‘రక్త చరిత్ర’పై హెచ్ఆర్సీలో పిటిషన్

హైదరాబాద్: హింసను ప్రేరేపిస్తూ, ఒక సామాజికవర్గాన్ని ప్రజలు అసహ్యించుకునే విధంగా చిత్రీకరించిన ‘రక్తచరిత్ర’ సినిమాను తక్షణమే నిషేధించాలని కోరుతూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలైంది. ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి, ఇతర నేతలు ఎస్.రాజశేఖర్, యు.కృష్ణారావు తదితరులు దీనిని దాఖలు చేశారు. ఒకవైపు ‘రియల్ స్టోరీ’ అని, మరోవైపు ‘కల్పితం’ అని ప్రచారం చేస్తూ ప్రజలను చిత్ర దర్శక, నిర్మాతలు అయోమయానికి గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన [...]

ముస్లిం నాయకుడికి ఆ అవకాశం

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రం వస్తే ఉపముఖ్యమంత్రి పదవి ముస్లిం నాయకుడికి కట్టబెడతామని తెరాస చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రి పదవిని ఏ వర్గంవారు అధిష్టిస్తారో మాత్రం చెప్పలేదు. తెలంగాణాలో మైనారిటీలకు న్యాయం చేసే పార్టీ తెరాస ఒక్కటేనని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణాకోసం తమ పార్టీ నేతలు రాజీనామాలు సమర్పిస్తారని తాను ప్రకటించినట్లుగానే చేసి చూపించామని గుర్తు చేశారు.

వర్మకు చిరంజీవికి సంధి కుదిరేనా?

హైదరాబాద్‌: రక్తచరిత్ర సినిమాతో సంచలనం సృష్టించిన రాంగోపాల్ వర్మ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి 150వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందువల్ల కథ ఎంపిక విషయంలోనే కాకుండా దర్సకుడి ఎంపికలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న చిరంజీవి ఇందుకు అంగీకరిస్తారా? చిరంజీవితో ‘దొర ది లార్డ్’ అనే చిత్రాన్ని తీయబోతున్నట్లు వర్మ తన ట్విట్టర్లో రాసుకున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ కూడా రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, [...]

జగన్ కు జైకొట్టి, రెంటికీ చెడ్డ రేవడిలా..

హైదరాబాద్: ఓవైపు తెలంగాణవాదానికి మద్దతు ఇస్తూనే.. మరోవైపు జగన్ కు జై కొడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. వీరికి ఇటూ తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తడంతో పాటు…సొంత పార్టీ నేతల నుంచి కూడా చీత్కారాలు ఎదుర్కుంటున్నారు. అందుకు ఉదాహరణ కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి. వైఎస్. జగన్ వీరాభిమానులైన ఈ నేతలు ప్రస్తుతం తెలంగాణలో గడ్డు పరిస్థితి ఎదుర్కుంటున్నారు. జగన్ కు మద్దతు ఇస్తూ అధిష్టానానికి వ్యతిరేకంగా [...]

చిరంజీవిపై భగ్గుమన్న వంగవీటి

విజయవాడ: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై శాసనసభ్యుడు వంగవీటి రాధ భగ్గుమన్నారు. తనకు సంబంధించిన దుర్గమ్మ ప్రభల కార్యక్రమానికి చిరంజీవి రాకపోవడంపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అంతర్గత కలహాలతో చిరంజీవి విజయవాడ పర్యటన రద్దయింది. దీంతో రాధ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనకు మంత్రిపదవి ఇస్తానని చెప్పినా చిరంజీవిని నమ్ముకుని తాను ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చానని, అందుకు తగిన శాస్తి అనుభవించానని వంగవీటి రాధ [...]

తెలంగాణ పై మాట తప్పితే…

హైదరాబాద్‌: తెలంగాణ పై మాట తప్పితే దండలు వేసిన ప్రజలే కోడిగుడ్లతో, రాళ్లతో కొడతారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ పై విచారణ జరిపించాల్సిందేనని ఆయన అన్నారు. ఎవడి సొమ్ము అని తెలంగాణ సంపదను దోచుకుంటారని ఆయన అడిగారు. 610 జీవో సమస్యను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర [...]

ఎస్‌కేయూకు కొత్త పాలకమండలి: ఇన్‌ఛార్జ్‌ వీసీ

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి త్వరలో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయనున్నట్లు ఇన్‌ఛార్జ్‌ వీసి రామ చంద్రారెడ్డి తెలిపారు. వీసీ పదవినుంచి కుసుమకుమారిని తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఆమెకు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. కుసుమకుమారి హయాంలో యూనివర్సిటీలో జరిగిన అక్రమాలను వెలికి తీసి చర్యలు తీసుకుంటామని, ఇప్పటివరకు అస్తవ్యస్థంగా తయారైన వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే ప్రస్తుతం తనముందన్న లక్ష్యమని రామచంద్రారెడ్డి తెలిపారు.

చంద్రబాబు వైఖరిని తప్పు పట్టిన కాంగ్రెసు

హైదరాబాద్: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఖరిని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తప్పు పట్టారు. మహబూబ్ నగర్ లో తలపెట్టిన తెలంగాణ త్యాగమూర్తుల సంస్మరణ సభలో పాల్గొనేందుకు బయలుదేరడానికి ముందు వారు శనివారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించడం వల్లనే సమస్య జఠిలమైందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ అన్నారు. శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ 31వ తేదీలోగా నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో పార్లమెంటులో తెలంగాణ [...]

వివాదాల ఊబిలో బోపయ్య

బెంగుళూరు: కర్ణాటకలో సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి స్పీకర్ కె.జి.బోపయ్య వ్యవహరిస్తోన్న తీరుపై సర్వత్రా విమర్శలు గుప్పుమంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వివాదాల ఊబిలో పీకలోతు కూరుకుపోయారు. స్పీకర్ కార్యాలయాన్ని బీజేపీ కార్యాలయంగా మార్చేశారని ముఖ్యమంత్రి కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని స్పీకర్‌పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఒక అడుగు ముందుకు వేసిన జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి స్పీకర్‌ను అయోగ్యుడంటూ అభివర్ణించారు. ఆ స్థానంలో కూర్చొనే అర్హత బోపయ్యకు లేదన్నారు. బీజేపీ [...]

సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్‌: డీఎస్సీ 2008 నోటిఫికేషన్‌ ప్రకారమే నియామకాలు చేపట్టాలంటూ బీఈడీ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. శనివారం బీఈడీ అభ్యర్థులు సచివాలయం ముట్టడికి యత్నించారు. వారిపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. అడ్డుకున్న పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. బిఇడి అభ్యర్థులు నాలుగు వైపుల నుంచి సచివాలయాన్ని ముట్టడించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా, గాంధీ ఆస్పత్రిలో బిఇడి అభ్యర్థులు ఐదుగురు నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. [...]

Follow

Get every new post delivered to your Inbox.