మైక్రో ఆగడాలపై కఠిన వైఖరి: డీజీపీ

వరంగల్: రాష్ట్రంలో మైక్రోఫైనాన్స్ సంస్థల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్న దృష్ట్యా వాటి ఆగడాలపై కఠినంగా వ్యవహరించాలని డీఎస్పీలకు ఇప్పటికే ఆదేశాలిచ్చామని డీజీపీ అరవిందరావు చెప్పారు. వరంగల్, కరీంగర్‌లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మైక్రోఫైనాన్స్ సంస్థల వల్ల ఎవరైనా వేధింపులకు గురైతే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. రాష్ట్రంలో మైక్రో ఆగడాలపై ఇప్పటి వరకు 19 కేసులు నమోదు చేశామని, చట్టాన్ని అతిక్రమించే మైక్రో సంస్థలపై చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.

గద్దర్ పిలిస్తే చర్చలకు సై

మెదక్: గద్దర్ ఆహ్వానిస్తే చర్చలకు వెళ్లేందుకు సిద్ధమని తెలంగాణ సమష్టి ఉద్యమ కార్యక్రమ నిర్వాహక కమిటీ నాయకురాలు, ప్రజా గాయని విమలక్క ప్రకటించారు. ప్రజాఫ్రంట్ సమష్టిగా సాగిపోయే కమ్మని పాట అని, అందులో చిన్న అపశ్రుతి దొర్లడం దురదృష్టకరమన్నారు. మెదక్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఫ్రంట్ ఉద్యమ రూపకల్పనలో తమకు భాగస్వామ్యం కల్పించని కారణంగానే.. బయటకు వచ్చామని విమలక్క వివరించారు.

దళిత క్రిస్టియన్ల వైపు జగన్ దృష్టి

నెల్లూరు: దళిత సిక్కులకు, బౌద్ధులకు మాదిరిగానే దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఓ లేఖ రాశారు. దళిత క్రిస్టియన్ల మద్దతు కోసం ఆయన ప్రధానికి ఆ విజ్ఞప్తి చేసినట్లు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో దళిత క్రిస్టియన్లు 15 శాతం ఉంటారు. చాలా మంది మాలలు, కొంత మంది మాదిగలు క్రిస్టియన్ మతాన్ని పుచ్చుకున్నారు. దాంతో వారికి [...]

27 నుంచి తెలంగాణ విద్రోహ నిరసనలు

ఆదిలాబాద్: రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 27నుంచి నవంబర్ 1 వరకు జిల్లాలో నిరసన, విద్రోహ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు స్థానిక టీఎన్‌జీవో భవనంలో చైర్మన్ మామిడి నారాయణ అధ్యక్షతన జిల్లా జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించారు. తెలంగాణ విద్రోహదిన సందర్భంగా వారం రోజుల పాటు జరిగే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు సమావేశం పలు తీర్మానాలను సైతం ఆమోదించింది. జేఏసీలోనూతన సంఘాలు [...]

లాయర్లకు లగడపాటి సలహా

విజయవాడ: హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుందని, అయితే దానికి డిసెంబర్ 31 వరకు లాయర్లు ఆగాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సీమాంధ్ర లాయర్లకు ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో సూచించారు. డిసెంబర్ 31 తర్వాత హైకోర్టు బెంచ్ ఇవ్వకుంటే తనతో పాటు న్యాయశాఖామంత్రి ఉద్యమంలో పాల్గొంటామని చెప్పారు. అయితే లాయర్లు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకుండా డిసెంబర్ 31 వరకు ఆగాలని చెప్పారు. అంతవరకు కోర్టులకు తాళాలు వేయటం, జిల్లా బంద్ లు [...]

ఎమ్మార్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టాలి

హైదరాబాద్: కోట్లాది రూపాయల కుంభకోణం దాగి ఉన్న ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయాలని, ఆ సంస్థను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని సీపీఐ అధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం డిమాండ్‌ చేసింది. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కోసం రైతులు, ఫ్లాట్ల యజమానుల వద్ద నుంచి సేకరించిన భూములను స్వాధీనం చేయాలని కోరింది. ఈ వ్యవహారంపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరేందుకు ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్‌.తులసి [...]

పీఆర్పీ రాజకీయాల్లో కొత్తమలుపు

విజయవాడ: విజయవాడ పీఆర్పీ రాజకీయాలు కొత్తమలుపు తిరుగుతున్నాయి. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ ప్రజారాజ్యంకి దూరం కావాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ పర్యటనను ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రద్దు చేసుకున్నందువలననే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాధ చెప్తున్నారు. పార్టీ నాయకులు నచ్చజెప్పుతున్నా ఆయన వినే పరిస్థితి లేదని అంటున్నారు. విజయవాడ మహాప్రభల కార్యక్రమానికి హాజరుకానందుకు చిరంజీవిపై ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసే అవకాశం [...]

‘లలిత కళాతోరణం’ పేరు మళ్ళీ సవరింపు

హైదరాబాద్: విమర్శలు వెల్లువెత్తడంతో లలిత కళా తోరణంపై రాష్ట్ర ప్రభుత్వం కాస్త కరుణించింది. తీసేసిన ‘తెలుగు’ పదాన్ని మళ్లీ చేర్చింది. లలిత కళా తోరణం పేరును ‘రాజీవ్‌గాంధీ తెలుగు లలిత కళాతోరణం’గా సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా, రాజీవ్‌గాంధీ పేరును తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ‘భూరి’ విరాళం ఇచ్చిన రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి ‘కోరిక’ మేరకు హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ‘తెలుగు లలిత కళాతోరణం’ పేరును ‘రాజీవ్‌గాంధీ కళాతోరణం’గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ [...]

ఉధృతమవుతున్న ఉద్యమం

విజయవాడ: విజయవాడ -గుంటూరు మధ్యలో హైకోర్టు బెంచ్ కోసం పోరాడుతున్న సీమాంధ్ర లాయర్లు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చి హామీ ఇచ్చే వరకు తాము ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరిస్తున్నారు. ఉద్యమం మా చేతుల్లోనుండి ప్రజల చేతుల్లోకి వెళితే పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని లాయర్లు అంటున్నారు. హైకోర్టు బెంచ్ పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని మంత్రి పార్థసారథిని లాయర్లు ముట్టడించారు. తమకు వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని [...]

ప్రకంపనలతో దద్దరిల్లుతున్న వనస్థలిపురం

హైదరాబాద్: భూ ప్రకంపనలతో రాజధానిలోని వనస్థలిపురం పరిసర ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. వరుసగా మూడో రోజైన ఆదివారం రాత్రి 8.30 నుంచి 9 గంటల ప్రాంతంలో మళ్లీ భూమిలోంచి రెండుసార్లు శబ్దాలు రావడంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు పెట్టారు. ఈ సందర్భంగా తోపులాటలు కూడా జరిగాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి స్వల్ప లాఠీచార్జి చేశారు. వనస్థలిపురం, సచివాలయ నగర్, వెంకటేశ్వర దేవాలయ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో [...]

Follow

Get every new post delivered to your Inbox.