Posts Tagged as ‘అనంతపురం’

సెప్టెంబరు 12, 2009

పొట్టకూటి కోసం పట్టణానికి వచ్చి…

అనంతపురం‌: అభివృద్ధికి చిహ్నాలుగా నిలవాల్సిన మన పట్టణాలు పేదరికానికి మురికివాడలలో ఆవాసాలుగా మారుతున్నాయి. గత ఎన్నికల సమయంలో పట్టణ శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు ఆయా రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఎటువంటి అమలుకు నోచుకోకపోవడం చూస్తే కేవలం పట్టణ శివారు ప్రాంతాలపై రాజకీయ నాయకులు, అధికారులు శీతకన్నును ప్రదర్శిస్తున్నారనే చెప్పవచ్చు. పొట్టచేతపట్టుకుని వసలబాట పట్టిన పేదల ఉపాధికి మజిలీలవుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పూర్తీగా కొరవడ్డాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత [...]

సెప్టెంబరు 12, 2009

చదువుకోవాలని వుంది… గిరిజన విద్యార్థి

హిందూపురం: ప్రస్తుత సమాజంలో విద్యకు పెద్ద పీట వేయాలని ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. దీంతోపాటు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు చదువులో రాణించాలన్న సంకల్పంతో వారికి మరింత మెరుగ్గా రిజర్వేషన్లు, ఫీజుల్లో రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తోంది. అయితే బడుగు బలహీన వర్గాలు చదువుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం వారిని అణగదొక్క డానికి చూస్తున్నారన్న ఆరోపణలు నిజమవుతున్నాయి.
ఇందుకు సంబంధించి అనంతపురం జిల్లా మండల కేంద్రమైన కంబదూరు ప్రాంతానికి చెందిన కమలేష్‌ ఇటీవల పదవ [...]

సెప్టెంబరు 12, 2009

అబ్కారీ నేరాల నియంత్రణలో నిర్లక్ష్యం వద్దు

అనంతపురం‌: జిల్లాలో అక్రమ మద్యం నివారణ, నాటు సారా నియంత్రణతో పాటు రవాణా, అమ్మకాలపై అధికారులు దృష్టిని కేంద్రీకరించి, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని అనంతపురం, పెనుకొండ ఎకై్సజ్‌ జిల్లాల ఎకై్సజ్‌ సిఐలు, ఎస్‌ఐలకు ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై్సజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రమేష్‌బాబు, డిప్యూటీ కమిషనర్‌ మనోరంజన్‌లు సంబంధిత జిల్లాల సూపరింటిండెంట్ల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
తొలుత పెనుకొండ ఎకై్సజ్‌ జిల్లా పరిధిలో సమావేశం పూర్తి చేసిన అధికారులు, శుక్రవారం [...]

ఆగష్టు 21, 2009

పేరుకే ఆదర్శం గ్రామం.. తాగునీటి సమస్యకు లేదు పరిష్కారం

డి.హిరేహళ్‌: మండల పరిధిలోని అనుమాపురం పంచాయతీని ఇందిరమ్మ ఆదర్శ గ్రామంగా ఎంపిక చేశారు. సామాన్య మానవునికి కావాల్సిన కనీస మౌలిక సౌకర్యాలను కల్పించడానికి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ గ్రామాలను ఎంపిక చేసినది. ఇందిరమ్మ ఆదర్శ గ్రామమైన అనుమాపురంలో మంచినీటి సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. కేవలం సత్యసాయి నీరు తప్పా పంచాయతీ నీరు సక్రమంగా రావడం లేదు. తాగునీరు కేవలం రెండు బిందెలు మాత్రమే వస్తున్నాయని మహిళలు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని హరిజన కాలనీలో [...]

ఆగష్టు 21, 2009

ఉపాధి అక్రమార్కులకు నోటీసులు

కూడేరు: మండలంలో 2006-08 వరకు జరిగిన ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడిన మేట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు, ఎపిఓకు, బ్రాంచ్‌ ఫోస్టు మాస్టర్లకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపిడిఓ రెహనాబేగం తెలిపారు. జిల్లా కలెక్టర్‌ జనార్ధన్‌రెడ్డి, డ్వామా పిడి మురళీ ఆదేశాల మేరకు వారికి నోటీసులు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. సామూహిక తనిఖీలో 22 లక్షల 16 వేల 465 రూపాయలు అక్రమార్కులు స్వాహీ చేసినట్లు తేలింది. బిపిఎంలు 14 లక్షల 61 వేల [...]