నవంబరు 8, 2009

నెల్లూరు జిల్లాలో వరద పరిస్థితి అదుపులో ఉంది:ఆనం

నెల్లూరు : గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు జిల్లాలో వరద పరిస్థితి అదుపులోనే ఉందని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురస్తున్న అకాల వర్షాలకు జిల్లా అతలాకుతలమయింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

నవంబరు 8, 2009

యడ్యూరప్ప వర్గీయులను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాదు : నగరంలోకి వస్తోన్న కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప వర్గీయులను హైదరాబాదు పోలీసులు అడ్డుకున్నారు. శంషాబాద్‌ సమీపంలోని నోవాటెల్‌ హోటల్‌లో ఉన్న అసమ్మతి ఎమ్మెల్యేలను బెంగుళూరుకు తరలించడానికి వచ్చిన సిఎం వర్గీయులను నగరంలోకి రాకుండా జహీరాబాద్‌ చెక్‌పోస్టు వద్ద అడ్డుకన్నారు.

నవంబరు 8, 2009

బాలీవుడ్‌తో మధుకోడా సంబంధాలు

రాంచీ : కుంభకోణాల వీరుడు మధుకోడాకు బాలీవుడ్‌తోనూ సంబంధాలున్నట్లు తేలింది. భాలీవుడ్‌లో కోడా భారీగానే పెట్టుబడులు పెట్టిన ఆధారాలు లభ్యమయినట్లు సమాచారం. పూర్తి ఆధారాలకోసం బాలీవుడ్‌ తారలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దృష్టి సారించింది. సెలీనా జైట్లీ, కోయినా మత్రాతో కోడాకు సంబంధాలున్నట్లు విజిలెన్స్‌ విచారణలో తేలినట్లు సమాచారం.

నవంబరు 8, 2009

కోలుకున్న మధుకోడా … డిశ్చార్జికి సిద్ధం

రాంచీ : అక్రమ ఆస్తుల సంపాదన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్‌ మాజీ సిఎం మధుకోడా ఆరోగ్యం పూర్తిగా కుదుట పడినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన డిశ్చార్జికి రంగం సిద్ధమైంది. కోడా పూర్తిగా కోలుకున్నారని, డిశ్చార్జి చేసే అవకాశాలు ఉన్నాయని రాంచీలోని అపొలో వైద్యులు వెల్లడించారు. కోడా విడుదలకు ఐటి అధికారుల అనుమతి లభించాల్సి ఉందని వారు తెలిపారు. డిశ్చార్జి చేసేముందు తమతో చెప్పాలని ఇప్పటికే ఐటి అధికారులు వైద్యులను ఆదేశించారు. డిశ్చార్జి అయిన వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అదుపులోకి తీసుకుని తదుపరి విచారణకు ఢిల్లీకి తరలించనున్నట్లు తెలిసింది.

నవంబరు 8, 2009

గ్రేటర్‌ ప్రచారానికి టీడీపీ 10న శ్రీకారం

హైదరాబాద్‌:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 10 నుంచి గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. గ్రేటర్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ఉండే విధంగా పార్టీ నాయకులు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. వామపక్షాలతో పొత్తులపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఆ పార్టీ హైదరాబాద్‌ జిల్లా కన్వీనర్‌ తీగల కృష్ణారెడ్డి చెప్పారు. రెబెల్స్‌ ను పోటి నుంచి తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.