకుంటున్నారు. ఇది స్వయంకృతాపరాధమే అని చెప్పవచ్చు. కేవలం లంచం సొమ్ము తీసుకుంటున్నప్పుడు పట్టుకోవడమే కాకుండా, అటువంటి వారు అక్రమంగా సంపాదించిన ఆస్తులపైనా [...]

విచారణ పేరుతో జల్సా

ఖమ్మం: డిపిఓపై వచ్చిన అవినీతి ఆరోప ణల ఆధారంగా దర్యాప్తు పారద ర్శకంగా చేపట్టాల్సి ఉండగా అం దుకు భిన్నంగా విచారణ కొనసా గుతోంది. డిపిఓపై రూ.80 లక్షల మేర ఎస్‌ఎఫ్‌సి, టిఎఫ్‌సి నిధుల గోల్‌మాల్‌ వ్యవహారం వచ్చిన ఆరోపణల ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగాల్సి ఉంది. ఈ దర్యాప్తును పూర్తిస్థాయిలో పరిశీ లించి నివేధిక ప్రభుత్వానికి పం పించాలని పంచాయితీ రాజ్‌ కమి షనర్‌ ఆదేశాలు జారీ చేశారు. విచారణ నిమిత్తం డిప్యూటీ కమి షనర్‌ [...]

ఉపాధిలో అవినీతి ఊడలు…

బచ్చన్నపేట: జీవనోపాధి లేక మూడు పూటల అన్నం తినలేక అర్థాకలితో బాధపడుతూ పల్లెల్ని వదిలి పట్టణాలకు వలసపోయే వారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాజీవ్‌ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టి సమర్థవంతంగా నిర్వహి స్తోంది. కాని అది కాస్త నేడు ఉపాధి చూపని హామీగా మారిందంటే అతిశయోక్తి కాదు.ఇందుకు నిదర్శనమే మండలం లోని కేసిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనం. వివరాల ప్రకారం గురువారం గ్రామాని కి వచ్చిన ఎపిఓ రమాదేవిని నిర్భందించిన [...]

హామీ పేదలకు… ఉపాధి పెద్దలకు!

నెల్లూరు‌: ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా అది పేదల సమున్నతి కోసమే ఉద్దేశించినదంటూ ప్రకటనలు గుప్పిస్తుంటుంది. ఆచరణలో మాత్రం పథకంలో పేదల దరి చేరేది మాత్రం పిసరంత మాత్రమే. కారణాలేమైనా పేరులో పేదలకు హామీనిస్తూ ఉపాధి మాత్రం పెద్దలకు చూపిస్తూ ఉపాధి హామీ పథకం కూడా ఇతర సంక్షేమ పథకాల సరసన చేరిపోయింది. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద భారీ ఎత్తున పనులు చేపట్టేందుకు నిధులు కూడా భారీగా మంజూరు కావడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో [...]

Follow

Get every new post delivered to your Inbox.