అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమైక్యాంధ్రకు మద్దతుగా చేపడుతున్న ఆందోళనను అడుకునేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తంగా మారడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ దాడిలో పోలీసులతోపాటు, కొందరు మీడియా సిబ్బంది కూడా గాయపడ్డారు.
Entries Tagged as ‘వార్తలు’
డిసెంబరు 15, 2009
భారీగా ప్రభుత్వ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
హైదరాబాదు: పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు 1532 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి గీతారెడ్డి వెల్లడించారు. అలాగే 52 ప్రభుత్వ జూనియర్ కాళాశాలల్లో ప్రిన్సిపల్స్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆమె వివరించారు. నల్గొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీలో 109 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నలిచ్చిందని గీతారెడ్డి ప్రకటించారు.
డిసెంబరు 15, 2009
ఎస్‌కే యూనివర్సిటీలో ఉద్రిక్తత : లాఠీచార్జి
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమైక్యాంధ్రకు మద్దతుగా చేపడుతున్న ఆందోళనను అడుకునేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తంగా మారడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ దాడిలో పోలీసులతోపాటు, కొందరు మీడియా సిబ్బంది కూడా గాయపడ్డారు.
డిసెంబరు 15, 2009
పొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళులర్పించిన సీఎం
హైదరాబాద్: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సచివాలయం వద్ద ఆయన విగ్రహానికి మంగళవారం ముఖ్యమంత్రి రోశయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు కృషిని సీఎం కొనియాడారు. నివాళులు అర్పించినవారిలో గ్రేటర్ హైదరాబాద్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
డిసెంబరు 15, 2009
సచివాలయంలో సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన
హైదరాబాద్: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థులపై లాఠీచార్జిని నిరసిస్తూ సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు సచివాలయంలోని సీ-బ్లాక్ ఎదుట బైఠాయించారు. సమై్యకాంధ్ర కోసం విద్యార్థులు శాంతియుతంగా ఉద్యమాన్ని చేపడుతున్నారని, ఈ ఉద్యమాన్ని అణగదొక్కేందుకే ఆంధ్రా, ఎస్‌కే యూనివర్సిటీల్లో పోలీసుల బలగాలను మోహరించారని వెంటనే పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.