హైదరాబాద్: ప్రతిపక్షనేత చంద్రబాబుపై జరిగిన దాడి కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని ప్రజారాజ్యం పార్టీ పేర్కొంది. ఎవరు ఎక్కడికైనా వెళ్లి తమ అభిప్రాయాలను వెల్లడించుకునే స్వేచ్ఛ ఉందని దానిని అడ్డుకోవడం తెరాసకు తగదని ఆపార్టీ అధికార ప్రతినిధిగౌతం విమర్శించారు. విద్యార్థులను రెచ్చగొట్టి భావోద్వేగాలతో రాజకీయాలు చేయాలనుకోవడం కేసీఆర్‌కు సరికాదన్నారు. పరిస్థితులను నియంత్రించడంలో పోలీసులు కూడా వైఫల్యం చెందారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పడానికి హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు
Filed under: వార్తలు | Leave a Comment »




