జగన్‌ పార్టీ కాలగర్భంలో కలసిపోతుంది: తులసిరెడ్డి

హైదరాబాద్‌: జగన్‌ పార్టీ మే 13న కాలగర్భంలో కలసిపోతుందని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. తన పార్టీ పూర్తి పేరైన యువజన శ్రామిక రైతు పార్టీ పేరు చెప్పుకోలేని దుస్థితిలో జగన్‌ ఉన్నారని… వైఎస్‌కు, సోనియాకు పోటీ అనడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇది కడప, బెంగళూరుకు మధ్య పోటీ అని ఆయన చెప్పారు. సాక్షి మీడియా పత్రికా విలువలకు తిలోదకాలిచ్చి కథనాలు రాస్తోందని ఆయన ఆక్షేపించారు.

చెర్నోబిల్‌అణువిషాదానికి 25 ఏళ్లు

చెర్నోబిల్‌: చెర్నోబిల్‌లో అణుప్రమాదం జరిగి నేటికి సరిగ్గా 25 ఏళ్లు. ఈ సందర్భంగా ప్రజలు ఆనాటి ప్రమాదంలో అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటించారు. 1986 ఏప్రిల్‌ 26 ఉదయం యుక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ కేంద్రంలో పేలుడు సంభవించింది. పదిరోజుల పాటు మండిన ఆ అణుమంటలవల్ల వెలువడిన రేడియోధార్మికత హీరోషిమా, నాగసాకిల మీద వేసిన అణుబాంబుల కన్నా 100 రెట్లు ఎక్కువ. ప్రమాదంలో వెలువడిన రేడియేషన్‌ యూరోప్‌ దేశాల వరకూ వ్యాపించింది. లెక్కకు ఆనాడు చనిపోయిన వారి సంఖ్య [...]

బాలుడు చికిత్స పొందుతూ మృతి

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌లోని నేరేడ్‌ మెట్‌ ప్రాంతంలో శుక్రవారం గాయాలతో కన్పించిన బాలుడు రాజేష్‌, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించాడు. రాజేష్‌ గురువారం రాత్రి కిరాణా షాపుకని ఇంటినుంచి బయటికెళ్లాడు. రాత్రి ఇంటికి తిరిగిరాని రాజేష్‌ మర్నాడు ఉదయం నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో అనుమానాస్పద పరిస్థితుల్లో తీవ్రగాయాలతో కన్పించాడు. బాలుడ్ని వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స ప్రారంభించినా ఫలితం లేకపోయింది. రాజేష్‌ మీద దాడి చేసిందెవరు, కారణమేమిటన్నది ఇంతవరకు తెలియలేదు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు నాలుగు కంపార్టుమెంట్లలో వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. ఆలయంలో మహా లఘుదర్శనం అమలుచేస్తున్నారు.

పుట్టపర్తికి చేరుకున్న ప్రత్యేక రైళ్లు

పుట్టపర్తి: విశాఖ, విజయవాడ, సికింద్రాబాద్‌లనుంచీ బయల్దేరిన ప్రత్యేక రైళ్లు ఉదయం పుట్టపర్తి చేరుకున్నాయి. రైళ్లలో వచ్చిన భక్తుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్‌నుంచి ప్రశాంతినిలయానికి 60 బస్సులను ఏర్పాటు చేశారు.

మంచినీటికి గిరిజనుల పాట్లు

మండుటెండల్లో మూడు కిలోమీటర్ల నడక మెదక్ : పరిశుభ్రమైన మంచినీటిని, కాచి, చల్లార్చి తాగాలని ప్రభుత్వం ఢంకా బజాయిస్తోంది. అలా చేయకుంటే రోగాల బారిన పడతారని సెలవిస్తోంది. కనీసం నీరే దొరక్క అల్లాడుతున్న ప్రజలు, దాని కోసం కోసుల కొద్ది నడిచిపోతున్నారని గుర్తించి, ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం మరీ శోచనీయం. నారాయణఖేడ్‌ మండలంలోని అంబేదా గ్రామ పంచాయతీలోని పిర్లతండా గిరిజనులు గుక్కెడు నీటి అనునిత్యం యాతన అనుభవిస్తున్నారు. ప్రతి రోజూ ఒకటి కాదు, రెండు [...]

గిరిజన రైతుల సమస్యలు పష్కరించాలి

- గిరిజన సంఘం ఆధ్వర్యాన ఐటిడిఎ వద్ద ధర్నా విజయనగరం: ఏజన్సీలో జీడిరైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పార్వతీపురం ఐటిడిఎ వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యాన రైతులు ధర్నా చేశారు. ముందుగా ఆర్టీసి బస్టాండ్‌ నుంచి ఐటిడిఎ వరకు ర్యాలీ నిర్వహించారు. గిరిజన రైతులు లోపలకు వెళ్లకుండా ఐటిడిఎ ప్రధానగేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ గిరిజన రైతుల సమస్యపై ప్రభుత్వం [...]

ఐటిడిఎ పాలకవర్గాన్నిఅడ్డుకుంటాం

శ్రీకాకుళం: కన్నెధార కొండ మైనింగ్‌ లీజుపై విచారణను కొనసాగించకుంటే ఈనెల 28న నిర్వహించనున్న ఐటిడిఎ పాలకవర్గ సమావేశాన్ని అడ్డుకుంటామని కన్నెధార కొండ లీజు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు హెచ్చరించారు. ప్రాణాలర్పించైనా కన్నెధార కొండను రక్షించుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక ఇందిరానగర్‌ కాలనీలోని ఐద్వా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం పాలకొండ డివిజన్‌ కార్యదర్శి గంగారపు సింహాచలం, పోరాట కమిటీ కన్వీనర్‌ పత్తిక కుమార్‌ మాట్లాడారు. కన్నెధార లీజుపై వేసిన కమిటీ 90శాతం [...]

గిరిజనుల సమగ్రాభివృద్ధికి కృషి

విశాఖపట్నం: విశాఖ పట్నంలో ఏజెన్సీల గ్రామాలల్లో నివసిస్తున్న ఆదివాసి గిరిజనుల సమగ్రాభివృద్ధికి కృషిచేయనున్నట్లు ఐటిడిఎ పిఓ ముత్యాలరాజు అన్నారు. సోమవారం ఁర్వహించిన గిరిజన దర్బార్‌లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన గిరిజనుల నుండి అర్జీలను స్వీకరించారు. ముథోల్‌ మండలంలోఁ ఎడ్‌బిడ్‌ గ్రామాఁకి చెందిన జె. గంగాధర్‌ టెంట్‌హౌస్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకఁన్నారు. తిర్యాణి మండలం తంగిడి మధుర గ్రామాఁకి చెంది గేడం తారాబాయి అంగన్‌వాడీ ఉద్యోగంకోసం, దహెగాం మండలం కెస్లాపూర్‌ గ్రామాఁకి చెందిన నైతం రవి [...]

ఆజాద్‌ కేసు విచారణ 3 నెలల్లో పూర్తిచేయండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌ కేసుపై విచారణను 3 నెలల్లో పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐకి సూచించింది. ఆరువారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని కూడా సీబీఐకి సూచించింది. ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌ కేసును సీబీఐకి అప్పగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది.

Follow

Get every new post delivered to your Inbox.