రేడియేషన్ గమనించండి: బార్క్‌

ముంబై: ఢిల్లీలోని మాయాపురి ప్రాంతంలో తుక్కు విక్రయించే డీలర్లు రేడియోషన్‌ బారిన పడిన పరిణామం నేపథ్యంలో తీవ్ర రేడియేషన్‌ ప్రభావం (ఎక్కువ పరిణామంలో) వల్ల సంభవించే భౌతిక లక్షణాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, వెంటనే సంబంధిత అధికార్లు, అంటే పోలీసులకు తెలియజేయాలని బార్క్‌ నిపుణులు సూచించారు. ”తీవ్రమైన (అత్యధిక) రేడియేషన్‌ ప్రభావం వల్ల రేడియేషన్‌ గాయాలు, జుట్టు రాలిపోవడం, అనారోగ్యానికి గురికావడం, వాంతులు చేసుకోవడం అనే లక్షణాలు కనిపిస్తాయి. అనారోగ్యం, వాంతులనేవి ఆందోళన వంటి ఇతర కారణాల [...]

వేధింపుల నిరోధానికి ‘చర్చ్‌’ మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: ప్రీస్ట్‌లపై పెరుగుతూ వస్తున్న లైంగిక వేధింపుల ఫిర్యాదులతో కదిలిన భారత్‌లోని క్యాథలిక్‌ చర్చి తన సంస్థల్లో బాలలపై అన్ని రకాల వేధింపులను అరికట్టే దిశగా అవిభాజ్య మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నది. వివిధ పరిధుల్లోని బిషప్‌లను సంప్రదించిన అనంతరం జూన్‌ నాటికల్లా ఈ మార్గదర్శకాలను ఖరారు చేస్తారు. వేధింపులకు పాల్పడే ప్రీస్ట్‌లు లేదా చర్చితో అనుబంధమున్న ఇతరులపై పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం, దోషులైన ప్రీస్ట్‌లను బహిష్కరించడం వంటివి ఇందులో ఉన్నాయి. దేశంలోని క్యాథలిక్‌ చర్చిల సర్వోన్నత నియంత్రణ [...]

రాష్ట్ర రాజధానిలో భద్రత గోల్‌’మాల్‌’

హైదరాబాద్‌: ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో నగరంలో భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. ముఖ్యంగా వాణిజ్య కేంద్రాలలో భద్రత పోలీసులకు పెద్ద తలనొప్పిగా పరిణమించింది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు తమ దుకాణాల వద్ద సొంత సెక్యూరిటీని ఏర్పాటుచేసుకుంటున్నా దాని వల్ల ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. బేగంపేటలో ఉన్న లైఫ్‌స్టయిల్‌ కాంప్లెక్స్‌లోకి ప్రవేశిస్తే, మీ కారు తనిఖీ చెయ్యడానికి అక్కడ ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా కనిపించడు. వాహనాల్లో పేలుడు పదార్థాలేవైనా ఉంటే వాటిని కనిపెట్టేందుకు వారి దగ్గర [...]

భద్రతా దళాల ఆయుధాలకు పదును!

న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడులు, పలు రాష్ట్రాల్లో నక్సలైట్ల హింసాకాండ విసురుతున్న తాజా సవాళ్ళ నేపథ్యంలో పారామిలిటరీ దళాల కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు హోంమంత్రిత్వశాఖ సన్నద్ధమవుతున్నది. వీలైనంత త్వరగా సరికొత్త ఆయుధాలు, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, దాడులనెదుర్కునే సామగ్రి, సాయుధ వాహనాలతో ఈ దళాలకు మళ్లీ జవసత్వాలనందిస్తారు. అంతర్జాతీయ ఆయుధ సరఫరాదార్లు ఇటీవల న్యూఢిల్లీలో మకాం వేశాయి. రాబోయే రెండు మూడేళ్ల కాలంలో భారత్‌లో అంతర్గత భద్రతా సామగ్రి మార్కెట్‌ రూ.45,000 కోట్లుగా ఉంటుందన్న అంచనాల మధ్య [...]

చొరబాటుయత్నం ఉగ్రవాదులపనే: పాక్‌

జమ్ము: జమ్ము కాశ్మీర్‌లోని సాంబ జిల్లా సబ్‌ సెక్టార్‌ అయిన రాంగఢ్‌లో తమ దళాలపై ఎల్లల ఆవలి వైపు నుంచి కాల్పులు జరపడం, చొరబాటుకు అవకాశం కల్పించడంపై భారత సరిహద్దు భద్రతా దళం ఆదివారం పాకిస్థాన్‌ రేంజర్స్‌కు తన నిరసనను తెలియజేసింది. ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో రాంగఢ్‌ వద్ద ఉన్న బల్లార్డ్‌ సరిహద్దు ఔట్‌పోస్ట్‌ వద్ద పాక్‌ రేంజర్లతో కంపెనీ కమాండర్‌ స్థాయి సమావేశాన్ని బిఎస్‌ఎఫ్‌ ఏర్పాటు చేసిందని పారామిలిటరీ దళానికి చెందిన అధికార్లు చెప్పారు. [...]

Follow

Get every new post delivered to your Inbox.